• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా దెబ్బకు మెంటలెక్కి నగ్నంగా.. వీధిలో వికృతం.. జాంబీలా మెడ కొరికి నెత్తురుతాగి..

|

విదేశాల నుంచి కరోనాను మొసుకొచ్చి.. కనీసం క్వారంటైన్ లో ఉండకుండా అందరికీ వైరస్ అంటిస్తున్న ప్రబుద్ధుల్ని మనం చూస్తూనేఉన్నాం. కొందరు తెలియక, వ్యాధిపై అవగాహన లేక ఆ పని చేస్తే.. ఇంకొందరు మాత్రం అచ్చం సైకోల్లా ఉద్దేశపూర్వకంగానే జనంలో సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చాలా రాష్ట్రాల్లో ఎన్ఆర్ఐలు హోం క్వారంటైన్ నుంచి పారిపోతున్న ఘటనలూ రిపోర్టవుతున్నాయి. ఈలోపే తమిళనాడులో మరో వికృతం వెలుగులోకి వచ్చింది..

వారం రోజులుగా ఇంట్లోనే..

వారం రోజులుగా ఇంట్లోనే..

ఇండియాలో లాక్ డౌన్ ప్రకటన కంటే ముందే పొరుగుదేశం శ్రీలంకలో దేశవ్యాప్త కర్ఫ్యూ విధించారు. దీంతో అక్కడ జీవిస్తోన్న తమిళ వలసదారులంతా ఇంటిబాటపట్టారు. గతవారం లంక నుంచి ఓ వ్యక్తి(34)... తమిళనాడులోని థేని జిల్లా కేంద్రంలోని తన ఇంటికి తిరిగొచ్చాడు. అతనికి వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. లక్షణాలు మైల్డ్ గా ఉండటంతో హోం క్వారంటైన్ లో ఉండాల్సిందిగా ఆదేశించారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం డాక్టర్లు, ప్రభుత్వ సిబ్బంది వెళ్లి.. అతణ్ని పరీక్షించేవాళ్లు. అయితే వారం రోజులు ఇంట్లోనే ఉండేసరికి..

అచ్చం జాంబీలా..

అచ్చం జాంబీలా..

అతను మానసిక సమతుల్యం కోల్పోయి, ఉన్మాదిలా మారాడు. శుక్రవారం రాత్రి.. దుస్తులన్నీ విప్పేసి, నగ్నంగా వీధుల వెంట పరుగులు తీశాడు. జాంబీ సినిమాల్లో వైరస్ సోకినవాళ్లు ఎలాగైతే ప్రవర్తిస్తారో అలా.. ఓ ఇంటి ముందు వాకిట్లో నిద్ర పోతోన్న వృద్ధురాలి దగ్గరకెళ్లి.. అమాంతం పికకొరికి, నెత్తురుతాగే ప్రయత్నం చేశాడు. అలికిడి విని బయటికొచ్చిన స్థానికులు.. ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారే షాక్ కు గురయ్యారు. కర్రలు, తాళ్లతో ఆ ఉన్మాదిని బంధించి పోలీసులకు ఫోన్ చేశారు. ముసలమ్మను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

ఉన్మాది దాడిలో మెడపై తీవ్రగాయాలై, రక్తస్త్రావం కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే వృద్ధురాలు మరణించింది. ఆమెను 90 ఏళ్ల నచ్చియమ్మాళ్ గా పోలీసులు గుర్తించారు. కాగా, హోం క్వారంటైన్ లో ఉంటోన్న ఆ నిందితుడు చాలా కాలంగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడని, వారంరోజులుగా ఇల్లు కదలకుండా ఉండటంతో మెంటలెక్కినట్లు ప్రవర్తించసాగాడని కుటుంబీకులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఎందుకిలా జరుగుతోంది?

ఎందుకిలా జరుగుతోంది?

కరోనా విలయం తర్వాత విదేశాల నుంచి తిరిగొచ్చిన వాళ్లలో బాగా చదువుకున్నవాళ్లు కూడా వింతగా ప్రవర్తిస్తుండటం, హోం క్వారంటైన్ ను ధిక్కరిస్తుండటం పెరిగిపోయిన క్రమంలో పోలీసులు ఇంకొంత కఠినంగా వ్యవహరించారు. ప్రముఖ సింగర్ కనికా కపూర్ తాను కరోనా పాజిటివ్ అని తెలిసి కూడా ఫైవ్ స్టార్ హోటళ్లలో ఎంపీలతో విందులో పాల్గొనడం, ఆ ఎంపీలు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తో భేటీ కావడం.. దాంతో రాష్ట్రపతి సైతం కరోనా టెస్టులు చేయించుకోవడం తెలిసిందే. అది చాలదన్నట్లు ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో సౌకర్యాలు సరిగా లేవని కనిక గొడవకు దిగడంతో డాక్టర్లు ఆగ్రహించారు. విలయ సమయంలో పేదలు అన్నం కూడా దొరక్క పస్తులుంటుంటే.. విలాసాలకు అలవాటుపడ్డ కొందరు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ లో ఉండలేక పారిపోతుంటే, ఇంకొందరు లాక్ డౌన్ ను సైతం లెక్కచేయకుండా ఉన్మాదుల్లా వీధుల వెంట సంచరిస్తూ పోలీసులకు దొరికిపోతున్నారు.

English summary
A 34-year-old man in Tamil Nadu’s Theni district, who was in home quarantine, ran out of his house on Friday night and killed a 90-year-old woman by biting her throat. Police said the man, who had returned from Sri Lanka a week ago
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more