వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: యూపీ సీఎం కీలక నిర్ణయం, వారాంతాల్లో అన్నీ బంద్

|
Google Oneindia TeluguNews

లక్నో: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, పరిశ్రమలు మినహా శని, ఆదివారాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, మార్కెట్లను మూసివేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ మేరకు హోంశాఖ అదనపు కార్యదర్శి అవనీష్ కే అవస్తి ఆదివారం ప్రకటించారు.

అత్యవసర సరుకుల రవాణా, పరిశ్రమల్లో ఉత్పత్తి వంటి ఇతర ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి అవాంతరాలు ఉండవని స్పష్టం చేశారు. అలాగే వారాంతాల్లో సామాజిక కార్యకలాపాలపై కఠిన ఆంక్షలు ఉంటాయని తెలిపారు.
ఆ సమయంలో శానిటైజేషన్ వంటి పారిశుద్ధ్య పనులు జరుగుతాయన్నారు.

Coronavirus: Yogi issues fresh Unlock guidelines; markets in UP to be shut during weekends

ప్రభుత్వ తాజా నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో 55 గంటల మినీ లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇది జులై 13తో ముగియనున్న నేపథ్యంలో తాజాగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 35,092 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11,490 యాక్టివ్ కేసులున్నాయి. 22,689 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 913 మంది కరోనా బారిన పడి మరణించారు.

Recommended Video

RGV Reacts To Amitabh Bachchan Testing Positive For Covid-19 || Oneindia Telugu

ఇక దేశంలో ఇప్పటి వరకు 8,56,062 కరోనా కేసులు నమోదయ్యాయి. 2,91,691 యాక్టివ్ కేసులున్నాయి. 5,41,227 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 22,762 మంది కరోనాతో మరణించారు.

English summary
Amid coronavirus pandemic, Uttar Pradesh Chief Minister Yogi Adityanath on Sunday issued fresh 'Unlock' guidelines for the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X