వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాపై డబ్ల్యూహెచ్ఓ కీలక స్టేట్‌మెంట్.. లక్షణాలు బయటపడనివారి నుంచి వైరస్ వ్యాపిస్తుందా?

|
Google Oneindia TeluguNews

కరోనా లక్షణాలు బయటపడని వ్యక్తుల ద్వారా ఇతరులకు వైరస్ సోకి ఉండవచ్చునని.. కానీ కొత్త ఇన్ఫెక్షన్లకు అదే ప్రధాన కారణం కాదని డబ్ల్యూహెచ్ఓ(ప్రపంచ ఆరోగ్య సంస్థ) స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కాంటాక్ట్ ట్రేసింగ్ డేటాను విశ్లేషించిన అనంతరం ఈ నిర్దారణకు వచ్చినట్టు తెలిపింది. కరోనా లక్షణాలు బయటపడని వ్యక్తుల ద్వారా మరొకరికి వైరస్ వ్యాప్తి చెందడం అరుదు అని పేర్కొంది.

డబ్ల్యూహెచ్ఓ ఎపిడెమలాజిస్ట్ కీలక వ్యాఖ్యలు

డబ్ల్యూహెచ్ఓ ఎపిడెమలాజిస్ట్ కీలక వ్యాఖ్యలు

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కరోనా కాంటాక్ట్ ట్రేసింగ్‌కి సంబంధించి తమ వద్ద సమగ్ర డేటా ఉందని డబ్ల్యూహెచ్ఓ ఎపిడెమాలజిస్ట్ మారియా వాన్ కెర్కోవ్ తెలిపారు. దాని ఆధారంగా.. కరోనా లక్షణాలు బయటపడని వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వైరస్ వ్యాప్తి అరుదుగా జరుగుతుందని గుర్తించినట్టు చెప్పారు. అయితే ఇళ్లు,నర్సింగ్ హోమ్స్‌లలో కరోనా లక్షణాలు బయటపడనివారి నుంచి లేదా కరోనా ప్రాథమిక లక్షణాలు బయటపడినవారి నుంచి వైరస్ వ్యాప్తి చెందినట్టుగా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో అన్ని దేశాల నుంచి మరింత డేటా కోసం తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కరోనా లక్షణాలు బయటపడ్డ పేషెంట్లను గుర్తించి వారిని త్వరగా ఐసోలేట్ చేయడంపై అన్ని దేశాల ప్రభుత్వాలు దృష్టి సారించాలని చెప్పారు.

మరింత డేటా,పరిశోధనలు అవసరం..

మరింత డేటా,పరిశోధనలు అవసరం..


కరోనా లక్షణాలు బయటపడనివారి నుంచి కరోనా వ్యాప్తికి సంబంధించి కచ్చితమైన సమాధానం కావాలంటే.. మరింత డేటా,మరిన్ని పరిశోధనలు అవసరమన్నారు. సాధారణంగా కరోనా పేషెంట్ల నోటి తుంపర నుంచి వైరస్ వ్యాప్తి జరుగుతుందన్నారు. కరోనా లక్షణాలు బయటపడ్డ పేషెంట్లందరినీ గుర్తించి ఐసోలేట్ చేయగలిగితే.. కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. కరోనా లక్షణాలు బయటపడనివారిలో.. వైరస్ ప్రభావం అంతగా లేదని,కొద్దిపాటి ప్రభావమే ఉంటోందని చెప్పారు.

లక్షణాలు బయటపడటానికి ముందే వ్యాప్తి..

లక్షణాలు బయటపడటానికి ముందే వ్యాప్తి..

ఏప్రిల్‌లో వెలువడ్డ ఓ అధ్యయనం ప్రకారం.. వ్యక్తిలో కరోనా లక్షణాలు బయటపడటానికి రెండు,మూడు రోజుల ముందు నుంచి అతని ద్వారా ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్&ప్రివెన్షన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. 40శాతం కరోనా వ్యాప్తి.. వ్యక్తుల్లో కరోనా లక్షణాలు బయటపడటానికి ముందుగానే.. వారి నుంచి ఇతరులకు వ్యాప్తి చెంది ఉంటుందని పేర్కొంది. వీరిని కరోనా లక్షణాలు బయటపడని వ్యక్తులుగా గుర్తించలేమని.. లక్షణాలు బయటపడకముందే వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిపింది.

English summary
The spread of Covid-19 by someone who is not showing symptoms appears to be rare, Maria Van Kerkhove, the World Health Organization's technical lead for coronavirus response and head of the emerging diseases and zoonoses unit, said during a media briefing in Geneva on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X