వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ఒకే ఫ్యామిలీలో 26 మందికి కరోనా పాజిటివ్, వారంలో ఒక్కడి దెబ్బకు, సీల్ డౌన్ !

|
Google Oneindia TeluguNews

జైపూర్/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బతో ఒక కుటుంబంలో విషాదం నెలకొనింది. ఒకే ఫ్యామిలీలోని 26 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో వారి బంధువులు, ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు, 26 మంది కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉన్న వారు ఇప్పుడు కరోనా భయంతో హడలిపోతున్నారు. ఆ కుటుంబంలోని ఓ వ్యక్తికి వారం ముందు కరోనా వచ్చింది. అతడి కారణంగా మిగిలిన 25 మంది కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకిందని అధికారుల విచారణలో వెలుగు చూడటంతో ఆ ప్రాంతం సీల్ డౌన్ చేశారు.

Coronavirus: మాజీ ప్రధాని, రైల్వే మంత్రికి కరోనా పాజిటివ్, లక్ష కేసులతో సినిమా కష్టాలు !Coronavirus: మాజీ ప్రధాని, రైల్వే మంత్రికి కరోనా పాజిటివ్, లక్ష కేసులతో సినిమా కష్టాలు !

వారం ముందు ఒకరికి కరోనా

వారం ముందు ఒకరికి కరోనా

రాజస్థాన్ లోని జైపూర్ సిటీలోని సుభాష్ చౌక్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా పాజిటివ్ అని తేల్చారు. వెంటనే ఆ వ్యక్తిని కరోనా ఐసోలేషన్ వార్డులో ప్రత్యేక చికిత్సలు అందించారు.

ఒక్కడు కాదు 26 మందికి కరోనా

ఒక్కడు కాదు 26 మందికి కరోనా


కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటిలో మొత్తం 26 మంది నివాసం ఉంటున్నారు. కుటుంబంలోని ఒకరికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో మిగిలిన 25 మందికి వైద్యపరీక్షలు చేశారు. 25 మందికి నిర్వహించిన వైద్య పరీక్షల ఫలితాలు వచ్చాయని, వారందికి కరోనా పాజిటివ్ అని తేలిందని రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్ సరోత్తమ్ శర్మ మీడియాకు చెప్పారు.

రాజస్థాన్ కరోనా హాట్ స్పాట్ జైపూర్

రాజస్థాన్ కరోనా హాట్ స్పాట్ జైపూర్


రాజస్థాన్ లో ఇప్పటి వరకు 11 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు రాజస్థాన్ లో 251 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రాజస్థాన్ కరోనా హాట్ స్పాట్ కేంద్రంగా జైపూర్ నిలిచింది. రాజస్థాన్ లో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యింది ఒక్క జైపూర్ సిటీలోనే అని అధికారులు అంటున్నారు.

ఫ్యామిలీ దెబ్బకు సీల్ డౌన్

ఫ్యామిలీ దెబ్బకు సీల్ డౌన్

జైపూర్ లోని సుభాష్ చౌక్ పరిసర ప్రాంతాలను అధికారులు సీల్ డౌన్ చేశారు. ఇతర ప్రాంతాల ప్రజలు సుభాష్ చౌక్ వైపు వెళ్లకుండా, ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. జైపూర్ తో పాటు విద్యావంతులు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాలుగా గుర్తింపు తెచ్చుకున్న కోట, జోథ్ పూర్ నగరాల్లో సైతం కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
Coronavirus: Twenty-six members of the same family have tested positive for Coronavirus in Rajasthan's Jaipur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X