నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీహరికోటలో పీఎస్ఎల్వీ సీ50 కౌంట్‌డౌన్ షురూ: నేడే నింగిలోకి

|
Google Oneindia TeluguNews

శ్రీహరికోట: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ50 వాహన నౌకను పంపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం 2.41గంటలకు ప్రారంభమైంది.

ఈ కౌంట్‌డౌన్ నిరంతరాయంగా 25 గంటలపాటు కొనసాగనుంది. కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే గురువారం సాయంత్రం 3.41 గంటలకు పీఎస్ఎల్వీ సీ50 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. దీని ద్వారా మనదేశానికి చెందిన సీఎంఎస్-01 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

 Countdown begins for PSLV launch today from Sriharikota

సీఎంఎస్-01 మనదేశానికి చెందిన 42వ కమ్యూనికేషణ్ ఉపగ్రహం కావడం గమనార్హం. దీని బరువు 1410 కిలోలు. ఈ ప్రయోగంతో ఇంటర్నెట్ సేవలు మరింత మెరుగవనున్నాయి.

Recommended Video

ISRO's PSLV-C49 Successful: India's earth observation satellite and 9 others

ఎస్‌డీఎస్‌సీ నుంచి ప్రయోగిస్తున్న పీఎస్ఎల్వీ 77వ లాంచ్ వెహికిల్ మిషన్. వాహన వివిధ దశల్లో ఇంధనాన్ని నింపే ఆపరేషన్ కొనసాగుతోందని షార్ అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం 3.10 గంటల నుంచి ఈ ప్రయోగాన్ని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

English summary
The countdown commenced on Wednesday for the launch of the Polar Satellite Launch Vehicle (PSLV)-C50 to place the communication satellite CMS-01 in orbit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X