వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళపై కౌన్సిలర్ తమ్ముడి దాష్టీకం : పిడిగుద్దులు కురిపించి, కాలితో తన్ని ...

|
Google Oneindia TeluguNews

చండీగఢ్ : అప్పు తీసుకోవడమే ఆమె పాలిట శాపమైంది. తీసుకున్న అప్పు సకాలంలో తీర్చకపోవడం .. సదరు అసలుదారు రెచ్చిపోయాడు. మహిళ అని కూడా చూడకుండా కాలితో తన్ని తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ దురాగతాన్ని ఒకర వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం స్పందించింది. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది.

మహిళ అని చూడకుండా ..
ఈ ఫోటోలో కనిపిస్తోన్న మహిళే సదరు బాధితురాలు. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ రాకేశ్ చౌదరి సోదరుడు వద్ద నుంచి అప్పు తీసుకుంది. అయితే తీసుకున్న అప్పును తీర్చకపోవడంతో కౌన్సిలర్ సోదరుడు విశ్వరూపం ప్రదర్శించాడు. ఇంట్లో ఉన్న మహిళను లాక్కొచ్చాడు. మహిళపై దాడిచేశాడు. అతనితో ఉన్న ఇద్దరు కూడా తన ప్రతాపాన్ని చూపించారు. ఇంతటితో ఆగకుండా కిందపడినా బాధితురాలిని కాలితో తన్ని తన కసి తీర్చుకున్నాడు కౌన్సిలర్ తమ్ముడు. అయితే కౌన్సిలర్ తమ్ముడు అరాచకాన్ని ఒకరు వీడియో తీశారు. ఇంకేముంది ఆ వీడియో వైరలవడంతో పంజాబ్ సర్కార్ స్పందించింది.

councilor brother beat women

చర్యలు తప్పవు ...
మహిళలపై దాడిచేసిన వారిని అదుపులోకి తీసుకున్నామని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ స్పష్టంచేశారు. ఐపీసీ 307 సెక్షన్ కింద హత్యాయత్నం కింద కేసు పెట్టినట్టు పేర్కొన్నారు. మహిళలపై దాడులను సహించబోమని స్పష్టంచేశారు. శాంతి భద్రతలక విఘాతం కలిగించేటట్టు ప్రవర్తించేవారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు. ఎంతటివారినైనా సరే చట్ట ముందు సమానులేనని .. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కుండబద్దలు కొట్టారు.

English summary
The loan was taken from the brother of Municipal Corporation Councilor Rakesh Chaudhary. However, the councilor's brother had a universal appearance as he did not meet the debt. A woman in the house Attacked the woman. The two who had accompanied him showed his prayers. Despite this, the councilor's younger brother had kicked the victim's foot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X