వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus:బట్టలపై కరోనావైరస్ ఎంతకాలం జీవిస్తుంది..? పరిశోధకులు ఏం తేల్చారు..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలకు నిద్రపట్టనివ్వకుండా చేస్తోంది కరోనావైరస్. ఇక ఈ వైరస్ ఎక్కడైనా ఉంటుంది. అందుకే తలుపు తీయాలన్నా భయమే.. కుర్చీలో కూర్చోవాలన్నా భయమే.. బట్టలపై ఉంటుందేమో అన్న అనుమానం కూడా భయాందోళనలకు గురిచేస్తోంది. అయితే బట్టలపై కరోనావైరస్ జీవిస్తుందా..? ఒకవేళ జీవిస్తే అది ఎంతకాలం జీవిస్తుంది..? అనేదానిపై చాలామందిలో అనుమానాలున్నాయి.

 బట్టలపై వైరస్ ఎంతకాలం ఉంటుంది..?

బట్టలపై వైరస్ ఎంతకాలం ఉంటుంది..?

కరోనావైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి నుంచి ఎప్పుడు సేఫ్‌ జోన్‌లోకి వస్తామా అని ప్రపంచదేశాలు ఎదురుచూస్తున్నాయి. ఇందుకోసం ఆయా దేశాలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనావైరస్‌పై ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమానాలను నివృత్తి చేస్తున్నప్పటికీ ఇంకా కొన్ని కొత్త అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి. తాజాగా ఈ మహమ్మారి బట్టలపై ఎంతకాలం జీవిస్తుందనే ప్రశ్న పలువురిలో తలెత్తింది. అయితే ఇది బట్టలపై మనుగడ సాగిస్తుంది కానీ అది ఎంతకాలమో చెప్పలేమని చెబుతున్నారు పరిశోధకులు. పలు రకాల వస్తువులపై వైరస్ మనుగడ గురించి పరిశోధకులు ఇప్పటికే స్టడీ చేశారు. ఉదాహరణకు ప్లాస్టిక్, స్టీల్, కార్డ్‌బోర్డులాంటి వస్తువులతో పాటు గాలిలో కూడా ఎంత వరకు జీవించి ఉంటుందనే దానిపై స్టడీ చేశారు. అయితే బట్టలపై మాత్రం ఇప్పుడే పరిశోధనలు నిర్వహించారు.

 పోరస్‌ వస్తువులపై పరిస్థితి ఏంటి..?

పోరస్‌ వస్తువులపై పరిస్థితి ఏంటి..?

రంద్రములు లేని వస్తువులు అంటే స్టీల్ వంటి వాటిపై వైరస్ ఎక్కువ కాలం జీవిస్తుందని అదే రంద్రాలు ఉన్న కార్డ్‌బోర్డు లాంటి వాటిపై వైరస్ తక్కువకాలం జీవిస్తుందని పరిశోధకులు చెప్పారు. అయితే రంధ్రాలు ఉన్న వస్తువులపై వైరస్ ట్రాప్ అవుతుందని చెప్పారు. దీంతో అది ఇతర వస్తువులకు పాకే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. అయితే బట్టల విషయానికొస్తే మాత్రం కచ్చితంగా బట్టలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

 ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు ఏమిటి..?

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు ఏమిటి..?

బట్టలపై వైరస్ ఎంతకాలం జీవించి ఉంటుంది.. దీన్నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఎలా సూచనలు లేవు. అయితే లెనిన్ బట్టలను 60 నుంచి 90 డిగ్రీల మధ్య లాండరీ చేయాలని ప్రపంచఆరోగ్య సంస్థ చెబుతోంది. బట్టలు ఉతికేందుకు వినియోగించే సబ్బు కచ్చితంగా వైరస్‌ను అంతమొందిస్తుందనే నమ్ముతున్నామని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే బట్టలపై వైరస్ ‌ను నిర్మూలించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేదానిపై కేంద్ర ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌పై సూచనలు చేసింది ప్రభుత్వం. అనారోగ్యంతో ఉన్నవారి బట్టలను, బెడ్‌షీట్స్‌ను, టవల్స్‌ను అన్నిటినీ సబ్బుతో ఉతకాలని సూచిస్తోంది. ఆ తర్వాత ఎండకు బాగా ఆరబెట్టాలని సూచించింది. ఒకవేళ బట్టతో తయారు చేసిన మాస్కులు వినియోగిస్తున్నట్లయితే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉతుక్కోవాలని సూచిస్తోంది.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd

English summary
Studies have looked at how long the virus can survive on various surfaces plastic, steel, cardboard and even in the air, but none has looked at fabric yet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X