బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: బెంగళూరు ప్రజలకు గుడ్ న్యూస్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లకు గ్రీన్ సిగ్నల్, సీఎం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరులో కరోనా వైరస్ కట్టడికి కర్ణాటక ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. బెంగళూరు సిటీలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ కట్టడి కోసం ఆ వ్యాధి అనుమానిత లక్షణాలు ఉన్న ప్రజలకు బెంగళూరు సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లోని మెడికల్ కాలేజ్ ఆసుపత్రుల్లో చికిత్స అందించడానికి కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, ఆ రాష్ట్ర వైద్య, విద్యా శిక్షణా శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్, అన్ని మెడికల్ కాలేజ్ ల యాజమాన్యం మంగళవారం జరిపిన చర్చలు ఫలించాయి. ప్రభుత్వం, మెడికల్ కాలేజ్ యాజమాన్యం జరిపిన చర్చలు ఫలించడంతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప బెంగళూరు సిటీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు.

<strong>Coronavirus: అక్కకు కరోనా పాజిటివ్, చెట్టెక్కిన చెల్లి పెళ్లి, ఎంకి పెళ్లి సబ్బు చావుకు వచ్చింది!</strong>Coronavirus: అక్కకు కరోనా పాజిటివ్, చెట్టెక్కిన చెల్లి పెళ్లి, ఎంకి పెళ్లి సబ్బు చావుకు వచ్చింది!

4, 500 బెడ్ లు రిజర్వ్

4, 500 బెడ్ లు రిజర్వ్

బెంగళూరు సిటీలో కరోనా లక్షణాలు ఉన్న అనుమానిత ప్రజలకు చికిత్స అందించడానికి మెడికల్ కాలేజ్ లు, వాటి అనుబంధ ఆసుపత్రుల్లో 4, 500 పడకలు (బెడ్ లు) కేటాయించడానికి మెడికల్ కాలేజ్ ల యాజమాన్యం అంగీకరించిందని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీడియాకు చెప్పారు. ఇక ముందు బెంగళూరు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మెడికల్ కాలేజ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందడానికి చక్కటి అవకాశం వచ్చిందని సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు.

మెడికల్ కాలేజ్ లు, విశ్వవిద్యాలయాలు

మెడికల్ కాలేజ్ లు, విశ్వవిద్యాలయాలు

ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజ్ ల్లో మాత్రమే కరోనా వైరస్ వ్యాధి నయం చెయ్యడానికి అవకాశం ఉంది. అయితే ఇక ముందు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లు, విశ్వవిద్యాలయాల్లో కరోనా వైరస్ వ్యాధి అనుమానితులకు చికిత్స అందించడానికి అవకాశం ఇచ్చామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. బెంగళూరులోని 11 మెడికల్ కాలేజ్ ల్లో 2, 200 పడకలు కరోనా రోగులకు చికిత్స అందించడానికి అవకాశం ఉందని సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు.

ప్రైవేట్ ల్యాబ్ లకు ఓకే

ప్రైవేట్ ల్యాబ్ లకు ఓకే

కరోనా వైరస్ వ్యాధి అనుమానితుల సంఖ్య పెరిగితే ప్రభుత్వానికి 4, 500 పడకలు ఇవ్వడానికి మెడికల్ కాలేజ్ ల యాజమాన్యం అంగీకరించిందని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రజలకు వైద్య పరీక్షలు చెయ్యడానికి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లు ల్యాబ్ లు ఏర్పాటు చేసుకోవడానికి తాము అనుమతి ఇచ్చామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు.

అన్నింటికి ఓకే

అన్నింటికి ఓకే

ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ప్రస్తుతం 2, 000 పడకలు ఉన్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ల్లో 4, 500 పడకలు కరోనా వ్యాధి రోగులకు అందుబాటులోకి వచ్చాయని, ఇప్పుడు బెంగళూరులో అనుమానిత కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించడానికి మొత్తం 6, 500 పడకలు సిద్దంగా ఉన్నాయని, అందుకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ల యాజమాన్యం అంగీకరించిందని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప వివరించారు.

Recommended Video

CPM Demands KCR To Increase The Tests & Save People Against COVID-19
ప్రైవేట్ సిబ్బందికి భీమా

ప్రైవేట్ సిబ్బందికి భీమా

కరోనా వైరస్ చికిత్స అందిస్తున్న ప్రైవేట్ కాలేజ్ సిబ్బంది, ఉద్యోగులకు ఆ వ్యాధి వలన ఏమైనా సమస్యలు ఎదురైతే వారికి ప్రభుత్వమే భీమా సదుపాయం కల్పిస్తుందని, వారు ఎలాంటి ఆందోళన చెందనవరసం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప వివరించారు. ఇప్పటికే అన్ని విషయాలపై బీబీఎంపీ అధికారులతో ప్రభుత్వం చర్చించిందని సీఎం బీఎస్. యడియూరప్ప వివరించారు. కర్ణాటక ప్రభుత్వం, ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం కలిసి పని చెయ్యడానికి ప్రత్యేకంగా సమన్వయ సమితి కమిటీ ఏర్పాటు చేశామని సీఎం. బీఎస్. యడియూరప్ప వివరించారు.

English summary
Coronavirus: Private medical colleges have agreed to treat coronavirus infections, says Karnataka Chief Minister B.S. Yediyurappa and Minister of Vocational Education Sudhakar led a meeting with the heads of private medical colleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X