బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirusతో ప్రపంచాన్ని అంతం చేద్దాం రండి, రోడ్ల మీద తుమ్మండి, ఇన్ఫోసిస్ టెక్కీ అరెస్టు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) పేరు చెబితే నేడు ప్రపంచ దేశాల హడలిపోతున్నాయి. కరోనా వైరస్ వ్యాధి వ్యాపించడంతో ఇప్పటి వరకు 27, 370 మంది మరణించి 5, 97, 458 మంది మృత్యువుతో పోరాడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచ ప్రసిద్ది చెందిన ఇన్ఫోసిస్ సాఫ్ట్ వేర్ కంపెనీలో నెలకు రూ. 1. 40 లక్షల జీతం తీసుకుంటున్న టెక్కీ మీరు రోడ్ల మీదకు వచ్చి ఇష్టం వచ్చినట్లు తుమ్మండి, కరోనా వైరస్ వ్యాపింపజెయ్యండి, మనం ప్రపంచాన్ని అంతం చేద్దాం అంటూ బహిరంగంగా పిలుపునిచ్చాడు. నెటిజన్లు విషయం పోలీసులకు చెప్పడంతో అతన్ని అరెస్టు చేసి బెండ్ తీశారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న టెక్కీని ఉద్యోగం నుంచి తీసివేశామని ప్రముఖ ఇన్ఫోసిస్ కంపెనీ తెలిపింది.

నాకు కరోనా వైరస్ వచ్చింది, దమ్ముంటే దగ్గరకు రండి, చస్తారు, పోలీసులకు సవాల్, సీన్ కట్ చేస్తే !నాకు కరోనా వైరస్ వచ్చింది, దమ్ముంటే దగ్గరకు రండి, చస్తారు, పోలీసులకు సవాల్, సీన్ కట్ చేస్తే !

 బెంగళూరులో పుట్టిపెరిగి !

బెంగళూరులో పుట్టిపెరిగి !

బెంగళూరు నగరంలోని కేఆర్ పురం రైల్వేస్టేషన్- ఐటీపీఎల్ మెయిన్ రోడ్డులోని మహదేవపుర సమీపంలోని ఎ. నారాయణపురకు చెందిన ముజీబ్ మహమ్మద్ అలియాస్ ముజీబ్ (34) ప్రపంప ప్రసిద్ది చెందిన ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు.

 నెలకు రూ. 1. 40 లక్షలు జీతం

నెలకు రూ. 1. 40 లక్షలు జీతం

బెంగళూరు నగరంలోనే పుట్టిపెరిగిన ముజీబ్ మహమ్మద్ ఇక్కడే విద్యాభ్యాసం చేశాడు. తరువాత బెంగళూరులోనే ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుని ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం సంపాధించాడు. కరోనా వైరస్ వ్యాధి వ్యాపిస్తున్న సమయంలో ఇన్ఫోసిస్ కంపెనీ సూచనల మేరకు ముజీబ్ మహమ్మద్ ఇంటి నుంచి (వర్క్ ఫ్రం హోమ్) విధులు నిర్వహిస్తున్నాడు.

 కరోనాతో ప్రపంచాన్ని అంతం చేద్దాం రండి !

కరోనాతో ప్రపంచాన్ని అంతం చేద్దాం రండి !

ఇంటి నుంచి విధులు నిర్వహిస్తున్న ముజీబ్ మహమ్మద్ Spread the word to end the word అంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. అందరూ ఇళ్ల నుంచి రోడ్ల మీదకు రండి, కరోనా వైరస్ ని వ్యాపింపజెయ్యండి, ప్రపంచాన్ని అంతం చెయ్యడానికి మీరు సహకరించండి అంటూ అతని ఫోటోతో సహ ఫేస్ బుక్ లో ట్యాగ్ చేశాడు.

 పోలీసులకు, ఇన్ఫోసిస్ కు సమాచారం

పోలీసులకు, ఇన్ఫోసిస్ కు సమాచారం

ముజీబ్ మహమ్మద్ ఫేస్ బుక్ పోస్టు చూసిన కొందరు వెంటనే అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని బెంగళూరు పోలీసులు, ఇన్ఫోసిస్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న బెంగళూరు పోలీసులు స్వచ్చందంగా ముజీబ్ మహమ్మద్ మీద కేసు నమోదు చేసి అతని కోసం గాలించారు.

ఉద్యోగం ఊడిపోయింది

ఉద్యోగం ఊడిపోయింది

విషయం తెలుసుకున్న బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ముజీబ్ మహమ్మద్ అడ్రస్ వెతికి పట్టుకుని అతన్ని అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న ఇన్ఫోసిస్ కంపెనీ యాజమాన్యం సీరియస్ అయ్యింది. ఇలాంటి చిల్లర చేష్టలను మా కంపెనీ సహించదని, మా ఉద్యోగి ముజీబ్ మహమ్మద్ చేసింది పెద్దతప్పు అని మాకు తెలిసిందని, అతన్ని ఉద్యోగం నుంచి తొలగించామని ప్రకటించింది.

 వీడు తమాషాకు చేశాడంట ?

వీడు తమాషాకు చేశాడంట ?

ప్రపంచంని ప్రజలు అందరూ కరోనా వైరస్ (COVID-19) పేరు చెబితో హడలిపోతున్నారని, ఇలాంటి సమయంలో ఇలాంటి పోస్టు పెడితే ఎలాగుంటుంది ? అని తెలుసుకోవడానికి తమాషాకు ఫేస్ బుక్ లో ఈ పోస్టు చేశానని ముజీబ్ మహమ్మద్ చెబుతున్నాడని ఓ సీనియర్ పోలీసు అధికారులు అన్నారు. ముజీబ్ మహమ్మద్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. ముజీబ్ మహమ్మద్ తమాషాకు ఫేస్ బుక్ లో ఈ పోస్టు చేశాడా ? లేక అతనికి ఏమైనా దురుద్దేశం ఉందా ? అనే కోణంలో విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.

English summary
Coronavirus Scare: Infosys Techie named Mujeeb Mohamad has been arrested by CCB police for creating Panic by posting Facebook post saying will spread Coronavirus (COVID 19).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X