• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా వ్యాక్సిన్ మరో మూడు,నాలుగు నెలల్లో వస్తుందని నమ్మకం : కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యలు

|

ఈ ఏడాది చివరిలోగా కరోనా వ్యాక్సిన్ వస్తుందని ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తుంటే, కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ రావడానికి మూడు నాలుగు నెలల కాలం ఇంకా పడుతుందంటూ ఆయన పేర్కొన్నారు. మూడు నాలుగు నెలల్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుంది అనే నమ్మకం తమకు ఉందని ఆయన తెలిపారు మంత్రి హర్ష్ వర్ధన్ ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ వెబినార్ లో 'ది షిఫ్టింగ్ హెల్త్‌కేర్ పారాడిగ్మ్ డ్యూరింగ్ అండ్ పోస్ట్-కోవిడ్' పై ప్రసంగించారు.

వ్యాక్సిన్ లేకుండానే కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవాలి : డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్వ్యాక్సిన్ లేకుండానే కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవాలి : డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్

కరోనా వ్యాక్సిన్ వచ్చాక ఏం చెయ్యాలో ఇప్పటి నుండే ప్లాన్ చేస్తున్న సర్కార్

కరోనా వ్యాక్సిన్ వచ్చాక ఏం చెయ్యాలో ఇప్పటి నుండే ప్లాన్ చేస్తున్న సర్కార్

వ్యాక్సిన్ కు ప్రాధాన్యత శాస్త్రీయ డేటా ఆధారంగా రూపొందించబడుతుందని పేర్కొన్న ఆయన, కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ విషయంలో మొదట కరోనా వారియర్స్ గా కరోనా నియంత్రణకు పోరాటం చేసిన ఆరోగ్య కార్యకర్తలకు తొలి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. తర్వాత వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కరోనా వైరస్ కు సంబంధించి వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉంచడానికి ఒక ప్లాన్ ప్రకారం నిర్ణయం జరుగుతోందని మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు . ఇందుకు సంబంధించిన బ్లూప్రింట్ గురించి చర్చించడానికి ఇ-వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ రూపొందించబడిందని ఆయన తెలిపారు.

కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రాధాన్యత క్రమాన్ని చెప్పిన మంత్రి

కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రాధాన్యత క్రమాన్ని చెప్పిన మంత్రి

2021 మనందరికీ మంచి సంవత్సరంగా ఉండాలని , కరోనా నివారణ విషయంలో ఆశాజనకమైన ఫలితాలు రావాలని ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ పేర్కొన్నారు.2021 జూలై-ఆగస్టు నాటికి 25-30 కోట్ల మందికి 400-500 మిలియన్ మోతాదులు అందుబాటులోకి వస్తాయని మంత్రి హర్ష వర్ధన్ అంచనా వేశారు. కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రాధాన్యత క్రమాన్ని నిపుణులచే శాస్త్రీయ దృక్పథంతో నిర్వహిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి , ఏప్రిల్ నెలల్లో మన ఏం చేయాలన్న దానిపై ఇప్పటి నుండే ప్రణాళికలు ప్రారంభించామని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.

 కరోనా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం

కరోనా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం

ప్రస్తుతానికి సామాజిక దూరాన్ని పాటించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుండి కాపాడుకోవచ్చని మంత్రి తెలిపారు.భారతదేశ కరోనావైరస్ తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం గురువారం 89,58,483 కు పెరిగింది, ఒక రోజులో 45,576 కొత్త కేసులు నమోదయ్యాయి, 585 కొత్త మరణాలతో మరణించిన వారి సంఖ్య 1,31,578 కు చేరుకుంది.

పలు దశల్లో వ్యాక్సిన్ ల క్లినికల్ ట్రయల్స్

పలు దశల్లో వ్యాక్సిన్ ల క్లినికల్ ట్రయల్స్

కరోనా వ్యాక్సిన్ విషయానికి వస్తే సీరం ఇన్స్టిట్యూట్ యొక్క ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ యొక్క దశ -3 ట్రయల్ దాదాపుగా పూర్తి కాగా, భారత్ బయోటెక్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) యొక్క స్వదేశీ-అభివృద్ధి చెందిన వ్యాక్సిన్ యొక్క మూడవ దశ క్లినికల్ ట్రయల్ ఇప్పటికే ప్రారంభమైంది.డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ త్వరలో భారతదేశంలో రష్యన్ కోవిడ్ 19 వ్యాక్సిన్, స్పుత్నిక్ వీ యొక్క సంయుక్త దశ -2 మరియు దశ -3 క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించనుంది. అలాగే, బయోలాజికల్ ఇ లిమిటెడ్ తన కరోనా వ్యాక్సిన్ యొక్క మొదటి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించింది.

ఫైజర్ ఇంక్ మరియు బయోఎంటెక్ ఎస్ఇ తమ వ్యాక్సిన్ కరోనాను నివారించడంలో 95 శాతానికి పైగా సమర్థవంతంగా పని చేస్తున్నట్లు పేర్కొంది. అయితే కరోనాకు వ్యతిరేకంగా తమ వ్యాక్సిన్ 94.5 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు మోడెర్నా తెలిపింది.

English summary
Union Health and Family Welfare Minister Dr Harsh Vardhan has said that he is 'confident' that the coronavirus vaccine will be ready in the next three to four months.Minister Harsh Vardhan was addressing the FICCI FLO webinar on 'The Shifting Healthcare Paradigm During and Post-Covid' when he made the statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X