వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: కరోనా కాటుకు బలి, ఒకే గుంతలో మృతదేహాలు మొత్తం విసిరేసి, దారుణం, వీడియో వైరల్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ బళ్లారి: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి వ్యాధితో మరణించిన వారి అంత్యక్రియలు సాంప్రధాయబద్దంగా జరగాలని కోర్టులు చెప్పినా సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదు. కరోనా వైరస్ వ్యాధితో మరణించిన వారి మృతదేహాలను మూటకట్టి ఒకదానిమీద ఒకటి వేసి అత్యంత దారుణంగా ఒకే గొతిలో (గుంత)లోకి విసిరేసి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఒకే గొతిలోకి మృతదేహాలు అన్నీ విసిరివేస్తున్న సమయంలో తీసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణకు ఆ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Coronavirus: అక్కకు కరోనా పాజిటివ్, చెట్టెక్కిన చెల్లి పెళ్లి, ఎంకి పెళ్లి సబ్బు చావుకు వచ్చింది !Coronavirus: అక్కకు కరోనా పాజిటివ్, చెట్టెక్కిన చెల్లి పెళ్లి, ఎంకి పెళ్లి సబ్బు చావుకు వచ్చింది !

ఒకే రోజు 8 మంది మృతి

ఒకే రోజు 8 మంది మృతి

ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దులోని మైనింగ్ హబ్ గా పేరు పొందిన బళ్లారి జిల్లా ఉంది. బళ్లారి జిల్లాలో కరోనా వైరస్ తాండవం చెయ్యడంతో అక్కడి అధికారులు అలర్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి ఎవ్వరూ బళ్లారి జిల్లాలో అడుగుపెట్టకుండా అన్ని రహదారులను అధికారులు మూసివేశారు. ఇదే సమయంలో సోమవారం (జూన్ 29వ తేదీ) కరోనా వైరస్ వ్యాధి చికిత్స విఫలమై బళ్లారి జిల్లాలో 8 మంది మృతి చెందారు.

ఒకేచోట అంత్యక్రియలు

ఒకేచోట అంత్యక్రియలు


కరోనా వైరస్ వ్యాధితో మరణించిన వారికి బళ్లారి నగర శివార్లలో ఒకేచోట అంత్యక్రియులు నిర్వహించడానికి ఆరోగ్య శాఖ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వైరస్ వ్యాధితో మరణించిన వారి మృతదేహాలకు ప్రభుత్వ నియమాల ప్రకారం అన్ని వైద్యపరీక్షలు నిర్వహించిన తరువాత మృతదేహాలకు ఒకేచోట అంత్యక్రియులు నిర్వహించాలని వైద్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఒకే గుంతలోకి విసిరేశారు

ఒకే గుంతలోకి విసిరేశారు

బళ్లారి నగర శివార్లలో వైద్య శాఖ అధికారులు సూచించిన ప్రాంతానికి ప్రత్యేక వాహనంలో కరోనా వైరస్ వ్యాధితో మరణించిన వారి మృతదేహాలను తీసుకెళ్లారు. తరువాత అన్ని మృతదేహాల అంత్యక్రియలు నిర్వహించడానికి వేర్వేరు గుంతలు తియ్యకుండా ఒకే గుంత తీసి అందులో మృతదేహాలను ఒకదాని మీద ఒకటి విసిరేశారు.

వీడియో వైరల్

కరోనా వైరస్ వ్యాధితో మరణించిన వారి మృతదేహాలను ఒకదాని తరువాత ఒకటి విసిరి వేస్తున్న సమయంలో ఓ వ్యక్తి దానిని అతి సమీపం నుంచి వీడియో తీశాడు. వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు చాలా నిర్లక్షంగా, అతి దారుణంగా కరోనా వైరస్ వ్యాధితో మరణించిన వారి
మృతదేహాలను ఒకదాని మీద ఒకటి విసివేసి త్వరంగా పూడ్చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోదామని అక్కడ ఉన్న సిబ్బంది చెప్పారు. మృతదేహాలను ఒకదాని మీద ఒకటి విసివేసి వైద్య సిబ్బంది చేతులు దులుపుకుని అక్కడి నుంచి వెళ్లిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

విచారణకు కలెక్టర్ ఆదేశం

విచారణకు కలెక్టర్ ఆదేశం


బళ్లారిలో కరోనా వైరస్ వ్యాధితో మరణించిన వారి మృతదేహాలను ఒకదాని మీద ఒకటి ఒకేగుంతలో విసిరి వేస్తున్న సమయంలో తీసిన వీడియో వైరల్ కావడంతో బళ్లారి జిల్లా కలెక్టర్ ఎస్ఎస్. నకుల్ సీరియస్ అయ్యారు. అప్పటికే సోషల్ మీడియాలో వైద్య సిబ్బంది, కార్పోరేషన్ సిబ్బంది, అధికారుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురుకావడంతో ఈ విషయంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని బళ్లారి జిల్లాధికారి ఎస్ఎస్. నకులు విచారణ అధికారి మంజునాథ్ కు ఆదేశాలు జారీ చేశారు. కరోనా మృతదేహాలను ఒకే గుంతలో అతి దారుణంగా విసిరేసిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

English summary
Coronavirus: Video of COVID 19 patients funeral in Ballari in Karnataka by health department goes viral in social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X