చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: లక్ష మార్క్ సమీపంలో, బ్యాంక్ బ్యాలెన్స్ కాదు కరోనా కేసులు, చెన్నై 60 వేలు నాటౌట్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి తమిళ తంబీలను భయంకంపితులను చేస్తోంది. పదులు, వందలు, వేల సంఖ్య దాటిపోయి లక్ష కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యకు దగ్గరగా వచ్చేస్తోంది. ప్రతిరోజు నాలుగు అంకెల సంఖ్యతో బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోయినట్లు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోవడంతో తమిళ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీతో రోజురోజుకు పోటీ పడుతున్న తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం హడలిపోయింది. లక్ష కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను కట్టడి చెయ్యకుంటే తమిళనాడు మీద మాయని మచ్చ పడే అవకాశం ఉందని, ఎలాగైనా కరోనా మహమ్మారిని అదుపు చెయ్యాలని తమిళనాడు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది.

Lockdown murder: భర్తకు దిక్కులేని ఆస్తి, భార్యకు ఫేస్ బుక్ ప్రియులు, సినిమా స్కెచ్, హైవేలో ఫినిష్Lockdown murder: భర్తకు దిక్కులేని ఆస్తి, భార్యకు ఫేస్ బుక్ ప్రియులు, సినిమా స్కెచ్, హైవేలో ఫినిష్

 మళ్లీ లాక్ డౌన్ ప్రయోగం

మళ్లీ లాక్ డౌన్ ప్రయోగం

తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతిరోజు వేల సంఖ్యలో నమోదౌతున్నాయి. ఈ సమయంలో తమిళనాడులో ఐదు జిల్లాలో ప్రత్యేకంగా సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేశారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదౌతున్న చెన్నై సిటీతో పాటు కాంచీపురం, తిరువళ్లారు, చెంగల్పట్టు, మదురై జిల్లాల్లో మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ (మార్చి 25వ తేదీ దేశంలో ఎలా మొదలైయ్యిందో అలాగే) అమలు చెయ్యాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యడం, ఆ జిల్లాల్లో లాక్ డౌన్ అమలులోకి రావడం చకచకా జరిగిపోయాయి.

 మహారాష్ట్ర, ఢిల్లీతో తమిళనాడు పోటీ

మహారాష్ట్ర, ఢిల్లీతో తమిళనాడు పోటీ

భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు లక్ష 80 వేలు దాటిపోయిన రాష్ట్రంగా మహారాష్ట్ర గుర్తింపు తెచ్చుకుంది. తరువాత దేశ రాజధాని ఢిల్లీలో సైతం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు లక్షకు (ప్రస్తుతం 89 వేలు) చేరువలో ఉన్నాయి. ఇదే సమయంలో తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 94, 049కు చేరిపోవడంతో తమిళనాడు ప్రభుత్వం ఉలిక్కిపడింది. మహారాష్ట్ర, ఢిల్లీతో పోటీ పడుతూ తమిళనాడులో కరోనా వైరస్ విజృభిస్తోంది.

 చెన్నై 60 వేలు నాటౌట్

చెన్నై 60 వేలు నాటౌట్

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీ పేరు చెబితో తమిళనాడుతో పాటు దేశం మొత్తం హడలిపోతున్నది. చెన్నై సిటీలో బుధవారం రాత్రి వరకు 60, 533 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. చెన్నై సిటీలో ఇప్పటి వరకు 2, 852 మంది మాత్రమే కరోనా వైరస్ వ్యాధి చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక చెన్నై సిటీలో బుధవారం ఒక్కరోజే 2, 182 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనాయి.

 మూడు రోజుల్లో సినిమా ?

మూడు రోజుల్లో సినిమా ?

తమిళనాడులో బుధవారం ఒక్కరోజు మాత్రమే 3, 882 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. గత కొన్ని రోజుల నుంచి తమిళనాడులో వరుసగా ప్రతిరోజు మూడు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదౌతున్నాయి. తమిళనాడులో ఇలాగే ప్రతిరోజు మూడు వేలకు పైగా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతే మరో మూడు రోజుల్లో లక్ష కరోనా పాజిటివ్ కేసులు దాటిపోయే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

 మరో పోలీసు అధికారి బలి

మరో పోలీసు అధికారి బలి

తమిళనాడులో కరోనా వైరస్ వ్యాధి చికిత్స విఫలమై 1, 264 మంది మరణించారు. బుధవారం ఒక్కరోజు మాత్రమే 63 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. చెన్నైలోని మాంబళం పోలీస్ స్టేషన్ పోలీస్ ఇన్స్ పెక్టర్ బాలమురళి కరోనా వైరస్ కు బలి అయిన విషయం మరువకముందే అదే చెన్నై సిటీలోని పట్టినపాక్కం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మణిమారన్ (57) కరోనా వైరస్ వ్యాధి చికిత్స విఫలమై మరణించారు. చెన్నై సిటీలో కరోనా వైరస్ కాటుకు పోలీసులు, అధికారులు బలి కావడంతో సాటి పోలీసు శాఖ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Recommended Video

Ravikumar మరణం పై స్పందించిన Chest Hospital వర్గాలు! || Oneindia Telugu
 సాధ్యం అవుతుందా ?

సాధ్యం అవుతుందా ?

తమిళనాడులో లక్ష కరోనా కేసులతో ఆ మహమ్మారిని కట్టడి చెయ్యకపోతే పరిస్థితి మరి దారుణంగా తయారౌతుందని తమిళనాడు ప్రభుత్వం ఆందోళన చెందుతోందని తెలిసింది. మొత్తం మీద మహారాష్ట్ర, ఢిల్లీలతో తమిళనాడులో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాధి కేసులు పెరిగిపోవడంతో తమిళ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది.

English summary
Coronavirus: Tamil Nadu on Wednesday reported 3,882 COVID-19 cases taking the state tally to 94,049. With 63 casualties in the last 24 hours, the death toll reached 1,264. Of the total cases, Chennai reported 2,182. So far, 60,533 cases have been reported in the capital city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X