వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: పాపం.. సోనమ్ కపూర్, కనిక కపూర్‌ను డిపెండ్ చేయడంతో దుమ్మెత్తిపోసిన నెటిజన్లు...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ సోకినా.. క్వారంటైన్‌లో ఉండకుండా బయట తిరిగి.. ఇతరులకు వైరస్ వ్యాపింపజేసేందుకు కారణమైన కనిక కపూర్‌పై విమర్శల జడివాన కురుస్తోంది. ఆమె చేసింది ముమ్మాటికీ తప్పు అని నెటిజన్లు దుమ్ముదులిపేస్తున్నారు. సహచరి, గాయనీ కనిక కపూర్‌కు సోనమ్ కపూర్ అండగా నిలిచారు. కనిక కపూర్‌కు కోపంతో ఉన్న నెటిజన్లకు సోనమ్ కపూర్‌కు అడ్డంగా దొరికిపోయారు. కనికను వదిలి... సోనమ్ కపూర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

 సోనమ్ సపోర్ట్..

సోనమ్ సపోర్ట్..

కనిక కపూర్‌ను సమర్థిస్తూ సోనమ్ కపూర్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కనిక కపూర్ స్వదేశానికి మార్చి 9వ తేదీన వచ్చారని పేర్కొన్నారు. లండన్ నుంచి ముంబై చేరుకున్నాక.. రెండురోజుల తర్వాత లక్నో వెళ్లారని పేర్కొన్నారు. అప్పటికీ హోలీని నిషేధించారు. కానీ సెల్ప్ క్వారంటైన్ మాత్రం లేదని గుర్తుచేశారు. కనిక కపూర్‌కు ఆ సమయంలో కరోనా లక్షణాలు లేవని.. ఇటీవలే బయట పడ్డాయని గుర్తుచేశారు. కనిక కపూర్ కాదు సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహుజాతో కలిసి ఇటీవల లండన్ నుంచి తిరిగొచ్చారు. వారిద్దరూ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

 దుమ్మెత్తిపోసిన నెటిజన్లు..

దుమ్మెత్తిపోసిన నెటిజన్లు..

సోనమ్ కపూర్ ట్వీట్‌పై నెటిజన్లు నిమిషాల వ్యవధిలో స్పందించారు. కనిక కపూర్ చేసింది ముమ్మాటికీ తప్పేనని పేర్కొన్నారు. కనికను సపోర్ట్ చేస్తోన్న సోనమ్‌ను ట్వీట్టర్ ఖాతా నుంచి వైదొలగాలని డిమాండ్ చేసింది. కనిక, సోనమ్‌ ఇద్దరు ఒక్కరేనా అని దుమ్మెత్తిపోసింది. దీనికి కారణం కూడా.. వారిద్దరూ కపూర్ కావడమేనని పేర్కొన్నది.

Recommended Video

Karthik Aryan Spreading Awareness On Covid 19
సినీ స్టార్ మాదిరగా..

సినీ స్టార్ మాదిరగా..

కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న గాయనీ కనిక కపూర్ తీరు మారలేదు. వైరస్ సోకి తమ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోన్న కనిక కపూర్‌కు మంచి సదుపాయాలు అందజేస్తున్నామని లక్నో ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. కానీ ఆమె మాత్రం ఓ రోగి మాదిరిగా కాకుండా.. తనో స్టార్ అని బిహేవ్ చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆస్పత్రిలో మంచి సదుపాయాలు అందజేస్తోన్న సిబ్బందికి సహకరించాల్సింది పోయి.. తానో స్టార్ అని కొండెక్కి కూర్చొన్నారని ధ్వజమెత్తింది. సిబ్బందికి సహకరిస్తే ఆమెకు మంచిదని ఆస్పత్రి డైరెక్టర్ ఆర్కే ధిమాన్ హెచ్చరించారు.

English summary
Kanika Kapoor came back on the 9th. India was not self-isolating but playing Holi." Ms Kapoor flew to Mumbai from London on March 9 and travelled to Lucknow two days later Sonam Kapoor said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X