వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వైరస్ : వృద్దులు,అనారోగ్యంతో బాధపడుతున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ బారినపడుతున్నవారిలో యువతీ యువకుల కంటే వృద్దులే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా 70ఏళ్ల పైబడినవారు,అప్పటికే ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు డేటా స్పష్టం చేస్తోంది. ఆ డేటాను కింద చూడవచ్చు.

ఇప్పటివరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం

ఇప్పటివరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం

ఇప్పటివరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. కరోనా వైరస్ బారినపడి 10 ఏళ్ల లోపు చిన్నారులెవరూ మృత్యువాత పడలేదు. కరోనా కారణంగా కరోనా వైరస్ కారణంగా చిన్నపిల్లల్లో నమోదవుతున్న మరణాల రేటు అత్యల్పంగా ఉంది.

ఇక అప్పటికే ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నవారు.. ఏ ఆరోగ్య సమస్య లేనివారి కంటే.. వైరస్ ద్వారా ఎక్కువ ప్రభావితమవుతున్నారు. కింద ఆ డేటాను గమనించవచ్చు.

పైన పేర్కొన్నవాటిలో మీరు ఏ కేటగిరీకి చెందినా

పైన పేర్కొన్నవాటిలో మీరు ఏ కేటగిరీకి చెందినా

పైన పేర్కొన్నవాటిలో మీరు ఏ కేటగిరీకి చెందినా.. మీరు కరోనా వైరస్ కారణంగా ఎక్కువ ప్రమాదాన్ని పొంచి ఉన్నట్టుగా గమనించాలి. వైరస్ సోకకుండా ఉండే ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి.

-వైరస్ వల్ల ఎక్కువ ముప్పు పొంచివున్నవారు తీసుకోవాల్సిన అదనపు జాగ్రత్తలు ఇవే..

ఇంటికి అవసరమైన నిత్యావసర,కిరాణ వస్తువులను ముందే నిల్వ ఉంచుకోండి. తరుచూ కిరాణ షాపులకు వెళ్లడం లేదా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం చేయకండి.
తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించండి. మనిషికి మనిషికి మధ్య ఒక మీటరు దూరం పాటించాలి.
అత్యవసరమైన బయటకు వెళ్తే ఎక్కువ దూరం ప్రయాణించకుండా చూసుకోండి. తక్కువమందినే కలవడం,తరుచూ చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి.
గుంపులుగా జనం ఉన్న చోటకు వెళ్లవద్దు
అనవసరపు ప్రయాణాలను రద్దు చేసుకోవడం మంచిది.

ఒకవేళ మీరు కరోనా బారిన పడితే

ఒకవేళ మీరు కరోనా బారిన పడితే


ఒకవేళ మీరు కరోనా బారిన పడితే.. మరిన్ని జాగ్రత్తల కోసం మీ వైద్యుడు లేదా క్లినిక్ లేదా ఆసుపత్రిలో సంప్రదించండి. వైరస్ సోకిన తర్వాత ఎక్కువరోజులు స్వీయ నిర్బంధంలో ఉండటం మంచిది.

మందులు,టిష్యూ ఇతరత్రా సామాగ్రిని ముందే తెచ్చి పెట్టుకోండి. ఒకవేళ అనారోగ్యం బారినపడితే.. ఇంటి వద్దే చిన్న చిన్న చిట్కాలు పాటించండి. చాలావరకు ఇంట్లో ట్రీట్‌మెంట్‌‌తో కోలుకోగలుగుతారు. అలాగే అవసరమైన కిరాణ వస్తువులు ముందే తెచ్చి పెట్టుకోండి. తరుచూ బయటకు వెళ్లడం మానేయండి.

-ఒకవేళ కోవిడ్ 19 మీ ఏరియాలో ప్రబళితే..

-ఒకవేళ కోవిడ్ 19 మీ ఏరియాలో ప్రబళితే..


సాధ్యమైనంతవరకు ఇంట్లోనే ఉండండి.
ఇంటికి అవసరమైన సరుకులు,కిరాణ వస్తువులను సోషల్,కమర్షియల్ నెట్‌వర్క్స్,ఆన్‌లైన్ ద్వారా ఇంటికి తెప్పించుకోండి.

English summary
People above 70 years of age and people with medical issues either currently or previously are at the most risk from COVID-19. This data shows the elderly are at a much greater risk than young people
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X