• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Coronavirus: రాజాధిరాజ, రాజమార్తాండ, అన్నా నువ్వు కరోనా అమ్మ మొగుడు తెలుసా, అప్పడి పోడు !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ మదురై: కరోనా (COVID 19) కాలంలో అయినా, ఎప్పుడైనా, ఏం చెయ్యాలన్నా తమిళ ప్రజలు చాలా ప్రత్యేకతలు చాటుకుంటారు. నిత్యం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వారి మద్యలో ఉంటూ కరోనా వైరస్ సోకిన మంత్రి ఆ వ్యాధి నయం చేసుకుని ఆరోగ్యంగా తిరిగిరావడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మంత్రిగారితో పాటు ఆయన సతీమణి, ప్రాణానికి ప్రాణంగా ఆరాదిస్తున్న నాయకులతో పాటు సీఎం, డీసీఎం ఫోటోలతో భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి రాజాధిరాజ రాజమార్తాండ అంటూ స్వాగతం పలుకుతున్నారు. రాజువయ్యా మహరాజువయ్యా అంటూ పాటలు పాడుతూ పండగ చేసుకుంటున్నారు.

Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో !Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో !

మోడీకి హామీ ఇచ్చిన సీఎం

మోడీకి హామీ ఇచ్చిన సీఎం

తమిళనాడులో 1, 70, 693 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు ఆ మహమ్మారికి 2, 481 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తమిళనాడులో కరోనా పరిస్థితులు, మీరు తీసుకుంటున్న నివారణ చర్యలు ఏమిటి ? అంటూ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామితో మాట్లాడారు. తమిళనాడులో త్వరలో సాధారణ పరిస్థితులు తీసుకువస్తామని, మమ్మల్ని నమ్మాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రధాని నరేంద్ర మోడీకి హామీ ఇచ్చారు.

15 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

15 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

తమిళనాడులో గత 24 గంటల్లో ఇద్దరు డీఎంకే (ప్రతిపక్ష పార్టీ) ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని తేలడంతో తమిళనాడులో కరోనా వైరస్ తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం అవుతోంది. ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. తమిళనాడులో మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారినపడ్డారు.

 ముచ్చటగా ముగ్గురు మంత్రులు

ముచ్చటగా ముగ్గురు మంత్రులు


తమిళనాడులో 15 మంది ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు మంత్రులకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. కరోనాను నివారించడంలో భాగంగా ప్రజలను చైతన్యవంతం చెయ్యడానికి ప్రయత్నించిన తమిళనాడు సహకార శాఖా మంత్రి సెల్లూరు రాజు, విద్యుత్ శాఖా మంత్రి తంగమణి, విద్యాశాఖా మంత్రి కేపీ, అన్బళగన్ లకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. మంత్రి సెంగట్టవన్ తో కలిసి తిరిగిన మరో నలుగురు ఎమ్మెల్యేలకు వైద్యపరీక్షలు చేసి ఆ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.

సెల్లూరు రాజు సేఫ్

సెల్లూరు రాజు సేఫ్

మదురైలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో మంత్రి సెల్లూరు రాజు ఎంట్రీ ఇచ్చారు. మదురై జిల్లాలో కరోనా వైరస్ కట్టడి కోసం శక్తివంచనలేకుండా పని చేస్తున్న సెల్లూరు రాజుకు కరోనా తగులుకుంది. మంత్రి సెల్లూరు రాజును చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేశారు. చెన్నైలో కరోనాతో పోరాటం చేసి ప్రాణాలు దక్కించుకున్న మంత్రి సెల్లూరు రాజు ఆరోగ్యంగా బయటకు వచ్చారు.

 రాజువయ్యా..... మహరాజువయ్యా

రాజువయ్యా..... మహరాజువయ్యా

చెన్నైలో కరోనాను జయించి సొంత జిల్లా మదురైలో సెల్లూరు రాజు అడుగుపెట్టారు. మదురై జిల్లా ప్రజలను కరోనా నుంచి కాపాడటానికి మీ ప్రాణాలు కూడా లెక్క చెయ్యకుండా పని చేశారని, మీ ప్రాణాలు ఉన్నంత వరకు మీరు మా గుండెల్లో ఉంటారంటూ మంత్రి సెల్లూరు రాజుకు ఆయన అభిమానులు, మద్దతుదారులు స్వాగతం పలికారు. మీ పేరులోనే రాజు ఉంది, మీరు రాజు కాదు మాకు మహరాజు అంటూ పెద్దపెద్ద ఫెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. చెన్నైతో పోటీ పడిన కరోనా వైరస్ మదురై జిల్లాలో తన ప్రతాపం చూపిస్తోంది. ఇలాంటి సమయంలో మదురై జిల్లాలో కరోనా కట్టడికి సెల్లూరు రాజు అనేక ప్రయత్నాలు చేశారు.

రాజాధిరాజ రాజమార్తాండ

రాజాధిరాజ రాజమార్తాండ

మంత్రి సెల్లూరు రాజును తమిళ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సుందరపాండియన్ తో పోల్చుతూ ఫెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. మంత్రి సెల్లూరు రాజుతో పాటు ఆయన సతీమణి ఫోటోలతో ఫెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎంజీ. రామచంద్రన్ (ఎంజీఆర్), తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తదితర అన్నాడీఎంకే పార్టీ నేతల ఫోటోలతో మంత్రి సెల్లూరు రాజు అభిమానులు, మద్దతుదారులు మదురై జిల్లాలో భారీగా ఫెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేసి ఆయనకు స్వాగతం పలికారు.

English summary
Coronavirus: Tamil Nadu Minister Sellur Raju supporters welcomes him by posters after he cured from COVID 19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X