వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ఎవరక్కడ..... సీఎంకు క్వారంటైన్ సిద్దం చెయ్యండి, చిత్తం ప్రభు, అసెంబ్లీ దెబ్బతో !

|
Google Oneindia TeluguNews

చండీఘడ్/ పంజాబ్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు మరో ముఖ్యమంత్రి హడలిపోయారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సీఎంతో అధికార పార్టీ నాయకులు, అధికారులకు టెన్షన్ మొదలైయ్యింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలు హ్యాపీగా ఇంటికి వెళ్లారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. ఎవరక్కడ సీఎంకు క్వారంటైన్ సిద్దం చెయ్యండి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడొచ్చిన రామాయణం ఎందుకైనా మనకే మంచిది అంటూ క్యాప్టెన్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. సీఎంతో పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన అధికారులు హోమ్ క్వారంటైన్ బాటపట్టారు.

Super CM: తండ్రి సీఎం, కొడుకు సూపర్ సీఎం, ఏడాదిలో రూ. 5, 000 కోట్లు లూటీ ?, సాక్షం, లక్ష్మణ్ !Super CM: తండ్రి సీఎం, కొడుకు సూపర్ సీఎం, ఏడాదిలో రూ. 5, 000 కోట్లు లూటీ ?, సాక్షం, లక్ష్మణ్ !

అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీ సమావేశాలు

పంజాబ్ లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. శుక్రవారం పంజాబ్ అసెంబ్లీకి ఆరాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టన్ అమరీందర్ సింగ్, స్సీకర్ తో పాటు మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు హాజరైనారు. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు అందరూ దర్జాగా హాజరైనారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేలకు వైద్యశాఖ అధికారులు వైద్యపరీక్షలు పరీక్షలు నిర్వహించారు.

 సార్.... ఎలా చెప్పాలో తెలీడం లేదు

సార్.... ఎలా చెప్పాలో తెలీడం లేదు

అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వారికి నిర్వహించిన వైద్యపరీక్షల్లో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. ఈ విషయాన్ని సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కు చెప్పడానికి అధికారులు పరుగులు తీశారు. సార్ ఎలా చెప్పాలో తెలీదు, అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి వెళ్లారు అని చెప్పారు. సార్ ఎందుకైనా మంచింది, మీరు ఐసోలేషన్ లో చికిత్స చేయించుకోండి అంటూ అధికారులు చల్లగా అసలు విషయం చెప్పారు.

ఎవరక్కడ.... సీఎంకు క్వారంటైన్ సిద్దం చెయ్యండి

ఎవరక్కడ.... సీఎంకు క్వారంటైన్ సిద్దం చెయ్యండి

విషయం తెలుసుకున్న సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ వెంటనే అధికారులను పిలిచి కరోనా పాజిటివ్ వచ్చిన ఎమ్మెల్యేలతో సన్నిహితంగా మెలిగిన సాటి ఎమ్మెల్యేలు అందరూ వైద్యపరీక్షలు చేయించుకోవాలని, పంజాబ్ భవన్, ఎమ్మెల్యేల క్వాటర్స్ దగ్గర త్వరితగతిన కరోనా వైద్యపరీక్షలు నిర్వహించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు వైద్య సిబ్బందిని పిలిచి సీఎం క్వారంటైన్ లో ఉండటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు.

నో ఎంట్రీ బోర్డు పెట్టండి

నో ఎంట్రీ బోర్డు పెట్టండి

వైద్యపరీక్షలు చేయించుకున్న ఎమ్మెల్యేలకు 48 గంటల తరువాత నెగటివ్ వస్తే మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని సూచించండి, పాజిటివ్ వచ్చిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడానికి అవకాశం లేదని నో ఎంట్రీ బోర్డు పెట్టండి అంటూ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అసెంబ్లీ, వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Recommended Video

Japan PM Shinzo Abe Resigns, Longest Serving PM Apologise To People || Oneindia Telugu
29 నాటౌట్

29 నాటౌట్

పంజాబ్ లో ఇప్పటి వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలుపుకుని 29 మంది కరోనా వైరస్ బారినపడ్డారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్వయంగా వెళ్లడించారు. ఎమ్మెల్యేల దెబ్బతో ఇప్పుడు సీఎం కెప్టెన్ అమరీంద్ సింగ్ సైతం ఐపోలేషన్ లోకి వెళ్లిపోయారు. పంజాబ్ లో ఇప్పటి వరకు 47, 812మ మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడగా వైరస్ బారినపడి 1, 256 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

English summary
Coronavirus: Punjab Chief Minister Amarinder Singh has gone into 7-day home quarantine after he met in the state assembly two MLAs who later tested positive for coronavirus, a senior state official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X