Coronavirus: ఎస్పీ బాలసుబ్రమణ్యం భార్యకు కరోనా పాజిటివ్: చరణ్, వసంత వివరణ, ఏఆర్ రెహమాన్!
చెన్నై/ హైదరాబాద్: ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, నటుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గత పది రోజుల నుంచి కరోనా వైరస్ (COVID 19) బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి ఎస్పీ బాలసుబ్రమణ్యంను ఐసీయూకి తరలించి చికిత్స చేస్తున్నామని స్వయంగా ఆసుపత్రి వర్గాలు వెళ్లడించాయి. ఇదే సమయంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం సోదరి వసంత, ఆయన కుమారుడు ఎస్పీ. చరణ్ వివరణ ఇచ్చారు. నిన్నటిపైన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం ఇప్పుడు చాలా కుదటపడిందని, ఆయన అభిమానులు ఎవ్వరూ ఆందోళన చెందనవసరం లేదని వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో ఫేమస్ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం సతీమణి (భార్య) సావిత్రికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో బాలు సన్నిహితులు, ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, సింగర్ చిత్ర తదితరులు ఆందోళన వ్యక్తంచేశారు.
youtube plan: ప్లాన్ A నాటుకోడి, B ఐస్ క్రీమ్, ఒంటరి జీవితం, ఆస్తి కోసం ఫ్యామిలీ మొత్తానికి స్కెచ్!

ఎస్పీ బాలు ఏం చేశారు ?
కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా గత కొంతకాలం నుంచి అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్న ఫేమస్ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం చెన్నైలోని ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. ఇదే సమయంలో ఆగస్టు 5వ తేదీన ఎస్పీ బాలసుబ్రమణ్యంకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్దారించారు. వైద్యుల సలహామేరకు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ మందులు వేసుకుని కరోనా నుంచి కోలుకోవాలని మొదట ఎస్పీ బాలసుబ్రమణ్యం బావించారు.

రాత్రి ఒక్కసారి సీరియస్
తన కారణంగా కుటుంబ సభ్యులు ఎందుకు ఇబ్బందులు పడాలని ఎస్పీ బాలసుబ్రమణ్యం చెన్నై సిటీలోని ప్రముఖ ఎంజీఎం ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. గురువారం రాత్రి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. ఇదే సమయంలో కొన్ని తమిళ టీవీ చానల్స్ లో, సోషల్ మీడియాలో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై అనేక పుకార్లు చక్కర్లు కొట్టాయి.

డాక్టర్ బాలు ఎలాగున్నారు ?
ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో రకరకాలుగా ప్రచారం జరగడంతో ఆయన శ్రేయోభిలాషులు, సన్నిహితులు, సంగీత అభిమానులు ఎంజీఎం ఆసుపత్రి దగ్గరకు క్యూ కట్టారు. బాలు అభిమానులు తాకిడి ఎక్కువ కావడంతో శుక్రవారం సాయంత్రం ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఐసీయూలో బాలు చికిత్స పొందుతున్నారని, ఆయనకు వెంటిలేటర్ అమర్చామని, ప్రత్యేక వైద్యులు చికిత్స అందిస్తున్నారని, చికిత్సకు ఆయన పూర్తిగా సహకరిస్తున్నారని ఎంజీఎం ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అనురాద వివరణ ఇచ్చారు.

చరణ్, వసంత వివరణ
శుక్రవారం ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ఎస్పీ బాలసుబ్రమణ్యం హెల్త్ బులిటెన్ విడుదల చేసిన తరువాత ఆయన కుటుంబ సభ్యులు మరో ప్రకటన విడుదల చేశారు. నాన్నగారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, త్వరగా తాను కోలుకుంటానని నాన్నగారు చాలా ధైర్యంగా ఉన్నారని, అభిమానులు ఎవ్వరూ నిరాశ చెందకూడదని, ఓ తమిళ టీవీ చానల్ లో వస్తున్న వార్తలు నమ్మకూడదని బాలు కుమారుడు, ప్రముఖ సింగర్ ఎస్పీ చరణ్ వివరణ ఇచ్చారు. శుక్రవారం మద్యాహ్నం అన్నయ్య (బాలు) ఆరోగ్యం విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స అందించిన తరువాత ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని, అన్నయ్యకు ధైర్యం చాలా ఎక్కువని, మీ ఆశీస్సులు, బలవంతుడి దీవెనలతో ఆయన త్వరంగా కోలుకుని మనముందుకు వస్తారని ఎస్పీ బాలసుబ్రమణ్యం సొంత సోదరి వసంత వివరణ ఇచ్చారు.

బాలు సతీమణి సావిత్రికి కరోనా పాజిటివ్
ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇప్పటికే కరోనా పాజిటివ్ తో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం సతీమణి (భార్య) సావిత్రికి, ఆయన కుటుంబ సభ్యులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం సతీమణి సావిత్రికి కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్దారించారు. బాలు భార్య సావిత్రికి కరోనా పాజిటివ్ అనే విషయం తెలుసుకున్న ప్రముఖులు షాక్ కు గురైనారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఆయన సతీమణి సావిత్రి మేడమ్ కరోనా వ్యాధి నుంచి త్వరంగా కోలుకోవాలని ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్. రెహమాన్, సంగీత దర్శకుడు ఇళయరాజా, సింగర్ చిత్ర, ప్రముఖ నటి శ్రీప్రియ తదితరులు దేవుడిని ప్రార్థిస్తూ ట్వీట్ చేశారు.