వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్ర‌మ‌ సంబంధాల గుట్టు విప్పుతున్న క‌రోనా ! పోలీసుల ట్రాకింగ్ లో షాకింగ్ నిజాలు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టిస్తుంటే చాలా చోట్ల పలు ప్రయోజనాలు కూడా అందిస్తోంది. వీటిలో క్రైమ్ రేట్, రోడ్డు ప్రమాదాలు తగ్గడం ఓ ఎత్తయితే అక్రమ సంబంధాల గుట్టు కూడా వీడుతోంది. రోగుల సెల్ ఫోన్ ట్రాకింగ్ చేసినప్పుడు వెలుగుచూస్తున్న అక్రమ సంబంధాల చైన్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ పోలీసులను మైండ్ బ్లాక్ చేసిందంటే అతిశయోక్తి కాదు.

కరోనా ట్రాకింగ్- విస్తుపోయే నిజాలు..

కరోనా ట్రాకింగ్- విస్తుపోయే నిజాలు..

కరోనా ఇప్పుడు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. గతంలో ఓ రోగం వస్తే ఇది వీరికి మాత్రమే వారికి మాత్రమే అనే వాదనలు వినిపించేవి. కానీ ఇప్పుడు కరోనా అలా కాదు సాధారణ జనం నుంచి దేశాధ్యక్షుల వరకూ ఎవరికీ ఇందులో మినహాయింపులు లేవు. ఇదే కోవలో ప్రస్తుతం కరోనా బాధితులుగా మారిన వారిలో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు కూడా భారీగానే ఉంటున్నట్లు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ పోలీసులు చేసిన ఓ కేసు దర్యాప్తు తేల్చింది. కరోనా సోకిన ఓ బాధితురాలి సెల్ ఫోన్ ట్రాక్ చేసినప్పుడు పోలీసులు విస్తుపోయేలా షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి.

భోపాల్ లో కరోనా కమ్ అక్రమ సంబంధాలు..

భోపాల్ లో కరోనా కమ్ అక్రమ సంబంధాలు..

భోపాల్‌లో ఓ అమ్మాయికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అయితే ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ వున్నాడ‌నే విష‌యం ఎవ‌రికీ, ఇంట్లోవాళ్ళ‌కు కూడా తెలియ‌దు. అయితే పోలీసులు ఆ అమ్మాయి ఫోన్‌పై నిఘా పెట్టారు. ఎవ‌రెవ‌రితో కాంట్రాక్ట్‌లో వుంటుందో లిస్ట్ తీశారు. అలా బాయ్ ఫ్రెండ్ బ‌య‌ట‌ప‌డ్డాడు. వెంట‌నే అత‌న్ని టెస్ట్ చేస్తే అత‌నికి పాజిటివ్ తేలింది. దీంతో షాక్‌కు గురైన పోలీసులు అత‌డు ఇంకెవ‌రితోనైనా కాంట్రెక్ట్‌లో వున్నాడా? ఫోన్‌లో ఈ మ‌ధ్య కాలంలో ఎవ‌రితో మాట్లాడాడు లిస్ట్ తీశారు. అంతే ఇక్క‌డా కూడా పోలీసుల మైండ్ బ్లాంక్ అయింది. ఈ అబ్బాయికి మ‌రో గ‌ర్ల్ ఫ్రెండ్ వుంది. త‌ర‌చూ ఆమెను క‌లుస్తూ వుండే వాడని చెప్పాడు. దీంతో పోలీసులు ఆ అమ్మాయికి టెస్ట్ చేశారు. ఆమెకు కూడా పాజిటివ్ వ‌చ్చింది.

ఈ చైనా ఇంత‌టితో ఆగ‌లేదు. ఊహించ‌ని రీతిలో మొద‌టి అమ్మాయి ద్వారా ఇంకో అబ్బాయికి క‌రోనా సోకింది. దీంతో ఆమె ఇద్ద‌రు అబ్బాయిల‌తో ల‌వ్ ఎఫైర్ న‌డిపింద‌ని బ‌య‌ట ప‌డింది.

 భోపాల్ లోనే మరో షాకింగ్ కేసు...

భోపాల్ లోనే మరో షాకింగ్ కేసు...

భోపాల్ లోని ఓ ప్రాంతంలో ఇలాంటిదే మ‌రో విచిత్ర‌మైన కేసును పోలీసులు ఛేదించారు. లాక్‌డౌన్ వున్నా ప్ర‌తి రోజూ ఆఫీసుకు వెళ్ళే వ్య‌క్తికి క‌రోనా సోకింది. అయితే ఇంటి చుట్టుప‌క్క‌ల కానీ, అత‌ని ఫ్రెండ్స్‌కు కానీ, ఆఫీసులో కానీ ఎవ‌రికైనా క‌రోనా వుందా అని ఆరా తీస్తే అలాంటిదేమీ లేదు. అయితే ఈ వ్య‌క్తి ఆఫీసు ముగిసిన త‌రువాత త‌న సెకెండ్ సెట‌ప్ ద‌గ్గ‌ర‌కు వెళ్తున్న‌ట్లు పోలీసులు ఫోన్ లిస్ట్ ద్వారా గుర్తించారు.

ఆమెకు టెస్ట్ చేస్తే క‌రోనా పాజిటివ్ వుంది. ఇద్ద‌రికీ పాజిటివ్ తేల‌డంతో ఇద్ద‌ర్నీ ఐసొలేష‌న్ వార్డుకు త‌ర‌లించారు. అయితే ఈమె ద్వారా ఇంకెవ‌రికైనా వ‌చ్చిందా అని పోలీసులు ఆమె పోన్ లిస్ట్‌పై దృష్టి పెట్టి విచార‌ణ చేప‌ట్టారు. గుట్టు చ‌ప్పుడు కాకుండా జ‌రిగిన వ్య‌వ‌హారాల‌న్నీ క‌రోనా పుణ్య‌మా అని వెలుగులోకి వ‌స్తున్నాయి.

 గుట్టు బయటపడటంతో బాధితుల గగ్గోలు...

గుట్టు బయటపడటంతో బాధితుల గగ్గోలు...

గతంలో గుట్టు చప్పుడు లేకుండా అక్రమ సంబంధాలు కొనసాగించిన వారంతా ఇప్పుడు సెల్ ఫోన్ ట్రాకింగ్ లతో బెంబేలెత్తుతున్నారు. కరోనా వైరస్ కాంటాక్టుల ట్రాకింగ్ సందర్బంగా పోలీసులకు తమ గుట్టు తెలిసిపోవడంతో ఇప్పుడు వారు అడిగే ప్రశ్నలతో వీరంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అదే సమయంలో తమ వ్యవహారం బయటికి పొక్కడంతో సమాజంలో తలెత్తుకోలేని పరిస్ధితి ఎదురవుతోందని వారంతా వాపోతున్నారు. అప్పటి వరకూ సమాజంలో గౌరవప్రదమైన స్ధానాల్లో ఉంటూ గుట్టుచప్పుడు కాకుండా అక్రమ సంబంధాలు నెరిపిన వీరు ఇకపై తప్పనిసరిగా కుటుంబాలతో సంసారాలు మాత్రమే చేసుకోక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది. ఆ విధంగా కరోనా వీరికి మేలు చేస్తుందని పోలీసులు చెబుతున్నారు.

Recommended Video

Andhra Pradesh Govt to Hike Liquor Prices By 25 Percent | Onewindia Telugu

English summary
bhopal police had shocked finding an illegal relation chain while tracking coronavirus spread recently. police found shocking data of illegal relations through cell phone tracking for covid 19 spread.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X