వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను రేప్ చేసి, చంపేవాడే: ఎమ్మెల్యే అభ్యర్థిపై నటి అమీషా పటేల్ - బీహార్‌లో భయానక అనుభవం

|
Google Oneindia TeluguNews

సదరు ప్రాంతంతో సంబంధం లేకున్నా, సినీ నటుల పట్ల జనంలో ఉండే క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలూ స్టార్లతో ఎన్నికల ప్రచారం నిర్వహించడం తెలిసిందే. ప్రస్తుత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉన్నది. అలా ఓ ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థన మేరకు ప్రచారానికి వెళ్లిన తనకు భయానక అనుభవం ఎదురైందని, తృటిలో తాను రేప్, హత్య నుంచి తప్పించుకోగలిగానని ప్రముఖ నటి అమీషా పటేల్ చెప్పారు.

మోదీకి దగ్గరై ఏం సాధించారు?- ఆధార్ అడిగితే బేడీలా? -'ట్రావెన్‌కోర్’ ట్యాక్సులంటూ వైసీపీ ఎంపీ ఫైర్ మోదీకి దగ్గరై ఏం సాధించారు?- ఆధార్ అడిగితే బేడీలా? -'ట్రావెన్‌కోర్’ ట్యాక్సులంటూ వైసీపీ ఎంపీ ఫైర్

ఓబ్రా ఎల్జేపీ అభ్యర్థి కోసం..

ఓబ్రా ఎల్జేపీ అభ్యర్థి కోసం..


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికే చెందిన లోక్ జనశక్తిపార్టీ(ఎల్జేపీ) ఒంటరిగా బరిలోకి దిగింది. ఔరంగాబాద్ జిల్లాలోని ఓబ్రా నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున ప్రకాశ్ చంద్ర పోటీలో ఉన్నారు. తొలి దశలో భాగంగా బుధవారం ఓబ్రాలో పోలింగ్ మొదలయ్యే సమయానికి ప్రకాశ్ చంద్రపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అతని కోసం ప్రచారానికి వెళ్లగా.. భయానక అనుభవాన్నిచవిచూడాల్సి వచ్చిందని నటి అమీషా పటేల్ మీడియాకు తెలిపారు. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల ప్రచారం ముగిసిన సోమవారం(26న) వరుస ఘటనలు జరిగాయని, ఆ తర్వాత కూడా బెదిరింపులు, బ్లాక్ మెయిల్ కొనసాగిందని హీరోయిన్ చెప్పారు. అసలేం జరిగిందంటే..

నిమ్మగడ్డతో ఢీ: జగన్‌కు భగపాటు - కేంద్ర బలగాలతో ఏపీలో ఎన్నికలు - సుప్రీంకోర్టు చెప్పిందిదే: రఘురామనిమ్మగడ్డతో ఢీ: జగన్‌కు భగపాటు - కేంద్ర బలగాలతో ఏపీలో ఎన్నికలు - సుప్రీంకోర్టు చెప్పిందిదే: రఘురామ

రాత్రికి అక్కడే ఉండాలంటూ..

రాత్రికి అక్కడే ఉండాలంటూ..

‘‘తన ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా ప్రకాశ్ చంద్ర మా అసిస్టెంట్ల ద్వారా నన్ను సంప్రదించాడు. తీరా బీహార్ వెళ్లిన తర్వాతగానీ అతని రంగు బయటపడలేదు. చివరి రోజైన 26న ప్రచారం కోసమని అతని అనుచరులు నన్నొక గ్రామానికి తీసుకెళ్లారు. ఆ రోజు సాయంత్రమే ముంబైకి రిటన్ ఫ్లైట్ ఎక్కాల్సి ఉన్నా, నన్ను కదలనీయలేదు. కారులో వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఓ ఇంట్లో బంధించారు. రాత్రికి అక్కడే ఉండాలని, కాసేపట్లో వచ్చేస్తానని ప్రకాశ్ చంద్ర ఫోన్లోనే బెదిరించారు. ఒక నేతలా కాకుండా అచ్చమైన రౌడీ లాగా అతను వ్యవహరించాడు. ఆ తర్వాత..

కచ్చితంగా రేప్ చేసేవాళ్లే..

కచ్చితంగా రేప్ చేసేవాళ్లే..


ఎటూ కదల్లేని స్థితిలో నేను, నా టీమ్ అక్కడే బిక్కుబిక్కుమంటూ కాలం గడిపేశాం. వాళ్ల మాట వినకపోయి ఉంటే ఆ రోజు నన్ను కచ్చితంగా రేప్ చేసి, చంపేసేవాళ్లేమో. చివరికి ఎలాగోలా మంగళవారానికి ముంబై చేరుకోగలిగాను. ఆ తర్వాత కూడా ప్రకాశ్ చంద్ర నాకు ఫోన్లు చేసి బెదిరింపులు, బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. బీహార్ లో నాకు ఎదురైన భయానక అనుభవంపై చట్టపరంగా పోరాడే అవకాశాలను ఆరా తీస్తున్నాను'' అని అమీషా పటేల్ వివరించారు. అయితే, నటి ఆరోపణణలను ఎల్జేపీ నేత ప్రకాశ్ చంద్ర ఖండించారు. ఆమె ప్రచానికి వచ్చిన మాట నిజమే అయినప్పటికీ, హత్యాచారయత్నం ఆరోపణలు వాస్తవం కాదన్నారు.

English summary
Bollywood actress Ameesha Patel has said she feared for her life when she was in Bihar recently campaigning for an LJP candidate in the assembly election. The leader, however, has denied the allegations. Ameesha Patel said she “could have been raped and killed” while she was on the campaign trail in Bihar's Daudnagar and that she “had to play along” to save her life and “get out”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X