వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మతబోధకుడి అంత్యక్రియల్లో వేలాది మంది: కరోనా నిబంధనలు?(వీడియో)

|
Google Oneindia TeluguNews

లక్నో: దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూ అనేక మంది ప్రాణాలు తీస్తోందన్న విషయం వీరంతా మరిచారు. తమ మతబోధకుడి అంత్యక్రియలకు వేలాది మంది ముస్లింలు హజరయ్యారు. పలువురు మాస్కులు ధరించలేదు. భౌతిక దూరం కూడా పాటించలేదు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్‌లో చోటు చేసుకుంది.

ఆదివారం సాయంత్రం మతబోధకుడు అబ్దుల్ హమీద్ మొహమ్మద్ సలీముల్ ఖాద్రి మరణించారు. ప్రజల సందర్శనార్థం ఖాద్రి మృతదేహాన్ని ఉంచడంతో విషయం తెలిసి వేలాది మంది బదౌన్ చేరుకున్నారు. అక్కడ అన్ని కరోనా సేఫ్టీ రూల్స్ ఉల్లంఘించబడ్డాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ వాటినీ లెక్కచేయలేదు.

coronavirus Rules Tossed Aside At UP Clerics Funeral, Thousands Attend

పెద్ద సంఖ్యలో చేరినవారిలో కొందరు మాత్రమే మాస్కులు ధరించి కనిపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ స్థాయిలో భారీగా గుమిగూడిన జనాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించకుండా ఇలా గుమిగూడటం వల్ల కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎపిడమిక్ యాక్ట్ కింద గుర్తుతెలియని ప్రజలపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బదౌన్ పోలీస్ సూపరింటెండెంట్ సంకల్ప్ శర్మ తెలిపారు.

యూపీలో ఇటీవల జరిగిన కుంభమేళాతోపాటు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటంతో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా, కరోనా కట్టడి కోసం యూపీ ప్రభుత్వం అంత్యక్రియలకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించడం గమనార్మం.

మాస్కులు ధరించకుంటే రూ. 1000 జరిమానా ఆదేశాలు కూడా అమలులోనే ఉన్నాయి. రెండోసారి మాస్కులు ధరించకుండా దొరికితే 10,000 జరిమానా విధిస్తామని యూపీ సర్కారు స్పష్టం చేసింది. అయినప్పటికీ జనాలు కరోనా నిబంధనలు పాటించకుండా కరోనా కేసుల పెరుగుదలకు కారణమవుతున్నారు. కాగా, గత కొద్ది రోజులుగా యూపీలో ప్రతిరోజు 20వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతుండటం గమనార్హం.

English summary
Covid Rules Tossed Aside At UP Cleric's Funeral, Thousands Attend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X