ఉగ్రవాదుల మృతిపై బీజేపీలో భిన్న వాదనలు .. 250 మంది చనిపోయారన్న షా .. లెక్కచెప్పలేమన్న మంత్రులు
న్యూఢిల్లీ : బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై వైమానిక దళం చేసిన దాడులు అధికార బీజేపీలోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. 250 మంది ఉగ్రవాదులు చనిపోయారని రెండురోజుల క్రితం బీజేపీ చీఫ్ అమిత్ షా పేర్కొన్నారు. దీంతో విపక్షాలు ఎదురుదాడికి దిగాయి. దాడులకు సంబంధించిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశాయి. ఈ అంశం అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.

ఆధారాలే కావాలా ?
పాకిస్థాన్ లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై వాయుసేన జరిపిన దాడులకు సంబంధించి ఆధారాలు చూపమని విపక్షాలు నిలదీయడంతో అధికార బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయింది. దీంతో వెంటనే రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. విపక్షాలు చేస్తోన్న ఆరోపణలు ఇక ఆపాలని కోరారు. మీరు మన సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలను చూసి గర్వించండి .. అంతే తప్ప దాడులకు సంబంధించి ఆధారాలు చూపాలని అనడం వారిని తక్కువ చేసినట్లవుతోందని స్పష్టంచేశారు.

ఎంతమందో వెల్లడించం ?
బాలాకోట్ దాడిలో మృతిచెందిన ఉగ్రవాదుల సంఖ్యను ఇవ్వబోమని తేల్చిచెప్పారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్. బాలాకోట్ శిక్షణ శిబిరం వద్ద ఎన్ని ఫోన్లు పనిచేశాయ వివరించామన్నారు. ఉగ్ర శిబిరంలోని భవనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. భారత గగనతలం నుంచి వాయుసేన ఫైటర్లు వెళ్లిన 25 నిమిషాల్లోనే తమ లక్ష్యాన్ని పూర్తిచేశారని చెప్పారు. ఇది అతిపెద్ద విజయం .. కానీ మీకు ఉగ్రవాదులు ఎందరూ చనిపోయారనే లెక్కలే ప్రాధాన్యమని విమర్శించారు. దాడులకు సంబంధించిన అధికార వివరాలను ప్రభుత్వమే చెబుతోంది. వాయుసేన వర్గాలు వెల్లడించబోవు. ఏ పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా లెక్కగట్టి ఉంటారని .. ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయితే మృతుల సంఖ్య పెరుగొచ్చు .. మేం ఊహాగానాలను మాత్ర విశ్వసించబోమన్నారు రవిశంకర్ ప్రసాద్.

సైనిక చర్యే ...
గత నెల 26న బాలాకోట్ లో జరిగిన దాడి సైనిక చర్య కాదన్నారు రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. వైమానిక సిబ్బంది జరిపిన దాడుల్లో పౌరులు మాత్రం చనిపోలేదని .. ఉగ్రవాదులు మృతిచెందారని చెప్పారు. అయితే ఎంతమంది చనిపోయారనే అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు.

మొక్కలు ఫోన్లు వాడవు కదా ..?
బాలాకోట్ దాడి తర్వాత ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారే త్వరలో తెలుస్తోందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. కానీ కొందరు రాజకీయ నేతలు వాయుసేన .. ఎందరూ ఉగ్రవాదులను మట్టుబెట్టారని పదే పదే ప్రశ్నిస్తోందని .. ఆ సమయంలో శిబిరం వద్ద 300 ఫోన్లు యాక్టివ్ గా ఉన్నాయని ... దీంతో అంతమందే ఉండి ఉంటారని, ఈ అంశాన్ని మీకే ఊహాకే వదిలేస్తున్నామని స్పస్టంచేశారు. ఆ శిబిరంలో ఉన్న మొక్కలు, చెట్లు మాత్రం మొబైల్ ఫోన్లు వాడవు కదా అని వ్యంగ్యాస్త్రం సంధించారు.
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications