వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: ఎంపీలు రూ.కోటి విరాళం ప్రకటించండి, స్పీకర్ ఓం బిర్లా సూచన..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌తో యావత్ ప్రపంచం వణికిపోతోంది. ఆర్థిక వ్యవస్థ కుదేలైపోవడంతో ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఆయా దేశాలకు తమ వంతుగా విరాళం ప్రకటిస్తున్నారు. నేతలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు.. ముఖ్యమంత్రి సహాయనిధి, ప్రధానమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేస్తున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. ఎంపీలు తమ నిధులను నియోజకవర్గానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

 coronavirus: speaket Om Birla asks MPs to contribute Rs 1 crore..

దేశంలో వైరస్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 973కి చేరగా.. 22 మంది చనిపోయారు. సీఎం సహాయనిధి, ప్రధానమంత్రి సహాయనిధికి నిధులు వస్తోండగా.. ఎంపీలు కూడా తమ వంతు సాయం చేయాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు. తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో కనీసం రూ.1 కోటి కరోనా వైరస్ కోసం కేటాయించాలని కోరారు. దీంతో వైరస్ తరిమికొట్టేందుకు సాయం చేసినవారమవుతామని పేర్కొన్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మాపూలే జన్ ఆరోగ్య యోజన స్కీం ఆరోగ్య పథకానికి కరోనా వైరస్ చికిత్స అందిస్తామని పేర్కొన్నది. దీంతో చాలామంది పేదలకు కూడా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్‌ బీజేపీ నేత జ్యోతిరాదిత్య సిందియా సీఎం సహాయనిధి రూ.30 లక్షలు అందచేస్తున్నట్టు ప్రకటించారు. సుప్రీంకోర్టు జడ్జీ జస్టిస్ ఎన్వీ రమణ కరోనా వైరస్ కోసం రూ.3 లక్షల నిధులను అందజేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి ఉదారత చాటుకొన్నారు. ప్రధానమంత్రి సహాయనిధికి రూ.25 కోట్ల నిధిని అందజేశారు.

English summary
Lok Sabha Speaker Om Birla has urged all MPs to contribute at least Rs 1 crore from their MPLADs funds to fight Covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X