Coronavirus: దక్షిణ భారతదేశంలో కరోనా లేని ఏకైక జిల్లా, తమిళ తంబీలతో టెన్షన్, వీరప్పన్ అడ్డా !
బెంగళూరు/ చెన్నై/ చామరాజనగర: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి తాండవం చేస్తోంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోయినట్లు దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దక్షిణ భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దక్షిణ భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు లేని ఏకైక జిల్లాగా గుర్తింపు తెచ్చుకున్న జిల్లాలో ఇప్పుడు కరోనా భయంతో ప్రజలు హడలిపోతున్నారు. స్థానికుల నుంచి కాకుండా పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న తమిళ తంబీల వలన ఎక్కడ మాకు కరోనా వైరస్ వస్తుందో అంటూ స్థానికులు హడలిపోతున్నారు. నరహంతకుడు వీరప్పన్ అడ్డా అయిన ప్రాంతంలో ఇప్పుడులాక్ డౌన్ సమయంలో అక్రమంగా తమిళ తంబీలు చొరబడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
Lockdown: ఆర్థిక సమస్యలు, వీడు ఏం చేశాడో తెలిస్తే మీరు ఏమంటారో తెలీదు, ప్రియురాలి వీడియోలు !

ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేని ఏకైక జిల్లా
దక్షిణ భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కటి కూడా లేని ఏకైక జిల్లాగా కర్ణాటకలోని చామరాజనగర జిల్లా పేరు తెచ్చుకుంది. చామరాజనగరలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అందరూ చికిత్స పొందుతూ కోలుకున్నారు. ప్రస్తుతం చామరాజనగర జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేకుండా ఆ జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది శక్తివంచన లేకుండా పని చేశారు.

నరహంతకుడు వీరప్పన్ అడ్డా
చామరాజనగర జిల్లాను ఆనుకుని తమిళనాడు రాష్ట్రం ఉంది. కర్ణాటక- తమిళనాడు రాష్ట్ర సరిహద్దులో దట్టమైన అటవి ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం పరిసర ప్రాంతాలను అడ్డాగా చేసుకున్న నరహంతకుడు, స్మగ్లర్ వీరప్పన్ కూడా ఎన్నో సంవత్సరాలు రెచ్చిపోయాడు. ఇప్పుడు అదే అటవి ప్రాంతం నుంచి గట్టుచప్పుడు కాకుండా తమిళ తంబీలు చామరాజనగర జిల్లాలో ప్రవేశిస్తున్నారని స్థానికులు గుర్తించారు.

తమిళ తంబీలతో టెన్షన్
తమిళనాడు నుంచి అక్రమ మార్గంలో కర్ణాటకలోకి ప్రవేశిస్తున్నారని తెలుసుకున్న స్థానిక గ్రామస్తులు ఆ ప్రాంతంలోని అన్ని మార్గాలు మూసివేశారు. తమిళనాడులో రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు చామరాజనగర జిల్లాలో అడుగుపెట్టకుండా స్థానిక జిల్లా అధికారులు అనేక కఠిన చర్యలు తీసుకున్నారు. అయినా ప్రతినిత్యం తమిళనాడు నుంచి అక్రమ మార్గంలో చామరాజనగర జిల్లాలోకి తమిళ తంబీలు రావడంతో స్థానిక ప్రజలకు టెన్షన్ మొదలైయ్యింది.

అర్దరాత్రి చిక్కిపోయారు
తమిళనాడు నుంచి చామరాజనగర జిల్లాలోకి అక్రమంగా అటవి ప్రాంతం నుంచి వస్తున్న 10 మందిని బదనగుప్ప గ్రామం సమీపంలో స్థానికులు గుర్తించి వారిని పట్టుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రత్యేక అంబులెన్స్ లు తీసుకుని బదనగుప్ప ప్రాంతానికి చేరుకున్న అధికారులు 10 మంది తమిళ తంబీలను క్వారంటైన్ కు తరలించడానికి ప్రయత్నించారు. క్వారంటైన్ కు వెళ్లడానికి తమిళ తంబీలు ఎదురు తిరగడంతో అధికారులు వారికి వార్నింగ్ ఇచ్చి అంబులెన్స్ ల్లో చామరాజనగర జిల్లా ఆసుపత్రికి తరలించారు.