వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: కరోనా విరుగుడుకు కాసాకుర మందు రెఢీ, 48 గంటలు, చూడప్ప సిద్దప్ప, నీ వైద్యం చాలప్ప !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ కోయంబేడు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రపంచం విలవిలలాడుతోంది. భారత్, అమెరికా, రష్యా, కరోనా పుట్టినిల్లు చైనాతో సహ అనేక దేశాలు కరోనా మహమ్మారి విరుగుడుకు మందు కనిపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే తన దగ్గర ఉన్న మూలికలతో తయారు చేసిన కాసాకుర ఔషదం తీసుకుంటే 48 గంటల్లో ఆ వ్యాధి నయం అవుతోందని, కరోనా వైరస్ మీకు నయం కాకపోతే నడిరోడ్డులో నన్ను ఉరి వెయ్యండి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న నకిలి వైద్యుడిని పోలీసులు పట్టుకున్నారు. కరోనా వైరస్ ను నయం చేసే ఔషదం పేరు కాసాకుర అని నామకరనం చేశాడు. చైనాకు కూడా ఈ ఔషదం తానే సరఫరా చేశానని డబ్బా కొట్టుకున్నాడు. చూడప్ప సిద్దప్ప ఇంత కాలం నువ్వు చేసిన వైద్యం చాలప్పా, లాస్ట్ లాఠీ దెబ్బ మా దైతే ఆకిక్కే వేరప్ప, వాప్పా, అంటూ అతన్ని పట్టుకెళ్లిన క్రైం బ్రాంచ్ పోలీసులు బడిత పూజ చేస్తున్నారు.

100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!

కంటికి కనపడని కరోనా

కంటికి కనపడని కరోనా

ప్రపంచ దేశాలు ప్రస్తుతం కంటికి కనపడని కరోనా వైరస్ తో యుద్దం చేస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాధిని నయం చేసే ఔషదం కనిపెట్టడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు నానా తంటాలు పడుతున్నాయి. లక్షల మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్న కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి ప్రముఖ వైద్యులు శక్తి వంచనలేకుండా పని చేస్తున్నారు.

హలో..... నా దగ్గర కాసాకుర ఉంది

హలో..... నా దగ్గర కాసాకుర ఉంది

తమిళనాడులోని కోయంబేడూ సమీపంలో ధణికాచలం అనే వ్యక్తి సిద్ద హెర్బల్ ఆయుర్వేద ఆసుపత్రిని నిర్వహిస్తున్నాడు. కరోనా వైరస్ ను అరికట్టడానికి తాను అనేక మూళికలు ఉపయోగించి ఇన్ని రోజులు కష్టపడి కాసాకుర అనే ఔషదం కనిపెట్టానని, ఆ ఔషదం సేవిస్తే కరోనా వైరస్ వ్యాధి నయం అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు.

48 గంటల్లో కరోనా పరార్, లేదంటే ఉరి వెయ్యండి !

48 గంటల్లో కరోనా పరార్, లేదంటే ఉరి వెయ్యండి !

తాను అనేక మూళికలతో తయారు చేసిన కాసాకుర ఔషదం సేవిస్తే కరోనా వ్యాధి 48 గంటల్లో నయం అవుతోందని ధణికాచలం సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. తాను ఇచ్చే కాసాకుర ఔషదం సేవించిన తరువాత మీకు కరోనా వైరస్ వ్యాధి నయం కాకపోతే నడి రోడ్డులో ఉరి వెయ్యండి, అందుకు నేను సిద్దంగా ఉన్నానని ధణికాచలం ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించాడు.

చైనా, లండన్ కు నేను కాసాకుర ఇచ్చాను

చైనా, లండన్ కు నేను కాసాకుర ఇచ్చాను

కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో ఆ వ్యాధి తగ్గడానికి నేనే కారణం అంటూ ధణికాచలం ప్రచారం చేశాడు. చైనాలో కరోనా వైరస్ వ్యాధి నయం కావడానికి తానే కాసాకుర ఔషదం సరఫరా చేస్తున్నానని, లండన్ వైద్యులు ఓ మహిళకు కరోనా వైరస్ వ్యాధి నయం చెయ్యడానికి ప్రయత్నించారని, ఆ డాక్టర్ల వలన సాధ్యం కాకపోతే నేను కాసాకుర ఔషదంతో ఆమె కరోనా వైరస్ వ్యాధి నయం చేశానని డబ్బా కొట్టుకున్నాడు.

ప్రజల ప్రాణాలతో చెలగాటం

ప్రజల ప్రాణాలతో చెలగాటం

ధణికాచలం సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం చూసిన హెర్బల్, ఆయుర్వేద వైద్యులు షాక్ కు గురైనారు. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న పేరుపొందిన వైద్యులు, సైంటిస్టులు ఇప్పటి వరకు కరోనా వైరస్ వ్యాధి పూర్తిగా విరుగుడు కావడానికి మందు కనిపెట్టలేదని, వారికి సాధ్యం కానిది ధణికాచలం ఆ మందు ఎలా కనిపెట్టాడు అని అనుమానం వచ్చింది. కరోనా వైరస్ విరుగుడుకు మందు కనిపెట్టామని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడిసన్ హోమియోపతి డైరెక్టర్ ప్రభుత్వానికి, పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో తమిళనాడు క్రైం బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు.

చూడప్ప సిద్దప్ప, నీ వైద్యం చాలప్ప, వాప్ప !

చూడప్ప సిద్దప్ప, నీ వైద్యం చాలప్ప, వాప్ప !

తాను కరోనా వైరస్ ను నయం చేస్తానని ధణికాచలం సోషల్ మీడియాలో సుమారు 70 వీడియోలకు పైగా పోస్టు చేసిన విషయాన్ని తమిళనాడు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు గుర్తించారు. వెంటనే ధణికాచలంను అరెస్టు చెయ్యాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చెయ్యడంతో సైబర్ క్రైం బ్రాచ్ పోలీసులు ధనిణికాచలంను అరెస్టు చేశారు. చూడప్ప సిద్దప్ప, నువ్వు సిద్దా ఆసుపత్రిలో చేసిన వైద్యం చాలప్ప, వాప్ప అంటూ అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి బెండ్ తీశారు.

నకిలి వైద్యులుతో జాగ్రత్త !

నకిలి వైద్యులుతో జాగ్రత్త !

ధణికాచలం ఎలాంటి వైద్య శాస్త్రం చదవలేదని, అతను ఓ నకిలి వైద్యుడు అని, మూళికలు, మూడనమ్మకాలు నమ్ముతున్న అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని ఇలా మోసం చేస్తున్నాడని అధికారులు అంటున్నారు. కరోనా వైరస్ విరుగుడికి మందు నేనే కనిపెట్టాను, చైనా, లండన్ కు తానే కాసాకుర ఔషదం సరఫరా చేస్తున్నానని ప్రజలను మోసం చేసిన ధణికాచలంకు పోలీసులు బెండ్ తీస్తున్నారు.

English summary
Coronavirus: A man, who claimed to have found a herbal medicine to cure Covid-19 and later spread the message through his social media pages, has been arrested by the Tamil Nadu Police’ Central Crime Branch.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X