వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: కరోనా రోగి ఉన్నాడని కాక్ పిట్ లో నుంచి దూకేసిన పైలెట్, ప్రయాణికులు ? !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ (COVID-19) ప్రభావం రోజురోజుకు పెరిగిపోతుంది. చివరికి అనుమానిత కరోనా వైరస్ వ్యాధి అనుమానిత రోగులు విమానంలో ప్రయాణిస్తున్నారనే భయంతో పైలెట్లు హడలిపోతున్నారు. కరోనా వైరస్ వ్యాధి అనుమానిత రోగి విమానంలో ప్రయాణిస్తున్నాడని సమాచారం అందిన వెంటనే ఆ విమానం పైలెట్ ఆందోళకు గురైనాడు. ఎక్కడ తనకు కరోనా వైరస్ వ్యాధి సోకుతుందో అనే ప్రాణ భయంతో ఆ విమానం పైలెట్ కాక్ పిట్ లో నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టులో కిందకు దూకేశాడు.

Coronavirus: దుబాయ్ టూ బెంగళూరు, 6 మందికి కరోనా వైరస్, 195 మందిలో, మొత్తం 21!Coronavirus: దుబాయ్ టూ బెంగళూరు, 6 మందికి కరోనా వైరస్, 195 మందిలో, మొత్తం 21!

 పూణే టూ ఢిల్లీ

పూణే టూ ఢిల్లీ

కరోనా వైరస్ దెబ్బ భారతదేశంలో పడింది. ఈనెల 20వ తేదీన పూణే నుంచి ఢిల్లీకి 15-732 ఎయిర్ ఏసియా విమానం ప్రయాణించింది. ఈ ఎయిర్ ఏసియా విమానంలో ప్రయాణికులు చాలా మంది ఉన్నారు. ఎయిర్ ఏసియా విమానం ప్రయాణించినప్పటికే భారతదేశంలో కరోనా వైరస్ వ్యాధుల సంఖ్య పెరిగిపోతూ వచ్చింది.

 పైలెట్ కు కరోనా వైరస్ భయం

పైలెట్ కు కరోనా వైరస్ భయం

పూణే నుంచి ఢిల్లీకి 15-732 ఎయిర్ ఏసియా విమానంలో కరోనా వైరస్ వ్యాధి అనుమానిత రోగి ప్రయాణిస్తున్నాడని, తన ముందు సీటులోనే ఆ రోగి కుర్చున్నాడని ఆ విమానం పైలెట్ కు తెలిసింది. అంతే అప్పటి నుంచి విమానం పైలెట్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ విమానం నడిపాడు.

 ఎయిర్ పోర్టు మారుమూలలో ల్యాండ్ !

ఎయిర్ పోర్టు మారుమూలలో ల్యాండ్ !

విమానం ఢిల్లీ విమానాశ్రయం చేరుకుంది. విమానాశ్రయం మారుమూల ప్రాంతంలో విమానం నిలపాలని సంబంధిత అధికారులు పైలెట్ కు సూచించారు. అధికారుల సూచన మేరకు విమానం ల్యాండ్ అయిన తరువాత ఎయిర్ పోర్టు మారుమూల ప్రాంతానికి విమానం తీసుకెళ్లారు.

 కాక్ పిట్ లో నుంచి దూకేసిన పైలెట్ !

కాక్ పిట్ లో నుంచి దూకేసిన పైలెట్ !

విమానంలోని కరోనా వైరస్ అనుమానిత ప్రయాణికుడికి వైద్యపరీక్షలు నిర్వహించడంతో నెగిటివ్ అనే తేలింది. అనంతరం విమాన ప్రయాణికులు, సిబ్బందిని ముందు ద్వారం నుంచి కాకుండా వెనుక ద్వారం నుంచి కిందకు దించారు. ఆ సమయంలో పైలెట్ విమానం దిగకుండా చాలా సేపు క్యాబిన్ లో సెల్ఫ్ క్వారెంటైన్ విధించుకున్నాడు. తరువాత ఒక్కసారిగా విమానంలోని కాక్ పిట్ లోని కిటికీలో నుంచి కిందకు దూకేసిన పైలెట్ ఎయిర్ పోర్టు నుంచి బయటకు పరుగు తీశాడు.

Recommended Video

PM Modi Telugu Speech On Coronavirus | 'Janata Curfew' Why Only One Day ? | Oneindia Telugu
 స్ప్రేయింగ్, శానిటైజ్

స్ప్రేయింగ్, శానిటైజ్

విమానంలో స్ప్రేయింగ్ చేసి శుభ్రం చేశారు. తరువాత విమానాన్ని శానిటైజ్ చేశారు. అనంతరం విమానంలోని ప్రయాణికులకు కరోనా వైరస్ వ్యాధి సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు కనిపిస్తే తాము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని, ప్రయాణికులు, సిబ్బందికి ఆ వ్యాధి సోకకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఎయిర్ ఎసియా ప్రతినిధులు తెలిపారు. మొత్తం మీద ఎక్కడ కరోనా వైరస్ వ్యాధి సోకుతుందో అనే భయంతో పైలెట్ ఆందోళన చెంది కాక్ పిట్ నుంచి కిందకు దూకేశాడని ఆలస్యంగా విషయం వెలుగు చూడటంతో అది కాస్త వైరల్ అయ్యింది.

English summary
Coronavirus Scare: Pilot Jumps Out Of Cockpit In Air Asia Flight Over COVID 19 Scare.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X