వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: ఢిల్లీ టు యూపీ, బస్టాండ్లలో కిక్కిరిసిన వలసకూలీలు, ఆహారం అందజేత (వీడియో)

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రబలుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కాలినడకన ప్రయాణం ప్రారంభించారు. రహదారిపై వెళుతుండటంతో యూపీ ప్రభుత్వం ఢిల్లీకి బస్సులను పంపించింది. ఢిల్లీలో గల ఘజియాబాద్, గౌతమ్ బుద్ద్ నగర్‌కు యూపీ స్టేట్ రోడ్ ట్రాన్స్‌‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులను పంపించింది. ఆయా బస్ స్టేషన్లలో వందలాది మంది వలస కూలీలతో కిక్కిరిసిపోయి ఉంది.

గుంపులు గుంపులుగా..

గుంపులు గుంపులుగా..

కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలి. కానీ వందలాది మంది గుమికూడి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 27వ తేదీ వరకు యూపీఎస్ ఆర్టీసీ బస్సులు ద్వారా 96 బస్సుల ద్వారా వలస కార్మికులను పంపించారు. శనివారం ఉదయం 11.30 గంటల వరకు లక్నో, ఈతాహ్, బరేలి, అలీఘడ్, గోరఖ్ పూర్ వరకు ప్రయాణికులను తరలించారు.

96 బస్సులు

96 బస్సులు

లాల్ కువాన్ కూడలి నుంచి శుక్రవారం రాత్రి 96 బస్సులను పంపించామని అధికారులు పేర్కొన్నారు. ఇతర డిపోల నుంచి కూడా బస్సులు వెళ్లాయని.. 200 బస్సులను పోలీసులు నిలిపివేశారని పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీన ప్రధాని మోడీ లాక్ డౌన్ విధిస్తున్నామని ప్రకటించడంతో.. ఎక్కడివారు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కాలినడకన వెళ్లేవారిని కూడా ఆపలేమని ఘజియాబాద్ ఎస్పీ మనీశ్ మిశ్రా తెలిపారు.

30 గ్రూపులు

హపూర్, మొరాదాబాద్ నుంచి 25 నుంచి 30 గ్రూపులు స్వస్ధలాలకు వెళ్లేందుకు బయల్దేరాయి. వలస కూలీల కోసం చాలామంది ముందుకొచ్చారని.. ఖాళీ ట్రక్కులను కూడా పంపించారు. కానీ జాతీయ రహదారి 9పై ప్రజల వెళుతూనే ఉన్నారు. రోడ్డుపై వెళ్లే వారి కోసం టీచర్ రామ్ సుందర్ ఆహారాన్ని పంపిణీ చేశారు. ఉదయం, సాయంత్రం బస్సుల్లో వెళ్లేవారికి 250 నుంచి 300 బాక్సులు సిద్ధం చేశామని తెలిపారు. ఇప్పటికే నోయిడాలోని సరిహద్దు ప్రాంతాలకు బస్సులు చేరుకున్నాయని పోలీసులు తెలిపారు. వలస కార్మికలు ఉన్న నేపథ్యంలో వారిని ఆపొద్దని అధికారులు పోలీసులను కోరారు.

English summary
Uttar Pradesh government on Saturday ramped up the evacuation of migrant workers from the state who have been stranded in the Delhi national capital region
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X