చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: ప్రాణాలతో బయటపడిన TikTok లేడీ, దేవుడా జీవితంలో వీడియోలు చెయ్యను !

|
Google Oneindia TeluguNews

అరియలూరు/ చెన్నై: కొంత కాలం టిక్ టాక్ వీడియోలతో చిందులు వేసిన 25 ఏళ్ల యువతికి కరోనా వైరస్ (COVID 19) వ్యాధి సోకింది. సుమారు 28 రోజుల పాటు ఆసుతప్రిలో చికిత్స పొందిన ఆ యువతి కరోనా వైరస్ వ్యాధితో పోరాటం చేసి ప్రాణాలతో బయటపడింది. ఆ సుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అదే ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న ముగ్గురి సహాయంతో టిక్ టాక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో ఆ ముగ్గురు ఉద్యోగాలు ఊడిపోయాయి. కరోనా వైరస్ వ్యాధితో పోరాటం చేసి ప్రాణాలతో బయటపడిన ఆ యువతి చివరిసారిగా ఓ టిక్ టాక్ వీడియో తీసి ఇక తన జీవితంలో ఇలాంటి టిక్ టాక్ వీడియోలు చెయ్యనని, కరోనా వైరస్ తనకు జీవితం అంటే ఏమిటో తెలిసేలా చెప్పిందని విచారం వ్యక్తం చేస్తూ దేవుడిని ప్రార్థించుకుంటు ఇంటికి వెళ్లిపోయింది.

విద్యార్థిని ప్రేమించాడు, ప్రియురాలిని పంచేశాడు, 10 మంది లైంగిక దాడి, తల్లిని చేసి, కరోనా భయంతో !విద్యార్థిని ప్రేమించాడు, ప్రియురాలిని పంచేశాడు, 10 మంది లైంగిక దాడి, తల్లిని చేసి, కరోనా భయంతో !

 చెన్నై ఫినిక్స్ మాల్ లో ఉద్యోగం

చెన్నై ఫినిక్స్ మాల్ లో ఉద్యోగం

తమిళనాడులోని అరియలూరు ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువతి చెన్నైలోని వేళాచేరిలోని ప్రముఖ ఫినిక్స్ మాల్ లో ఉద్యోగం చేస్తున్నది. ఈమె మార్చి 20వ తేదీ చెన్నై నుంచి తిరిగి అరియలూరు వెళ్లింది. చెన్నై నుంచి వచ్చిన యువతికి జ్వరం ఎక్కవగా ఉండటంతో ఆమెకు అరియలూరు జిల్లా ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు.

 కరోనా వైరస్ వ్యాధి

కరోనా వైరస్ వ్యాధి

చెనై నుంచి అరియలూరు వచ్చిన యువతికి కరోనా వైరస్ సోకిందని తెలుసుకున్న వైద్యులు ఆమెను ప్రభుత్వ అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ మహిళా వార్డుకు తరలించారు. అప్పటి నుంచి ఆ యువతిని బయటకు రానివ్వకుండా వైద్యులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 యువతికి టిక్ టాక్ పిచ్చి పట్టింది

యువతికి టిక్ టాక్ పిచ్చి పట్టింది

అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతికి చాలాకాలం నుంచి టిక్ టాక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. టిక్ టాక్ వీడియోల పిచ్చి ఎక్కువగా ఉన్న యువతి ఆసుపత్రిలో కాలక్షేపం చెయ్యడానికి ఆమెకు అధికారులు, సిబ్బంది కొని పుస్తకాలు ఇచ్చారు. అయితే ఆ పుస్తకాలు చదవకుండా ఆ యువతి డిప్రెషన్ లోకి వెళ్లింది. టిక్ టాక్ వీడియోలకు దూరం కావాలని ఆమెకు వైద్యులు పదేపదే సూచించారు.

కరోనా వార్డులో టిక్ టాక్ వీడియోలు

కరోనా వార్డులో టిక్ టాక్ వీడియోలు

అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోనా ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న యువతి అక్కడ పారిశుద్ద కార్మికులుగా పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు మాయమాటలు చెప్పింది. తాను వెంటనే టిక్ టాక్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యకుంటే తనను ఇన్ని రోజులు ఫాలో అవుతున్న నెటిజన్లు మరిచిపోతారని ఆ యువతి వారి దగ్గర వాపోయింది. ఆసుపత్రి ఉద్యోగుల సహాయంతో ఆసుపత్రిలోని కరోనా ఐసోలేష్ వార్డులో అటూఇటూ తిరుగుతూ టిక్ టాక్ వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ టిక్ టాక్ వీడియోలను చూసిన నెటిజన్లు అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రి సీనియర్ వైద్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఉద్యోగాలు ఊడిపోయాయి

ఉద్యోగాలు ఊడిపోయాయి

ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న యువతి ముగ్గురు ఉద్యోగుల దగ్గరకు వెళ్లి టిక్ టాక్ వీడియోలు తీసిందని అధికారులు గుర్తించారు. అంతే కాకుండా ముగ్గురు ఉద్యోగులు యువతి మొబైల్ తీసుకుని టిక్ టాక్ వీడియోలు చిత్రీకరించడంతో పాటు ఆమెతో కలిసి సెల్ఫీలు తీసుకున్నారని ఆసుపత్రిలోని సీసీ కెమెరాల్లో అక్కడి వైద్యులు, సంబంధిత అధికారులు గుర్తించారు. వెంటనే ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసి వారిని కరోనా ఐసోలేషన్ వార్డుకు పంపించారు.

 కరోనాను జయించిన టిక్ టాక్ లేడీ

కరోనాను జయించిన టిక్ టాక్ లేడీ

అప్పటి నుంచి అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన యువతి చివరికి కరోనా వైరస్ వ్యాధిపై పోరాటం చేసి ప్రాణాలతో భయటపడింది. కరోనా వైరస్ వ్యాధి పూర్తిగా నయం కావడంతో ఆ యువతిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఆ యువతి భావోద్వేగానికి గురైయ్యింది.

 కవితలు, డ్రాయింగ్

కవితలు, డ్రాయింగ్

చివరిగా ఓ టిక్ టాక్ వీడియో చేసి ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిన ఆ యువతి ఇక జీవితంలో టిక్ టాక్ వీడియోలు తియ్యనని చెప్పింది. కరోనా వైరస్ వ్యాధి తనకు జీవితం అంటే ఏమిటో తెలిసేలా చేసిందని ఆ యువతి కన్నీరు పెట్టుకుంది.

కరోనా ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న సమయంలో ఆ యువతి కవితలు, పాటలు రాసిందని, డ్రాయింగ్ వేస్తూ కాలం గడిపిందని అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మీడియాకు చెప్పారు. కరోనా వ్యాధి వచ్చినా ఆసుపత్రిలో టిక్ టాక్ వీడియోలు తీసి నానా హంగామా చేసిన యువతి చివరికి ఆ వ్యాధి నుంచి పూర్తిగా కొలుకుని ప్రాణాలతో బయటపడింది.

Recommended Video

Coronavirus : 21 Indian Navy Sailors Test Positive For COVID-19

English summary
Coronavirus: Tamil Nadu ariyalur tiktok girl discharged from corona ward who worked in Chennai phoenix mall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X