వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోస్టల్ బ్యాలెట్ లో దూసుకుపోతున్న బీజేపీ.. కౌంటింగ్ స్టార్ట్

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో బిజెపి దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా బిజెపి తన ఆధిక్యాన్ని ఆదిలోనే కనబరుస్తుంది.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ, ఎన్టీయే పక్షాలకు ఎక్కువ ఓట్లు పోల్ అయినట్లు తెలుస్తోంది . కాంగ్రెస్, యూపీఏ పక్షాలు అతి స్వల్ప ఓట్లు దక్కించుకుంటున్నాయి. ఈ రకంగా చూస్తే... మరోసారి బీజేపీ లేదా ఎన్డీయే పక్షాలతో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Counting starts, NDA opens account with an early lead in postal ballot

కర్ణాటక, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, గుజరాత్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మైసూర్‌ లోక్ సభ స్థానంలో బీజేపీ మందంజలో ఉన్నట్లు తెలిసింది. దేశ వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ముందుంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో 16 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.వారణాసిలో ప్రధాని మోదీ ఆధిక్యంలో ఉన్నారు.అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు, అభ్యర్థి రాహుల్ గాంధీ లీడ్ లో ఉన్నారు.

English summary
After two months of high-octane campaigning, controversy over EVM tampering and violations of the Model Code of Conduct (MCC), the D-Day has arrived for the world's largest democracy. Counting for the Lok Sabha at 4,000 centres has started across the country and the early trends will start trickling in soon. In early trends on postal ballot counting, BJP-led NDA has taken an early lead over the Congress-led UPA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X