బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: విద్యార్థికి నాలుగో సారి కరోనా నెగటివ్, డామిడ్.... ఏం జరిగింది ? చూడు బాబు....నువ్వు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ చిక్కమగళూరు: విద్యార్థి దురదృష్టమో ? లేక అధికారుల నిర్లక్షమో ? తెలీదు కాని కొన్ని రోజుల పాటు అందరూ అయోమయానికి గురైనారు. భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) తాండవం చేస్తున్న సమయంలో ఎప్పుడు ఏ రూపంలో ఆ వ్యాధి సోకుతుందో అర్థం కావడం లేదు. ఓ విద్యార్థికి కరోనా వైరస్ సోకిందని ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స చేశారు. నాలుగు సార్లు ఆ విద్యార్థికి కరోనా నెగటివ్ అని తేలింది. డామిడ్... అసలు ఏం జరిగింది అంటూ అర్థం కాక అధికారులు ఆ విద్యార్థిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ చేసి చూడు బాబు.... నువ్వు అంటూ చిన్న సలహా ఇచ్చి చేతులు దులుపేసుకున్నారు.

Lockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్తLockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్త

10వ తరగతి విద్యార్థి

10వ తరగతి విద్యార్థి

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కడూరు తాలుకా కె. దాసరహళ్ళి ప్రాంతంలో నివాసం ఉంటున్న 16 ఏళ్ల బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. వారం రోజుల క్రితం ఆ విద్యార్థికి కరోనా వైరస్ సోకిందని, అతనికి ఆ లక్షణాలు ఉన్నాయని స్థానిక వైద్య శాఖ అధికారులకు అనుమానం వచ్చింది.

 కోవిడ్ 19 ఐసోలేషన్ లో చికిత్స

కోవిడ్ 19 ఐసోలేషన్ లో చికిత్స

వారం రోజుల క్రితం బాలుడిని అతని ఊరి నుంచి పిలుచుకుని ప్రత్యేక అంబులెన్స్ లో చిక్కమగళూరులోని కోవిడ్- 19 ఆసుపత్రికి తరలించారు. చిక్కమగళూరులోని ప్రభుత్వ కోవిడ్ -19 ఆసుపత్రిలో బాలుడికి అప్పటి నుంచి కరోనా వైరస్ వ్యాధి నయం కావడానికి వైద్యలు, ఆ శాఖ సిబ్బంది చికిత్స అందిస్తున్నారు.

నాలుగు సార్లు నెగటివ్

నాలుగు సార్లు నెగటివ్

వారం రోజుల నుంచి కోవిడ్ -19 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి నాలుగు సార్లు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే నాలుగు సార్లు ఆ బాలుడికి కరోనా నెగటివ్ అని తేలింది. పొరపాటున ఆ విద్యార్థికి మొదట్లో కరోనా పాజిటివ్ అని వచ్చిందని తెలుసుకున్న అధికారులు అవాక్కయ్యారు.

Recommended Video

IPL 2020 Line Clear : No T20 World Cup Plans, Cricket Australia Confirms
చూడమ్మ...బాబు.... నువ్వు !

చూడమ్మ...బాబు.... నువ్వు !


బాలుడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ చేసిన వైద్యులు అతన్ని కొన్ని రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని ఉచిత సలహా ఇచ్చారు. బాలుడు 10వ తరగతి పరీక్షలకు హాజరుకావడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చిక్కమగళూరు జిల్లా అధికారులు తెలిపారు. అయితే విద్యార్థికి మొదట్లో కరోనా పాజిటివ్ అని ఎందుకు వచ్చింది ? అసలు ఏం జరిగింది ? అనే పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అతనికి వైద్య పరీక్షలు చేసిన సాంపిల్స్ బెంగళూరులోని నిమ్హాన్స్ ఆసుపత్రికి పంపించామని చిక్కమగళూరు జిల్లా వైద్య శాఖ అధికారులు తెలిపారు.

English summary
Coronavirus: The report of an SSLC student who was tested coronavirus positive before one week is now tested negative fourth time and has been released from hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X