వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus:ఢిల్లీ తబ్లీగి జమాత్ సమావేశాలకు రోహింగ్యాలు హాజరైనారు, మీరు జాగ్రత్త, కేంద్రం !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ హైదరాబాద్: భారతదేశంలో కరోనా వైరస్ ను (COVID 19) అరికట్టడానికి దేశం మొత్తం రెండో విడత లాక్ డౌన్ అమలు చేశారు. దేశంలో కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అయితే అంతకు ముందే ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు దేశం మొత్తం సంచరించారని వెలుగు చూడటంతో ఆందోళన మొదలైయ్యింది. దేశంలో 63 శాతం కరోనా వైరస్ కేసులు నమోదు కావడానికి తబ్లీగి జమాత్ కార్యకర్తలే కారణం అని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో తబ్లీగి జమాత్ సమావేశాలకు రోహింగ్యాలు హాజరైనారని, వారు ఎక్కడ ఉన్నా వెంటనే కరోనా వైరస్ వైద్యపరీక్షలు చేయించాలని కేంద్ర హోమ్ శాఖ హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం హెచ్చరికతో రోహింగ్యాలు నివాసం ఉంటున్న ప్రాంతాల్లోని ప్రజల్లో ఆందోళన మొదలైయ్యింది.

Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!

ఢిల్లీలో సమావేశం

ఢిల్లీలో సమావేశం

కరోనా వైరస్ ను కంట్రోల్ చెయ్యడానికి ప్రభుత్వాలు నానా తిప్పులు పడుతున్నాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ లోని తబ్లీగి జమాత్ సమావేశం కరోనా వైరస్ కు హాట్ స్పాట్ అయ్యిందని స్పష్టంగా వెలుగు చూసింది. తబ్లీగి జమాత్ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కొన్ని వేలమంది హాజరైనారని ఇప్పటికే అధికారుల విచారణలో వెలుగు చూసింది.

తబ్లీగి జమాత్ కు రోహింగ్యాలు

తబ్లీగి జమాత్ కు రోహింగ్యాలు

మయన్మార్ నుంచి వలస వచ్చిన రోహింగ్యాలు ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైనారని కేంద్ర హోమ్ శాఖ విచారణలో వెలుగు చూసింది. దేశంలోని వివిద ప్రాంతాల్లో నివాసం ఉంటున్న రోహింగ్యా ముస్లీంలు ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైనారని, అక్కడి నుంచి వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారని కేంద్ర హోమ్ శాఖ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

రోహింగ్యాలకు కరోనా పరీక్షలు

రోహింగ్యాలకు కరోనా పరీక్షలు

దేశంలోని అన్ని ప్రాంతాల్లో వలస వచ్చి నివాసం ఉంటున్న రోహింగ్యాలకు వెంటనే కరోనా వైరస్ వైద్య పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. రోహింగ్యాలకు వైద్యపరీక్షలు చెయ్యడంలో ఆలస్యమైతే సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని కేంద్ర హోమ్ శాఖ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించిందని తెలిసింది.

Recommended Video

Fake News Buster : 08 80 మంది రేడియో జాకీల జాబ్స్ తీసేసిన FM గోల్డ్ ?
ఢిల్లీ, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్

ఢిల్లీ, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్

మయన్మార్ నుంచి భారత్ కు వలస వచ్చిన రోహింగ్యాలు దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు జమ్మూ కాశ్మీర్ లో ఎక్కువగా నివాసం ఉంటున్నారని తెలిసింది. ఢిల్లీ, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ తో పాటు అన్ని రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తల దాచుకున్న రోహింగ్యాలు ఎవరెవరు ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైనారు అనే విషయం గుర్తించే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నం అయ్యారు. మొత్తం మీద భారతదేశంతో పాటు విదేశీయులు, వలస వచ్చిన రోహింగ్యాలు తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైనారని వెలుగు చూసింది.

English summary
Coronavirus: The Home Ministry has asked all states and UTs to screen Rohingya Muslims living under their jurisdiction for COVID-19 as many of them had attended the Tablighi Jamaat congregation in Delhi's Nizamuddin, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X