వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

100 అమెరికా కంపెనీలపై కన్నేసిన యోగి ఆదిత్యనాథ్: చైనా నుంచి యూపీకి ఎంఎన్సీలు క్యూ!

|
Google Oneindia TeluguNews

లక్నో: చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనావైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రెండున్నర లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. చైనాలో ఇప్పటికీ కరోనావైరస్ పూర్తిగా అదుపులోకి రాలేదు. కరోనా సంక్షోభంలో కూరుకుపోయిన చైనా నుంచి అనేక బహుళజాతి సంస్థలు బయటికి రావాలని చూస్తున్నాయి.

 వైద్యులతో జమాతే సభ్యుల అసభ్య ప్రవర్తన: యోగి సీరియస్, ఎన్ఎస్ఏ కింద కేసులకు ఆదేశం వైద్యులతో జమాతే సభ్యుల అసభ్య ప్రవర్తన: యోగి సీరియస్, ఎన్ఎస్ఏ కింద కేసులకు ఆదేశం

చైనా నుంచి భారత్ వైపు కంపెనీలు..

చైనా నుంచి భారత్ వైపు కంపెనీలు..

ఈ నేపథ్యంలో చైనా నుంచి బయటకు రావాలనుకునే బహుళజాతి కంపెనీలకు ముఖ్యంగా అమెరికాకు చెందిన సంస్థలకు భారతదేశం మెరుగైన అవకాశంగా కనిపిస్తోంది. ఇప్పుడు అనేక సంస్థలు భారతదేశంలో తమ సంస్థలను ఏర్పాటు చేయాలని చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు ఇప్పటికే మనదేశంలోని కొన్ని రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముందు వరుసలో ఉంది.

100 కంపెనీలపై యోగి కన్ను..

100 కంపెనీలపై యోగి కన్ను..

చైనాను వీడనున్న 100 కంపెనీలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రి సిద్ధార్థ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్ని అవకాశంగా మలచుకునేందుకు ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ కృషి చేస్తున్నారని చెప్పారు.

యూపీకి గ్రీన్ సిగ్నల్..

యూపీకి గ్రీన్ సిగ్నల్..


మంగళవారం దాదాపు 100 అమెరికా కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరుపగా, చాలా కంపెనీలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి ఆసక్తి వ్యక్తం చేశాయని సింగ్ తెలిపారు. ఆసక్తి కనబరిచిన వాటిలో లాజిస్టిక్స్, శాస్త్ర సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీలు ఉన్నాయని సిద్ధార్థ్ సింగ్ చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వ అందిస్తున్న సహకారాల పట్ల కంపెనీలు సంతృప్తి వ్యక్తం చేశాయని తెలిపారు.

కరోనాపై చర్యలకు అమెరికా కంపెనీల ప్రశంసలు

కరోనాపై చర్యలకు అమెరికా కంపెనీల ప్రశంసలు

వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మెడిసిన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, విద్య, రక్షణ రంగాలకు యూపీ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన విధానాలను సీఎం యోగి ఆదిత్యనాథ్ వివరించారని తెలిపారు. కరోనాపై యూపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కంపెనీల ప్రతినిధులు ప్రశంసించారని తెలిపారు. అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదికగా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిందని మంత్రి సిద్ధార్థ వెల్లడించారు. అడోబ్, బోస్టన్ సైంటిఫిక్, ఇతర యూపీఎస్ కంపెనీలు యూపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.

English summary
Coronavirus: Several US firms show interest in Uttar Pradesh, plan to back from China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X