బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: హలో సార్, నేను సీనియర్ రిపోర్టర్, మాస్క్ ల పేరుతో రూ. కోటి గోవిందా... గోవింద!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: హలో.. సార్, నేను ఫేమస్ రిపోర్టర్, నేను చెబితే ప్రభుత్వ పెద్దలతో పాటు ఎవరైనా సరే మీకు సహాయం చేస్తారని ఓ సీనియర్ రిపోర్టర్ ప్రముఖ వ్యాపారిని పరిచయం చేసుకున్నాడు. వ్యాపారం చెయ్యడానికి, పేదలకు, తన దగ్గర పని చేస్తున్న ఉద్యోగులకు ఉచితంగా మాస్క్ లు పంపిణి చెయ్యాలని ఆలోచిస్తున్న వ్యాపారికి ఓ రిపోర్టర్ కుచ్చుటోపి పెట్టాడు. తనకు ప్రముఖ గార్మెంట్స్ ఫ్యాక్టరీ యజమాని తెలుసని, కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి నాణ్యమైన మాస్క్ లు తక్కువ ధరకు తయారు చేయిస్తామని మస్కా కొట్టిన రిపోర్టర్ ఆ వ్యాపారికి ఏకంగా రూ. ఒక కోటి నామం పెట్టడంతో భాదితుడు ఇప్పుడు గోవిందా...గోవింద అంటూ పోలీసులను ఆశ్రయించాడు.

Lady SI: క్రైమ్ బ్రాంచ్ లేడీ ఎస్ఐ భర్త లేడు, మేడమ్ ఇంట్లో ఆంధ్రా వ్యాపారి, ఏం పని అంటే, ఫినిష్?Lady SI: క్రైమ్ బ్రాంచ్ లేడీ ఎస్ఐ భర్త లేడు, మేడమ్ ఇంట్లో ఆంధ్రా వ్యాపారి, ఏం పని అంటే, ఫినిష్?

బోగస్ రిపోర్టర్స్ హంగామా

బోగస్ రిపోర్టర్స్ హంగామా

ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు సిటీలో నిజమైన మీడియా మిత్రుల కంటే బోగస్ రిపోర్టర్ల హంగామా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో ఇప్పటికే అనేక మంది సిన్సియర్ రిపోర్టర్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. బోగస్ రిపోర్ట మీద ప్రభుత్వం ఓ పక్క నిఘా వేసింది. అయినా ఎక్కడో అక్కడ చెమ్చా రిపోర్టర్లు చేతివాటం చూపిస్తూనే ఉన్నారు.

హల్... సార్... నేను !

హల్... సార్... నేను !

బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్ లో ప్రముఖ వ్యాపారి వసంత్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. కరోనా వైరస్ వ్యాధి వలన ఇబ్బందులు ఎదుర్కోంటున్న పేద ప్రజలకు, తన దగ్గర పని చేస్తున్న వారికి ఉచితంగా మాస్క్ లు పంపిణి చెయ్యాలని, అలాగే మాస్క్ ల వ్యాపారం చెయ్యాలని ఆ వ్యాపారవేత్త వసంత్ కుమార్ నిర్ణయించాడు. ఇదే సమయంలో హల్ సార్ నేను సీనియర్ రిపోర్టర్ అంటూ ఓ వ్యక్తి వసంత్ కుమార్ ను కలిశాడు.

ఫాస్ట్ న్యూస్ రిపోర్టర్ చాలా ఫాస్ట్

ఫాస్ట్ న్యూస్ రిపోర్టర్ చాలా ఫాస్ట్

వ్యాపారవేత్త వసంత్ కుమార్ ను కలిసిన వ్యక్తి ఫాస్ట్ న్యూస్ అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడని తెలిసింది. తాను పేదలకు మాస్క్ లు పంపిణి చెయ్యాలని అనుకుంటున్నానని వ్యాపారవేత్త ఆ రిపోర్టర్ కు చెప్పాడు. తనకు తెలిసిన గార్మెంట్స్ యజమాని ఉన్నాడని, మీకు అతి తక్కువ ధరకు నాణ్యమైన మాస్క్ లు తయారు చేయిస్తానని, మీరు వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాధించ వచ్చని ఆ రిపోర్టర్ వ్యాపారవేత్త వసంత్ కుమార్ ను నమ్మించాడు.

Recommended Video

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత V Hanumantha Rao కు Coronavirus పాజిటివ్!
కోటి రూపాయలు గోవిందా.... గోవింద

కోటి రూపాయలు గోవిందా.... గోవింద

తక్కువ ధరకు మాస్క్ లు తయారు చేయిస్తానని చెప్పిన ఆ రిపోర్టర్ బెంగళూరు వ్యాపారవేత్త వసంత్ కుమార్ దగ్గర కోటి రూపాయలు తీసుకున్నాడు. తరువాత ఫాస్ట్ న్యూస్ రిపోర్టర్ చాలా ఫాస్ట్ గా మాయం అయిపోయాడు. తన దగ్గర కోటి రూపాయలు తీసుకున్న రిపోర్టర్ ఆచూకి లేకపోవడం, అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వ్యాపారి వసంత్ కుమార్ రాజరాజేశ్వరి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన దగ్గర కోటి రూపాయలు తీసుకుని నామం పెట్టిన రిపోర్టర్ ను పట్టుకోవాలని వ్యాపారవేత్త వసంత్ కుమార్ పోలీసులకు మనవి చేశాడు.

English summary
Coronavirus mask scam: Journalist who runs Youtube channel cheated industrialist by taking 1 crore Rs by assuring to supply mask from garment unit. Complaint field in Rajarajeshwari nagar police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X