డిఎ కేసు: జయలలితకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. బెంగుళూర్ కోర్టులో ఆ కేసు విచారణ సాగుతుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తనకు ఆపాదించిన ఆస్తుల విషయంలో అయోమయం ఉందని అంటూ జయలలిత విచారణను నిలుపుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దాంతో జూన్ 6వ తేదీ వరకు విచారణను నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు మేలో ఆదేశాలు జారింది. ఆ స్టేను తర్వాత జూన్ 16వ తేదీవరకు పొడిగించింది. ఇది జస్టిస్ విక్రమ్ జిత్ సేన్, శివ కీర్తి సింగ్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ ముందు సోమవారం విచారణకు వచ్చింది.

Corruption Trial Against Jayalalithaa to Resume, Rules Supreme Court

ట్రయల్ కోర్టులో జవాబు దాఖలు చేసే వరకు విచారణను నిలుపుదల చేయాలని జయలలిత తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. అయితే, సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది.

జయలలిత పిటిషన్‌పై ప్రతిస్పందనను దాఖలు చేయడానికి కోర్టు తమిళనాడు విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖకు వారం గడువు ఇచ్చింది. జయలలిత విజ్ఞప్తిని శాఖ సోమవారంనాడు వ్యతిరేకించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+