వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిమ్మతిరిగింది: కాస్మోస్ బ్యాంక్‌ సర్వర్ హ్యాక్ ... గంటలో రూ. 94 కోట్లు కొల్లగొట్టారు

|
Google Oneindia TeluguNews

Recommended Video

కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌లో భారీ చోరీ

పూణే: మనదేశంలో బ్యాంకులను కొల్లగొట్టడం సర్వసాధారమైపోయింది. ఇప్పటికే బ్యాంకులను చోరీ చేసేందుకు దుండగులు సరికొత్త సాంకేతికతను వినియోగిస్తున్నారు. తాజాగా పూణే వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌లో భారీ చోరీ జరిగింది. అయితే దుండగులు నేరుగా బ్యాంకుకు వచ్చి డబ్బును దోచుకోలేదు.. ఆన్‌లైన్‌లోనే మొత్తం పనికానిచ్చేశారు. గంటలోనే 94 కోట్ల రూపాయలు దేశంలోని ఇతర బ్యాంక్ అకౌంట్లలోకి దేశం బయట ఉన్న అకౌంట్లలోకి బదిలీ చేశారు.

భారత్‌లో రెండో అతిపెద్ద కోఆపరేటివ్ బ్యాంక్‌గా పేరుగాంచిన కాస్మోస్ బ్యాంక్ సర్వర్‌ను దుండగులు హ్యాక్ చేశారు. ఆగష్టు 11, ఆగష్టు 13వ తేదీన ఈ సర్వర్‌లు హ్యాకింగ్‌కు గురైనట్లు అధికారులు వెల్లడించారు. వారు వెంటనే చతుశ్రింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆగష్టు 11న మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బ్యాంకు సర్వర్‌ను హ్యాక్ చేసిన దుండగులు దాదాపు 15వేల లావాదేవీలు చేసినట్లు గుర్తించారు. ఇందులో మొత్తం రూ.80.5 కోట్లు ఆన్‌లైన్ ద్వారా మరో విదేశీ బ్యాంకు అకౌంట్లకు బదిలీ అయ్యాయి. ఇదంతా డెబిట్ కార్డుల ద్వారా ట్రాన్స్‌ఫర్ కాగా... మరో రూ.13.92 కోట్లు స్విఫ్ట్ పద్ధతిలో బదిలీ అయ్యాయి.

Cosmos bank server hacked, Hackers loot Rs.94 cr

లూటీకి గురైన డబ్బుల్లో రూ.78 కోట్లు హాంగ్ కాంగ్ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. అది కూడా ట్రయిల్ వేద్దామని అలా చేశారు దుండగులు. మరో రూ.2.5 కోట్లు మేరా నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా మరియూ వీసా ద్వారా లావాదేవీలు జరిపారు. సోమవారం రాత్రి 11:30 గంటలకు మరోసారి బ్యాంక్ సర్వర్‌ను దుండగులు హ్యాక్ చేశారని అధికారులు తెలిపారు. ఈసారి రూ.13.92 కోట్లను ALM ట్రేడింగ్ లిమిటెడ్ పేరుతో ఉన్న అకౌంట్‌కు బదిలీ చేశారు. ఈ అకౌంట్ హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ బ్యాంకుదిగా అధికారులు గుర్తించారు.

ఏటీఎం స్విచ్ సర్వర్‌ను దుండగులు హ్యాక్ చేసి అక్కడి నుంచే విదేశాలకు డబ్బును బదిలీ చేసినట్లు తెలుస్తోంది. బ్యాంకు నుంచి అప్రూవల్ వచ్చేలా హ్యాకర్లు తగు జాగ్రత్తలు తీసుకుని లావాదేవీలు జరిపారని కాస్మోస్ బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు కొన్ని వేలమంది బ్యాంక్ కస్టమర్లకు సంబంధించి వారి దగ్గరున్న డెబిట్ కార్డు వివరాలు కూడా హ్యాకర్లు హ్యాక్ చేసినట్లు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ... కాస్మోస్ బ్యాంక్‌ను 1906లో స్థాపించారు. దేశవ్యాప్తంగా దీనికి ఐదు కార్యాలయాలు ఉన్నాయి. ఏడు రాష్ట్రాల్లో 140 సర్వీస్ ఔట్‌లెట్లు ఉన్నాయి.

English summary
Pune-based Cosmos Co-operative Bank Ltd on Tuesday lodged a complaint against an unidentified person and a Hong Kong-based company after the server of its main branch was allegedly hacked twice and over Rs 94 crore transferred to accounts in India and outside the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X