వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో 179మందికి ప్రాణాంతక వైరస్: రెండు రాష్ట్రాల్లో ప్రమాదకర స్థితుల్లో: కేంద్రం ఆరా..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనాను చుట్టముట్టేసిన ప్రాణాంతక నావల్ కరోనా వైరస్ (nCoV) జాడ భారత్‌లో కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లో దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. మహారాష్ట్ర, కేరళల్లో 179 మంది ఈ వైరస్ బారిన పడినట్టుగా అనుమానిస్తున్నారు. వారందర్నీ ఆసుప్రతుల్లో ఉంచి, పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో వారి కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. దీనిపై కేంద్రం ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయమే రంగంలోకి దిగింది.

నివేదికలు తెప్పించకుంటోన్న కేంద్రం..

నివేదికలు తెప్పించకుంటోన్న కేంద్రం..

మహారాష్ట్ర, కేరళ ప్రభుత్వాల నుంచి నివేదికలను తెప్పించుకుంటోంది. కరోనా వైరస్ బారిన పడినట్లుగా భావిస్తోన్న వందమందికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటిదాకా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. అయినప్పటికీ.. వారిందర్నీ పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలను నిర్వహించాల్సి ఉందని అన్నారు. ఇదివరకు చైనాకు చెందిన నలుగురు ప్రయాణికుల్లో కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు.

ఒక్క కేరళలోనే..

ఒక్క కేరళలోనే..


చైనా నుంచి వచ్చిన 179 మందిని తాము వేర్వేరు ఆసుపత్రుల్లో ఉంచి పరీక్షలను నిర్వహిస్తున్నామని, దీనికోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామని కేరళ వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. త్రిశూర్, తిరువనంతపురం, పత్తినంతిట్ట, మళప్పురంలల్లో ఒక్కొక్కరికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని, వారిని పుణేలోని జాతీయ అంటువ్యాధుల నిరోధక కేంద్రంలో ఉంచి, ప్రత్యేకంగా వైద్య చికిత్సలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

ముంబైలో ముగ్గురికి..

ముంబైలో ముగ్గురికి..


మహారాష్ట్రలో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. వారికి ముంబైలోని ఆసుపత్రిలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. రక్త నమూనాలను సేకరించారు. వైరస్ సోకిందా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇదిలావుండగా.. కరోనా వైరస్‌ను .నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.

హోం మంత్రిత్వ శాఖతో అత్యవసర భేటీ..

హోం మంత్రిత్వ శాఖతో అత్యవసర భేటీ..

ప్రధానమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. క్యాబినెట్ కార్యదర్శితో పాటు హోం, విదేశాంగం, రక్షణ, ఆరోగ్యం, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఆయా మంత్రిత్వ శాఖలు చేపట్టాల్సిన చర్యలపై పీకే మిశ్రా.. వారితో చర్చించారు. కొన్ని మార్గదర్శకాలను ఈ సందర్భంగా జారీ చేశారు.

కాల్ సెంటర్ ఏర్పాటు..

కాల్ సెంటర్ ఏర్పాటు..

కరోనా వైరస్ కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దీని నంబర్ +91-11-23978046. రౌండ్ ద క్లాక్ తరహాలో పని చేస్తుందీ కాల్ సెంటర్. దీనితోపాటు- చైనీయులు ఎక్కవగా సందర్శించే న్యూఢిల్లీ, కోల్‌కత, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోచి విమానాశ్రయాల్లో అదనపు థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం డైరెక్టర్ వర్ధన్ తెలిపారు.

English summary
Health ministry officials briefed principal secretary to the Prime Minister on the preparedness of hospitals, laboratories as well as on measures being taken for the capacity building of rapid response teams to deal with possible cases of coronavirus in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X