వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: అయోధ్యలో రాముడి గుడి కడితే కరోనా అంతం ? పక్కాప్లాన్, మోడీపై పవార్ సైటెర్లు, నేనున్నా!

|
Google Oneindia TeluguNews

అయోధ్య/ ముంబై/ న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలకు పైగా చేరింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద మాజీ సీఎం, ఎన్ సీపీ పార్టీ చీఫ్ పరోక్షంగా సెటైర్లు వేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేపడితో (గుడి కడితే) కరోనా వైరస్ అంతం అవుతుందని ఓ వర్గం వారు భావిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 5వ తేదీన 11 గంటలకు అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ రామమందిరం నిర్మాణం భూమి చెయ్యాలని నిర్ణయించిన సమయంలో మాజీ సీఎం వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇక నేను ఉన్నాను అంటూ శివసేన నాయకులు సైతం రాముడికి జై అంటూనే బీజేపీ మీద విరుచుకుపడుతున్నారు.

Recommended Video

Ayodhya : Ram Temple Construction To Begin In Ayodhya On June 10

Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!

 మాజీ సీఎం సెటైర్లు

మాజీ సీఎం సెటైర్లు


ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ వ్యాధి తాండవం చేస్తోందని, ఆ వైరస్ పేరు చెబితో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హడలిపోతున్నారని ఎన్ సీపీ చీఫ్, మాజీ సీఎం శరద్ పవార్ విచారం వ్యక్తం చేశారు. అయితే కొందరు మహానుభావులు అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగితే కరోనా వైరస్ మహమ్మారి అంతం అవుతోందని భావిస్తున్నారని ఎన్ సీపీ చీఫ్ శరద్ పవార్ పరోక్షంగా బీజేపీ నాయకుల మీద, ప్రధాని నరేంద్ర మోడీ మీద సెటైర్లు వేశారు.

పక్కాప్లాన్, నాకు మాత్రం తెలీదు ?

పక్కాప్లాన్, నాకు మాత్రం తెలీదు ?


ఆగస్టు 5వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం 1. 10 గంటల మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య చేరుకుని అక్కడ రామమందిరం నిర్మాణం కోసం భూమి పూజ (పునాది) చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరపడం వలన కరోనాను అంతం చెయ్యడానికి అవకాశం ఉంటుందని కొందరు భావించారని, ఈ విషయంలో పక్కాప్లాన్ ప్రకారం వారు అన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుంటున్నారని ఎన్ సీపీ నేత శరద్ పవార్ అన్నారు. అయితే ఈ విషయంపై తనకు అధికారికంగా ఎలాంటి పక్కా సమాచారం మాత్రం లేదని శరద్ పవార్ గొడ మీద దీపం పెట్టి పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేస్తున్నారు.

 నా అభిప్రాయం ఏమిటంటే ?

నా అభిప్రాయం ఏమిటంటే ?


ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకు అన్ని విధాలుగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎన్ సీపీ నేత శరద్ పవార్ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాధిని నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని, పేద ప్రజలను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని శరద్ పవార్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయోధ్య రాముడి కోసం ఆనాటి నుంచి ప్రయత్నాలు

అయోధ్య రాముడి కోసం ఆనాటి నుంచి ప్రయత్నాలు

ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగిన అయోధ్య రామమందిరం భూమి వివాదానికి గత ఏడాది నవంబర్ నెలలో సుప్రీం కోర్టు చెక్ పెట్టింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే సమయంలో సున్నీ వక్స్ బోర్డుకు 5 ఎకరాల భూమి కేటాయించి మసీదు నిర్మించుకోవడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం భూమి పూజ చెయ్యాలని రామమందిరం నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రస్టు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆగస్టు 5వ తేదీన మంచి ముహూర్తం కుదరడంతో ప్రధాని నరేంద్ర మోడీతో అక్కడ భూమి పూజ చేయించాలని అయోధ్య రామమందిరం నిర్మాణ పనులు భుజాలకు ఎత్తుకున్న ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

 మేమేం తక్కువ తిన్నాం ?

మేమేం తక్కువ తిన్నాం ?

మహారాష్ట్రలో శివసేన- ఎన్ సీపీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయోధ్య రామమందిరం గుడి విషయంలో ఎన్ సీపీ చీఫ్ శరద్ పవార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలోనే శివసేన మేము ఉన్నాం అంటూ పైకి లేచింది. రాముడికి నిజమైన భక్తులు శివసేన కార్యకర్తలే అని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ముంబై సౌత్ నియోజక వర్గం ఎంపీ అరవింద్ సావత్ అని అన్నారు.

పోరాటం చేసింది ఎవరు ?

పోరాటం చేసింది ఎవరు ?


అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం కొన్ని సంవత్సరాలుగా శివసేన పోరాటం చేసిందని ఆ పార్టీ ఎంపీ అరవింద్ సావంత్ గుర్తు చేశారు. రాముడికి మా నాయకుడు (మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే) నిజమైన భక్తుడు అని అన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా వైరస్ ను అంతం చెయ్యడానికి మా సంకీర్ణ ప్రభుత్వం అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నదని, అయోధ్య రాముడికి తామే నిజమైన భక్తులు అని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ అన్నారు.

English summary
Coronavirus: Some people think that construction of Ram Temple can end the Covid-19 pandemic, said NCP chief Sharad Pawar. His statement is likely to rake up a fresh controversy as Prime Minister Narendra Modi is also scheduled to attend the laying of foundation stone at Ayodhya's Ram Janmabhoomi site on August 5.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X