వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెప్టెంబర్ నుంచి పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ప్రారంభం: ఎయిమ్స్ చీఫ్ గులేరియా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం 18ఏళ్లు పైబడినవారందరికీ కరోనావైరస్ వ్యాక్సినేషన్ జరుగుతున్న విషయం తెలిసిందే. పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఎప్పట్నుంచి ఇస్తారనే విషయంపై ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. వచ్చే వారాల్లో లేదా సెప్టెంబర్‌లోపే పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయన్నారు.

గుజరాత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డీ.. ప్రపంచలోనే డీఎన్ఏ ఆధారంగా తయారైన తొలి కరోనా వ్యాక్సిన్ కావడం గమనార్హం. జులై 1న కంపెనీ అత్యవసర అనుమతుల కోసం డీసీజీఐకి దరకాస్తు చేసుకుంది. 12ఏళ్లకు పైబడిన వారిపై తమ టీకా పనిచేస్తుందని తెలిపింది.

 Coronavirus vaccines for kids likely by September, says Dr Randeep Guleria

టీకా చిన్నారులపై ప్రయోగాలు పూర్తయింది. ఇక పిల్లలపై కోవాగ్జిన్ ట్రయల్స్ సైతం త్వరలో పూర్తి కానున్నాయని తెలిపారు. ఈ టీకా ఆమోదానికి సంబంధించి అపెక్స్ డ్రగ్ రెగ్యూలేటర్‌కు ఆమోదానికి పంపినట్లు, వాటి అనుమతులు రాగానే వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని ఎయిమ్స్ చీఫ్ చెప్పారు.

ఇప్పటి వరకూ 12 ఏళ్లలోపు పిల్లలకే అమెరికా వ్యాక్సిన్లు ఫైజర్, మోడెర్నా వేసేందుకు అనుమతి లభించింది. ఈ రెండు ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో అభివద్ధి చెందినవన్నారు. ఇక కోవాగ్జిన్ ట్రయల్స్ 12-18ఏళ్లు, 6-12ఏళ్ల మధ్య పిల్లలకు రెండు డోసుల టీకా ప్రయోగం పూర్తయింది. ఇప్పటికే 2-6 ఏళ్ల మధ్య చిన్నారులకు తొలి డోసు టీకా ఇచ్చామని, రెండో డోసు టీకా ఇవ్వాల్సి ఉందని గులేరియా తెలిపారు.

కాగా, మనదేశంలో ఇప్పటి వరకు 45.37 కోట్ల జనాభాకి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. 11 కోట్ల డోసుల టీకాలు సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 21 నుంచి దేశ వ్యాప్తంగా అందరికీ ఉచిత టీకా అందిస్తున్నారు.

English summary
Coronavirus vaccines for kids likely by September: Dr Randeep Guleria.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X