బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

COVID-19: ముంబాయి, ఢిల్లీని ఐటి హబ్ బీట్ చేస్తోందా ? కరోనా కాటు, ఇక హోటల్స్ దిక్కు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దేశంలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ దెబ్బతో ముంబాయి, ఢిల్లీ నగరాలు కరోనా పాజిటివ్ కేసుల్లో ముందు వరుసలో ఉన్నాయి. బెంగళూరు నగరంలో కూడా కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వచ్చేవారంలో లేదా రెండు వారాల్లో బెంగళూరులో కూడా అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయే అవకాశం ఉందని, ముంబాయి, ఢిల్లీని బీట్ చేసే అవకాశం ఉంది ? అని నిపుణులు హెచ్చరించడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. బెంగళూరులోని ఆసుపత్రులు అన్ని ఫుల్ అయిపోవడంతో కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులోని హోటల్స్ ను కోవిడ్ చికిత్సా కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించి హోటల్స్ యాజమాన్యంతో చర్చలు జరుపుతోంది.

Coronavirus: 80 శాతం కేసులు ఆ 10 రాష్ట్రాల్లోనే, అక్కడ ఒక్కరు కూడా ?, హే భగవాన్!Coronavirus: 80 శాతం కేసులు ఆ 10 రాష్ట్రాల్లోనే, అక్కడ ఒక్కరు కూడా ?, హే భగవాన్!

 ఇక బెంగళూరు వంతు వచ్చేస్తుంది ?

ఇక బెంగళూరు వంతు వచ్చేస్తుంది ?

కరోనా పాజిటివ్ కేసుల్లో ముంబాయి, ఢిల్లీ నగరాలు ముందు వరుసలో ఉన్నాయి. ఐటీ హబ్ బెంగళూరు నగరంలో కూడా కోవిడ్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వచ్చేవారంలో లేదా రెండు వారాల్లో బెంగళూరులో కూడా అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించడంతో కర్ణాటక ఆరోగ్య శాఖ, బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) అధికారులు అలర్ట్ అయ్యారు.

 ఇక మనోళ్లకు హోటల్స్ దిక్కు

ఇక మనోళ్లకు హోటల్స్ దిక్కు

బెంగళూరులోని ఆసుపత్రులు అన్ని ఫుల్ అయిపోవడంతో కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులోని హోటల్స్ ను కోవిడ్ చికిత్సా కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించి హోటల్స్ యాజమాన్యంతో చర్చలు జరిపింది. బెంగళూరులో కోటి మందికిపైగా జనాబా ఉండటంతో కోవిడ్ పాజిటివ్ కేసులు చాపకింద నీరులా విపరీతంగా పెరిగిపోతున్నాయి.

 రాష్ట్రంలో 60 శాతం కేసులు ఐటీ హబ్ లోనే

రాష్ట్రంలో 60 శాతం కేసులు ఐటీ హబ్ లోనే

కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం రాత్రి విడుదల చేసిన బులిటిన్ ప్రకారం గత 24 గంటల్లో కర్ణాటకలో మోత్తం 14, 869 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. గత 24 గంటల్లో 4,031 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా కరోనా మహమ్మారికి 78 మంది బలి అయ్యారు. కర్ణాటకలోని నమోదౌతున్న కరోనా పాజిటివ్ కేసులో 60 శాతం కంటే ఎక్కువ కరోనా కేసులు ఒక్క బెంగళూరు సిటీలోనే నమోదు అవుతున్నాయని అధికారులు అంటున్నారు.

అక్కడే దెబ్బ పడింది

అక్కడే దెబ్బ పడింది

కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేస్తున్న సమయంలోనే మెట్రో సిటీలు ముంబాయి, ఢిల్లీ నగరాలు వాటి సరిహద్దులు మూసివేసి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి కోవిడ్ పరీక్షలు చేయిస్తున్నారు. అయితే కర్ణాటక నుంచి వెళ్లిపోయిన వలస కార్మికులు మళ్లీ కర్ణాటకలో అడుగుపెడుతున్నారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ల కర్ణాటక సరిహద్దు నుంచి వచ్చే సమయంలో వాళ్లు కచ్చితంగా RT-PCR పరీక్షలు చేయించుకోకుండా రాష్ట్రంలోని అడుగుపెట్టడం వలనే ఇంత జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి.

 ఒకరి నుంచి 30 మందికి వైరస్ !

ఒకరి నుంచి 30 మందికి వైరస్ !

బెంగళూరులోని లైఫ్ కేర్ ఆసుపత్రి సీనియర్ వైద్యుడు ప్రొఫెసర్ ఎల్. శ్రీనివాసమూర్తి మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో కచ్చితంగా 30 కోట్ల మందికి కోవిడ్ టీకాలు వెయ్యాల్సి ఉందని అన్నారు. గతంలో ఒకరి నుంచి ఒకరికి వ్యాపించిన కరోనా వైరస్ తరువాత ఒకరి నుంచి ఐదు మందికి వ్యాపించిందని, ఇప్పుడు ఒకరి నుంచి ఏకంగా 30 మందికి ఆ వ్యాధి సోకే అవకాశం ఉందని డాక్టర్ శ్రీనివాసమూర్తి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 హోటల్స్ కోవిడ్ ఆసుపత్రులు

హోటల్స్ కోవిడ్ ఆసుపత్రులు

బెంగళూరు నగరంలో విపరీతంగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గత ఏడాది కరోనా వైరస్ (కోవిడ్ ఫస్ట్ వేవ్) సమయంలో బెంగళూరులో 18 హోటల్స్ ను కోవిడ్ ఆసుపత్రులుగా మార్చేశారు. ఇప్పుడు బెంగళూరులో మూడు హోటల్స్ మాత్రమే కోవిడ్ కేర్ సెంటర్లుగా ఉన్నాయి.

Recommended Video

Kumbh Mela 2021 : కుంభమేళా పై విమర్శలు... 2,167 మంది Covid-19 బారిన | Oneindia Telugu
 1, 000 హోటల్స్ ఉన్నా అందులో ?

1, 000 హోటల్స్ ఉన్నా అందులో ?

బెంగళూరులో 50 పడకలు కంటే ఎక్కువగా ఉన్న హోటల్స్ 1,000 కిపైగా ఉన్నాయి. 50 పడకలు కంటే ఎక్కువగా ఉన్న హోటల్స్ మాత్రమే కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చడానికి అవకాశం ఉంటుందని బీబీఎంపీ అధికారులు అంటున్నారు. బెంగళూరులో మరిన్ని హోటల్స్ కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చడానికి బీబీఎంపీ అధికారులు సిద్దం అవుతున్నారని తెలిసింది.

English summary
Coronavirus: Like all major cities of the country, Bengaluru has been witnessing a spike in Covid-19 cases over the past few days. Though it’s behind Mumbai and Delhi at this time, experts say in a week or two the city could see very big numbers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X