వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus:ఢిల్లీ టూ గల్లి, మత ప్రార్థనల దెబ్బకు కర్ణాటక, తమిళనాడుకు షాక్, ఏం జరిగిందంటే ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ చెన్నై: దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లిగి జమాత్ మత ప్రార్థనల కార్యక్రమం కారణంగా దేశంలో కరోనా వైరస్ వ్యాధి (COVID 19) చాపకింద నీరులా పాకిపోయిందని వెలుగు చూసింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరైన కర్ణాటకలోని 24 మందికి, తమిళనాడులో 50 మందికి పైగా కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ అయ్యింది. తబ్లిక్ జమాత్ మత ప్రార్థనలకు, అక్కడ జరిగిన కార్యక్రమాలకు దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వేల మంది హాజరైనారు. నిజాముద్దీన్ తబ్లిగి జమాత్ మత ప్రార్థనలకు కర్ణాటకకు చెందిన 300 మంది, తమిళనాడుకు చెందిన 1, 500 మంది హాజరైనారని వెలుగు చూడటంతో ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, స్థానిక ప్రజలు హడలిపోయారు.

Coronavirus కర్మ: ఇంట్లో బెంగళూరు అని చెప్పి బ్యాంకాక్ వెళ్లి ఏం తెచ్చారో తెలుసా ?, అయ్యో !Coronavirus కర్మ: ఇంట్లో బెంగళూరు అని చెప్పి బ్యాంకాక్ వెళ్లి ఏం తెచ్చారో తెలుసా ?, అయ్యో !

కర్ణాటక మంత్రి క్లారిటీ

కర్ణాటక మంత్రి క్లారిటీ

ఢిల్లీలోని నిజాముద్దీన్ జమాత్ మసీదులో జరిగిన తబ్లిగి కార్యక్రమానికి కర్ణాటకకు చెందిన 300 మందికి పైగా హాజరైనారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు బుధవారం మీడియాకు చెప్పారు. ఢిల్లీలో మత ప్రార్థనలు చేసిక కర్ణాటకకు చెందిన వారు ఎక్కడెక్కడ ఉన్నారు ? అనే విషయం ఆరా తీస్తున్నామని మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు.

ఎంత మందికి కరోనా వైరస్ అంటే ?

ఎంత మందికి కరోనా వైరస్ అంటే ?

ఢిల్లీ వెళ్లి జమాత్ తబ్లిగి మత ప్రార్థనలు చేసి కర్ణాటకకు తిరిగి వచ్చిన 50 మంది అడ్రస్ లు గుర్తించామని, వారిలో12 మందికి కరోనా వైరస్ నెగిటివ్ అని తేలిందని, మిగిలిన వారి కోసం అధికారులు వెలుకుతున్నారని ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు వివరించారు.

ఎవ్వరినీ వదిలిపెట్టం !

ఎవ్వరినీ వదిలిపెట్టం !

ఢిల్లీలో మత ప్రార్థనలు చేసి తిరిగి వచ్చిన వారిని అందర్నీ గుర్తించి వారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తామని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు మీడియాకు చెప్పారు. ఇప్పటికే 40 మందిని గుర్తించి క్వారంటైన్ లకు తరలించామని, మిగిలిన వారు ఎక్కడెక్కడ ఉన్నారు ? వారు ఎవరెవరితో కలిశారు ? అని పూర్తి సమాచారం బయటకు లాగుతున్నామని, ఢిల్లీ వెళ్లి మత ప్రార్థనలు చేసి వచ్చిన వారని ఎవ్వరినీ వదలకుండా అందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తామని ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు మీడియాకు చెప్పారు.

తమిళ తంబీల గుండెల్లో దడదడ !

తమిళ తంబీల గుండెల్లో దడదడ !

ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు తమిళనాడుకు చెందిన 1, 500 మంది హాజరైనారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. తమిళనాడుకు చెందిన చాలా మంది ఢిల్లీలోని నిజాముద్దీన్ జమాత్ తబ్లిగి మత ప్రార్థనలకు హాజరైనారని ప్రభుత్వ అధికారులు గుర్తించారు. ఇప్పటికే చాలా మందిని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం వారిని క్వారంటైన్లకు తరలిస్తున్నారు.

ఢిల్లీ టూ గల్లీ దెబ్బకు ఒకే రోజు 50 మందికి కరోనా !

ఢిల్లీ టూ గల్లీ దెబ్బకు ఒకే రోజు 50 మందికి కరోనా !

తమిళనాడులో ఒకే రోజు 57 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనాయి. అందులో ఢిల్లీలో వెళ్లి మత ప్రార్థనలకు వెళ్లిన వారు 50 మంది ఉండటంతో తమిళనాడు ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి తమిళనాడు తిరిగి వచ్చిన ఓ వ్యక్తి కరోనా వైరస్ వ్యాధితో మరణించడం తమిళ ప్రజలను మరింత ఆందోళనకు గురి చేసింది. ఈ రోడ్ జిల్లాలో 33 మందిని గుర్తించి వైద్యనిర్బంధంలో ఉంచామని ఆ జిల్లా కలెక్టర్ కదివరన్ మీడియాకు చెప్పారు.

ఢిల్లీ నుంచి గల్లీకి పాకిపోయిన కరోనా

ఢిల్లీ నుంచి గల్లీకి పాకిపోయిన కరోనా

కోయంబత్తూరు జిల్లాలో 61 మందికి గుర్తించగా వారిలో 44 మంది మాత్రమే పట్టుబడ్డారని, మిగిలిన వారు తప్పించుకుని తిరుగుతున్నారని తమిళనాడు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి నుంచే తమిళనాడులో కరోనా వైరస్ వ్యాపిస్తోందని ఆ రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
Coronavirus (COVID 19): 300 Karnataka People Was Participeted In Nizamuddin Mosque Karnataka Minister B Sriramulu tweet. police searching for suspected people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X