బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus, బెంగళూరులో ఆంధ్రా మహిళ కరోనాతో మృతి, ఫ్యామిలీ మొత్తం వైరస్, రెడ్ అలర్ట్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) వ్యాధితో మృతి చెందిన మహిళ ఫ్యామిలీలో మరో ముగ్గురికి వైరస్ సోకిందని వెలుగు చూడటంతో వారి కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు హడలిపోయారు. మక్కా నుంచి కర్ణాటకలోని కొడుకు ఇంటికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎక్కడ మా ప్రాణాలు పోతాయో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కరోనా వైరస్ తో వ్యాధితో మృతి చెందిన మహిళ కుటుంబ సభ్యులకు చికిత్స అందిస్తున్నామని జిల్లాధికారి ఆర్. లతా తెలిపారు.

నాకు కరోనా వైరస్ వచ్చింది, దమ్ముంటే దగ్గరకు రండి, చస్తారు, పోలీసులకు సవాల్, సీన్ కట్ చేస్తే !నాకు కరోనా వైరస్ వచ్చింది, దమ్ముంటే దగ్గరకు రండి, చస్తారు, పోలీసులకు సవాల్, సీన్ కట్ చేస్తే !

ఆంధ్రా టూ మక్కా వెళ్లి వచ్చి !

ఆంధ్రా టూ మక్కా వెళ్లి వచ్చి !

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా, హిందూపురంకు చెందిన 70 మహిళ మక్కా యాత్ర ముగించుకుని భారత్ చేరుకున్నారు. తరువాత కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఆమె కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా, గౌరీబిదనూరు పట్టణం (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు)లోని కుమారుడి ఇంటికి వెళ్లి క్వారెంటైన్ లో ఉండిపోయారు.

బెంగళూరు ఆసుపత్రిలో మృతి

బెంగళూరు ఆసుపత్రిలో మృతి

హిందూపురంకు చెందిన 70 ఏళ్ల మహిళ కరోనా వైరస్ వ్యాధితో బెంగళూరు నగరంలోని బౌరింగ్ ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స విఫలమై ఆమె మార్చి 25వ తేదీ మరణించారు. అయితే మొదట ఆమె కరనా వైరస్ తో మరణించారని వైద్యులు ప్రకటించలేదు. తరువాత కరోనా వైరస్ తోనే ఆ మహిళ మృతి చెందారని ప్రభుత్వ వైద్యులు తేల్చి చెప్పారు.

మహిళ ఫ్యామిలీ మొత్తం !

మహిళ ఫ్యామిలీ మొత్తం !

కరోనా వైరస్ వ్యాధితో వృద్దురాలు మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు. మహిళతో పాటు ఒకే ఇంటిలో నివాసం ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. మహిళ కొడుకు, కోడలు, మనుమడికి కరోనా వైరస్ సోకిందని వైద్య పరీక్షల్లో వెలుగు చూడటంతో వారి కుటుంబ సభ్యులు హడలిపోయారు. వృద్దురాలి

Recommended Video

PM Modi Telugu Speech On Coronavirus | 'Janata Curfew' Why Only One Day ? | Oneindia Telugu
హడలిపోయిన స్థానికులు

హడలిపోయిన స్థానికులు

చిక్కబళ్లాపురం జిల్లాలో 31 ఏళ్ల వ్యక్తికి మొదటి సారి కరోనా వైరస్ సోకిందని వెలుగు చూసింది. ఆ వ్యక్తి సోదరికి కరోనా వైరస్ సోకిందని అనుమానం రావడంతో వైద్యపరీక్షలు నిర్వహించి నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. కరోనా వైరస్ వ్యాధితో మరణించిన మహిళ కొడుకు, కోడలు, మనుమడికి కరోనా వైరస్ సోకిందని జిల్లాధికారి ఆర్. లతా మీడియాకు చెప్పడంతో స్థానికులు హడలిపోయారు. మహిళ కుటుంబ సభ్యులతో ఎవరెవరు కలిశారు ? వారు ఎక్కడెక్కడ తిరిగారు ? అనే విషయంపై అధికారులు క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు.

English summary
Five more Coronavirus positive cases reported from Gowribidanuru near Bengaluru. it has Spread To Family Members Of Gowribidanuru Old Women Who Died By Coronavirus recently,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X