• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Coronavirus: ప్రధాని, సీఎం అంటే లెక్కలేదు, రాత్రికిరాత్రే డిసైడ్, గేమ్స్ తో ప్రిన్సిపాల్ దూలతీరింది

|

న్యూఢిల్లీ/ లక్నో/ జలాన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి తాండవం చేస్తున్న సందర్బంగా దాదాపుగా అన్ని దేశాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. భారతదేశంలో మార్చి 25 తేదీ నుంచి లాక్ డౌన్ అమలు చేయ్యడంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా పలు ఆర్థికలావాదేవీలు, అనేక వ్యాపారాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినా విద్యార్థుల ప్రాణాలు కాపాడటానికి విద్యాసంస్థలు ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కరోనా వైరస్ నియమాలు గాలికివదిలేసి, ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం ఆదేశాలను పట్టించుకోకుండా విద్యార్థులను పశువుల మందలో తోలినట్లు గదుల్లో నిర్బంధించి తరగతులు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నియమాలు గాలికి వదిలి పాఠశాల ప్రారంభించిన రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు సైతంషాక్ కు గురైనారు. ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ తో పాటు యాజమాన్యం మీద కేసులు నమోదు కావడంతో వారి దూలతీరిపోయింది.

  China పేరు పలకడానికి PM Modi వణుకుతున్నారు - Congress Party || Oneindia Telugu

  Onions virus: కరోనాతో జట్టుపీక్కుంటే కొత్త లొల్లి, ఉల్లిలో కొత్త వైరస్ !, అమెరికా, కెనడాలో బ్యాన్ !

  నో చెప్పిన ప్రధాని మోడీ

  నో చెప్పిన ప్రధాని మోడీ

  దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, పబ్లిక్ పార్క్ లు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్ లు, స్విమ్మింగ్ పూల్స్ ఇలా చాలా వరకు గుమికూడే అవకాశాలు ఉన్న కార్యకలాపాలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం నో చెప్పింది. అయితే విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూల్స్ మాత్రం మేము ఓ విద్యాసంవత్సరం నష్టపోతామని, స్కూల్స్ ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నా కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నో చెప్పింది.

  రాత్రికి రాత్రే డిసైడ్ చేశారు

  రాత్రికి రాత్రే డిసైడ్ చేశారు

  ఉత్తరప్రదేశ్ లోని జలౌన్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఏమైనా సరే స్కూల్ ప్రారంభించాలని డిసైడ్ అయ్యింది. రాత్రికిరాత్రి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి మరుసటి రోజు విద్యార్థులను స్కూల్ కు పిలిపించి తరగతులు నిర్వహించారు. కరోనా వైరస్ నియమాలు గాలికివదిలేసి, ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలను పట్టించుకోకుండా విద్యార్థులను పశువుల మందలో తోలినట్లు గదుల్లో నిర్బంధించి తరగతులు నిర్వహించారు. కొన్ని నెలల తరువాత స్కూల్స్ ప్రారంభం కావడంతో విద్యార్థులు సైతం చాలా ఉత్సాహంగా స్కూల్ కు వెళ్లారు.

  వీళ్లు చేసిన పనికి ఫోటోలు వైరల్

  వీళ్లు చేసిన పనికి ఫోటోలు వైరల్

  మీ పిల్లలు కరోనా వైరస్ బారిన పడకుండా తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, స్కూల్ లో, తరగుతల గదుల్లో భౌతిక దూరం పాటిస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చిన స్కూల్ యాజమాన్యం ఆ నియమాలు మొత్తం గాలికి వదిలేసింది. ఒకే గదిలో సుమారు 50 నుంచి 70 మంది విద్యార్థులను కుర్చోబెట్టి వారికి పాఠాలు చెప్పారు. విద్యార్థులు గుంపులు గుంపులుగా కుర్చున్న సమయంలో తీసిన ఫోటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.

  ప్రిన్సిపాల్ దూల తీరిపోయింది

  ప్రిన్సిపాల్ దూల తీరిపోయింది

  ఇదే సమమంలో మా పిల్లలు ప్రాణాలతో స్కూల్ యాజమాన్యం చెలగాటం ఆడుతోంది, ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని, ఎక్కడ మా పిల్లలు కరోనా వైరస్ బారినపడుతారో అనే భయంగా ఉందని విద్యార్థుల కుటుంబ సభ్యులు ఉత్దర్ ప్రదేశ్ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేశారు. రంగంలోకి దిగిన విద్యాశాఖ అధికారులు జలాన్ లోని ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ లతో పాటు ఆ విద్యాసంస్థ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం

  కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం

  ఉత్దరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉత్దరప్రదేశ్ లో విద్యాసంస్థలు ప్రారంభించడానికి తాము ఇంకా అంగీకరించలేదని ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పదేపదే మీడియా ముందు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం, సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదేశాలు, నియమాలు గాలికి వదిలి పాఠశాల ప్రారంభించిన రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు సైతంషాక్ కు గురైనారు. జలౌన్ లోని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్దరప్రదేశ్ ప్రభుత్వ అధికారులు తెలిపారు.

  English summary
  Coronavirus: No instructions have been issued by Uttar Pradesh government to reopen schools. But private school in Jalaun city conducted classes by calling students to the school amid COVID-19.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X