బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown దెబ్బ: అర్ధరాత్రి సిగరెట్ కోసం 12 కిలోమీటర్లు రౌండ్, పోలీసులనే అడిగితే?, అంతే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ కోరమంగల: కరోనా వైరస్ (COVID 19) ను అరికట్టడానికి దేశవ్యాప్తంగా Lockdown అమలు చేశారు. లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో మందు బాబులతో పాటు సిగరెట్ అలవాటు ఉన్న కొన్ని లక్షల మంది నాలుకలు పిడచ కట్టుకుపోతున్నాయి. ఎలాగైనా మద్యం సేవించాలని కొందరు, సిగరెట్ తాగాలని చాలా మంది నానా తంటాలు పడుతున్ననారు. అయితే ఓ మహానుభావుడు సిగరెట్ కోసం ఏకంగా 12 కిలోమీటర్లు తిరిగేశాడు. అడ్డుకున్న పోలీసులను అతను అమ్మనాబూతులు తిట్టాడు. పోలీసులకు మండిపోయి సిగరెట్ కోసం బెంగళూరు మొత్తం చూట్టేసిన యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు.

Coronavirus:ఆసుపత్రిలో కరోనా రోగి టిక్ టాక్ వీడియోలతో యువతి హంగామా, సెల్ఫీలు !Coronavirus:ఆసుపత్రిలో కరోనా రోగి టిక్ టాక్ వీడియోలతో యువతి హంగామా, సెల్ఫీలు !

బెంగళూరులో ఒక్క సిగరెట్ రూ. 25

బెంగళూరులో ఒక్క సిగరెట్ రూ. 25

కరోనా వైరస్ కట్టడి కోసం దేశం మొత్తం లాక్ డౌన్ అమలులో ఉంది. ఇక ఐటీ బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన బెంగళూరు మహానగరంలో మద్యం విక్రయాలు నూటికి నూరు శాతం నిలిచిపోయాయి. ఇదే సమయంలో ధూమపాన ప్రియుల కోసం ఇంత కాలం స్టాక్ ఉన్న సిగరెట్ లు దాదాపుగా ఖాళీ అయ్యాయి. సిగరెట్ లకు ఎక్కువ డిమాండ్ పెరిగిపోవడంతో బెంగళూరు నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క సిగరెట్ 25 రూపాయలకు విక్రయిస్తున్నారు.

పాపం సిగరెట్ ప్రియుడు

పాపం సిగరెట్ ప్రియుడు

బెంగళూరు నగరంలోని ఇందిరానగర్ లో అనూజ్ మూడా (31) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇతను కొన్ని ప్యాకెట్ల సిగరెట్ లు ముందుగానే ఇంటిలో స్టాక్ పెట్టుకున్నాడు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితం అయిన అనూజ్ మూడా స్టాక్ పెట్టుకున్న సిగరెట్ లు ఇష్టం వచ్చినట్లు అన్నీ కాల్చేశాడు.

అర్దరాత్రి సిగరెట్ కోసం?

అర్దరాత్రి సిగరెట్ కోసం?

రాత్రి సిగరెట్లు పూర్తిగా ఖాళీ కావడంతో అనూజ్ మూడాకు పిచ్చిపట్టినట్లు అయ్యింది. అంతే ఇంటి నుంచి బయటకు వచ్చిన అనూజ్ మూడా సిగరెట్ల కోసం ఇందిరానగర్ మొత్తం ఓ రౌండ్ వేశాడు. ఎక్కడా సిగరెట్లు లేకపోవడంతో రోడ్ల మీద కనపడిన ప్రతి ఒక్కరినీ సిగరెట్ కావాలని అడిగాడు. అయినా సిగరెట్లు చిక్కకపోవడంతో అనూజ్ మూడా నిరాశ చెందాడు.

కారు బయటకు తీసి!

కారు బయటకు తీసి!

అర్దరాత్రి ఎలాగైనా సిగరెట్ సంపాదించాలని అనూజ్ మూడా నిర్ణయించుకున్నాడు. అంతే ఇంటిలో పార్క్ చేసిన కారు బయటకు తీశాడు. ఇందిరా నగర్ నుంచి కోరమంగల వెళ్లాడు. మార్గం మద్యలో సిగరెట్ల తీసుకోవాలని అనూజ్ మూడా చాలా ప్రయత్నాలు చేశాడు. ఎక్కడా సిగరెట్ చిక్కకపోవడంతో కారులో అక్కడి నుంచి మళ్లీ బయలుదేరాడు.

12 కిలో మీటర్లు చుట్టేశాడు

12 కిలో మీటర్లు చుట్టేశాడు

కోరమంగల నుంచి నేరుగా సిల్క్ బోర్డు చేరుకున్న అనూజ్ మూడా అక్కడి నుంచి రోడ్ల చుట్టుపక్కల పరిశీలిస్తూ బీటీఎం లేఔట్ చేరుకున్నాడు. తరువాత బీటీఎం లేఔట్ మొత్తం సిగరెట్ల కోసం చుట్టేశాడు. అప్పటికే ఇందిరానగర్ నుంచి అనూజ్ మూడా 12 కిలో మీటర్లు చుట్టేశాడు. ఎక్కడా సిగరేట్లు చిక్కకపోవడంతో బీటీఎం లేఔట్ నుంచి నేరుగా మళ్లీ కోరమంగల వెళ్లాడు.

పోలీసును సిగరెట్ అడిగితే ఎలా ఉంటుందంటే?

పోలీసును సిగరెట్ అడిగితే ఎలా ఉంటుందంటే?

కోరమంగల జంక్షన్ లో హెడ్ కానిస్టేబుల్ శివకుమార్ డ్యూటీలో ఉన్నాడు. లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న శివకుమార్ వాహనాలు పాటు, అటూ ఇటూ ఎవ్వరూ తిరగకుండా చూస్తున్నాడు. అదే సమయంలో డ్యూటీలో జంక్షన్ లో నిలబడి ఉన్న హెడ్ కానిస్టేబుల్ శివకుమార్ దగ్గరకు వెళ్లిన అనూజ్ మూడా కారు నిలిపి హలో సార్, ఇక్కడ సిగరెట్లు ఎక్కడ దొరుకుతాయి ? అని ప్రశ్నించాడు. అప్పటికే నిద్రలేకుండా డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ శివకుమార్ కు చిర్రెత్తిపోయింది.

పోలీసులను బూతులు తిట్టాడు

పోలీసులను బూతులు తిట్టాడు

లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో రోడ్ల మీద సంచరించడమే కాకుండా మమ్మల్ని సిగరెట్లు ఎక్కడ ఉన్నాయి ? అని అడుగుతావా ? నీకు ఎంత ధైర్యం అని హెడ్ కానిస్టేబుల్ శివకుమార్ మండిపడ్డారు. అదే సమయంలో మాటామాటా పెరగడంతో సిగరెట్ కోసం తిరిగితిరిగి విసిగిపోయిన అనూజ్ మూడా హెడ్ కానిస్టేబుల్ శివకుమార్ ను అమ్మనాబూతులు తిట్టాడు.

Recommended Video

PM Urges People To Light Diyas For 9 Minutes On April 5 At 9 PM
 సిగరెట్ కోసం వెళితే పోలీసు కేసు

సిగరెట్ కోసం వెళితే పోలీసు కేసు

బూతులు తిట్టిన అనూజ్ మూడాను పట్టుకోవడానికి కోరమంగల పోలీసులు ప్రయత్నించారు. అయితే అక్కడి నుంచి తప్పించుకుని అనూజ్ మూడా పారిపోయాడు. కారు నెంబర్ ఆధారంగా లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి అర్దరాత్రి రోడ్ల మీద తిరిగాడని, అడ్డుకున్న పోలీసులను బూతులు తిట్టి దౌర్జన్యం చేశాడని అనూజ్ మూడాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో బెంగళూరు నగరంలో సిగరెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో స్టాక్ ఖాళీ అయిపోతున్న సమయంలో ఒక్కొక్క సిగరెట్ 25 రూపాయలకు విక్రయిస్తున్నారు. మొత్తం మీద సిగరెట్ల కోసం బెంగళూరులో 12 కిలోమీటర్లు చుట్టేసిన అనూజ్ మూడా మీద కేసు నమోదు అయ్యింది.

English summary
Coronavirus: Koramangala police filed FIR against Anuj Mooda, The person was roam 12 km to buy cigarette in lockdown period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X