వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ విజయాలు Vs రాహుల్ విజయాలు: కాంగ్రెస్‌కు అదే స్టైల్లో బీజేపీ కౌంటర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గత కొంత కాలంగా ప్రధాని మోడీ, బీజేపీపై తీవ్ర విమర్శల దాడి కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ కూడా అదే రీతిలో రాహుల్ గాంధీకి కౌంటర్లు ఇస్తూ వస్తోంది. తాజాగా మరోసారి రాహుల్ గాంధీ ఎలాగైతే విమర్శలు చేశారో.. అదే రకంగా బీజేపీ తిప్పికొట్టింది.

రాజస్థాన్ సంక్షోభంపై రాహుల్ తొలిసారి..

రాజస్థాన్ సంక్షోభంపై రాహుల్ తొలిసారి..

తాజాగా, రాహుల్ గాంధీ రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై స్పందిస్తూ.. బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. కాగా, రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై రాహుల్ గాంధీ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇప్పటి వరకు జరిగిన కొన్ని ఘటనలను ఊటంకిస్తూ ఇవన్నీ మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాహుల్.

మోడీ విజయాలివేనంటూ రాహుల్ చురకలు..

కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలివేనంటూ పలు అంశాలను ప్రస్తావించారు.

ఫిబ్రవరి: హలో ట్రప్
మార్చి: మధ్యప్రదేశ్‌లో (కాంగ్రెస్)ప్రభుత్వ కూల్చివేత
ఏప్రిల్: కరోనాపై పోరుకు కొవ్వొత్తులను వెలిగించడం
మే: మోడీ ప్రభుత్వానికి ఆరో వార్షికోత్సవం
జూన్: బీహార్‌లో వర్చూవల్ ర్యాలీ
జులై: రాజస్థాన్‌లో (కాంగ్రెస్) ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్ర అంటూ రాహుల్ ట్వీట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలతో భారత్ కరోనాపై పోరాటంలో స్వయం సమృద్ధి సాధించిందని రాహుల్ చురకలంటించారు.

రాహుల్‌కు అదే స్టైల్లో కౌంటర్..

ఇక రాహుల్ గాంధీ విమర్శలకు అదే స్థాయిలో బీజేపీ కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సాధించిన విజయాలంటూ పలు అంశాలను ప్రస్తావిస్తూ ఘాటుగా విమర్శించింది. ట్వీట్లకే పరిమితమైన పార్టీగా కాంగ్రెస్ దిగజారిపోయిందని ఎద్దేవా చేశారు కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్.

Recommended Video

Sushant Singh Rajput లాగే నేను కూడా Nepotism ఫేస్ చేసా : Prakash Raj

రాహుల్ గాంధీ విజయాలు చూస్తే..

కాంగ్రెస్, రాహుల్ విజయాలివేనంటూ జవదేకర్ ప్రస్తావించిన అంశాలివే.

ఫిబ్రవరి: షాహీన్ బాగ్ అల్లర్లు
మార్చి: జ్యోతిరాదిత్య సింధియా తోపాటు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోల్పోవడం
ఏప్రిల్: వలస కూలీలను ప్రేరేపించడం
మే: చారిత్రక ఎన్నికల ఓటమికి ఆరో వార్షికోత్సవం
జూన్: చైనా తరపున వకల్తా పుచ్చుకోవడం
జులై: రాజస్థాన్‌లో పార్టీని కూల్చుకోవడం అంటూ రాహుల్ గాంధీకి ఆయన స్టైల్లోనే కౌంటర్ ఇచ్చారు.

English summary
Counter for Congress Neta's Attack: Javadekar Lists Rahul Gandhi's Achievements Of 6 Months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X