వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కోటీశ్వరులకు వస్తుంది, చప్పట్లు కొట్టి దీపాలు వెలిగిస్తే వైరస్ రాదా ?, మోదీపై సెటైర్లు, పైత్యం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID 19) తాండవం చేస్తోంది. చిన్నా, పెద్దా, పేదలు, శ్రీమంతులు, ప్రధానులు, మంత్రులు అనే తేడా లేకుండా ఎవ్వరికి పడితే వారికి కరోనా వైరస్ వ్యాపిస్తోంది. అయితే కష్టపడి పని చేసి రోడ్ల మీద తిరిగే వారికి కరోనా వైరస్ వ్యాపించదని, విమానాల్లో తిరిగే కోటీశ్వరులకు మాత్రమే ఆ వ్యాధి వ్యాపిస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అన్నారు. మీరు ధైర్యంగా ఉండాలని, మీ పక్కకు కూడా కరోనా వైరస్ రాదని, శ్రీమంతులకే ఆ వ్యాధి వస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జోస్యం చెప్పారు. చప్పట్లు కొట్టి దీపాలు వెలిగిస్తే కరోనా వైరస్ రాదా ? అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై సెటైర్లు వేశారు. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా తల్లడిల్లిపోతున్న సమయంలో మాజీ మంత్రిగారి వ్యాఖ్యలతో ప్రజలు ముక్కన వేలేసుకున్నారు.

Coronavirus Lockdown: బంపర్ ఆఫర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కుక్కర్, బీరువా, వామ్మో !Coronavirus Lockdown: బంపర్ ఆఫర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కుక్కర్, బీరువా, వామ్మో !

మిత్రమా..... శుభ్రంగా ఉందా ? లేదా ?

మిత్రమా..... శుభ్రంగా ఉందా ? లేదా ?

కర్ణాటక మాజీ మంత్రి, మంగళూరు- ఉళ్లాల శానససభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యూటీ. ఖాదర్ ఆయన నియోజక వర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా తన నియోజక వర్గంలో శుభ్రత ఎలా ఉంది ? అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే యూటీ. ఖాదర్ స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్నారు.

పారిశుద్ద కార్మికులు గ్రేట్

పారిశుద్ద కార్మికులు గ్రేట్

మన నియోజక వర్గంలో పారిశుద్ద కార్మికులు చాలాబాగా పని చేస్తున్నారని, ప్రతిరోజూ క్రమం తప్పకుండా రోడ్లు, పరిసర ప్రాంతాలు, డ్రైనేజ్ లు శుభ్రం చేస్తున్నారని స్థానికులు ఎమ్మెల్యే యూటీ. ఖాదర్ కు చెప్పారు. పారిశుద్ద కార్మికులు శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని, వారు నిజంగా చాలా గ్రేట్ అని స్థానికులు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యూటీ. ఖాదర్ కు వివరించారు.

మా ప్రాణాల కోసం మీ ప్రాణాలు త్యాగం !

మా ప్రాణాల కోసం మీ ప్రాణాలు త్యాగం !

నియోజక వర్గంలో పర్యటిస్తున్న సందర్బంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే యూటీ. ఖాదర్ పారిశుద్ద కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. మా ప్రాణాలు కాపాడటం కోసం మీరు మీ ప్రాణాలను లెక్కచెయ్యడం లేదని, మీ సేవలు మేము జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని పారిశుద్ద కార్మికులకు చెప్పారు.

కోటీశ్వరులకే కరోనా వస్తుంది !

కోటీశ్వరులకే కరోనా వస్తుంది !

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యూటీ. ఖాదర్ పనిలోపనిగా స్థానికులను, ఆయన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాధితో ప్రపంచం అంతా విలవిలలాడుతున్న విషయం తెలిసిందే. ఇదే కరోనా వైరస్ విషయంపై మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కష్టపడి పని చేసి రోడ్ల మీద తిరిగే వారికి కరోనా వైరస్ రాదని, కోటీశ్వరులు, విమానాల్లో తిరిగే వారికి ఆ వ్యాధి వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

లాక్ డౌన్ పక్కన పెట్టిన గ్యాంగ్ లీడర్

లాక్ డౌన్ పక్కన పెట్టిన గ్యాంగ్ లీడర్

కరోనా వైరస్ వచ్చిన వారు చాలా మంది విమానాల్లో తిరిగిన వారే అని మనం గుర్తు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యూటీ. ఖాదర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యూటీ. ఖాదర్ వ్యాఖ్యలతో స్థానికులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు షాక్ కు గురైనారు. నియోజక వర్గంలో పర్యటించిన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి సమాన దూరం పాటించకుండా మద్దతుదారులతో గుంపుగా వెళ్లడం వివాదానికి కారణం అయ్యింది.

దీపాలు వెలిగించి చప్పట్లు కొడితే కరోనా పారిపోతుందా ?

దీపాలు వెలిగించి చప్పట్లు కొడితే కరోనా పారిపోతుందా ?

చప్పట్లు కొట్టాలని, వంట పాత్రలు కొట్టాలని, దీపాలు వెలిగించాలని, కరోనాను తరిమికొట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు మాయమాటలు చెప్పి జిమ్మిక్కులు చేస్తున్నారని మాజీ మంత్రి యూటీ. ఖాదర్ ఎద్దేవ చేశారు. పేద ప్రజలకు కడుపునిండుకు భోజనం పెట్టాలని, ప్రజలకు మాయమాటలు చెప్పడం మానుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి సూచిస్తూ మాజీ మంత్రి యూటీ. ఖాదర్ ట్వీట్ చేశారు. గతంలో ఆరోగ్య, కుటుంబ సక్షేమ శాఖా మంత్రిగా పని చేసిన యూటీ ఖాదర్ కొంచెం వెరైటీగా మాట్లాడి ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారనే పేరు ఉంది.

English summary
COVID 19: Coronavirus Will Effect Only To Rich People says Karnataka former Minister and Congress MLA U T Khader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X