వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్‌లో ఈవీఎంల ట్యాంపరింగ్ - షాకింగ్ ఆరోపణలపై ఈసీ వివరణ -ఫలితాలపైనా క్లారిటీ ఇచ్చేశారు

|
Google Oneindia TeluguNews

ఒక్క బటన్ తో ఓట్ల లెక్క తేలిపోతుంది.. మొత్తంగా మధ్యాహ్నంలోపు ట్రెండ్స్ వచ్చేస్తాయి.. సాయంత్రానికి ఫుల్ పిక్చర్ చేతిలో ఉంటుంది.. కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఈ పరిస్థితి లేదు. అందుకు గలా కారణాలను ఎన్నికల సంఘం సావధానంగా వివరించింది. అలాగే, బీహార్ లో ఈవీఎంలను ట్యాంపర్ చేశారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన సంచలన ఆరోపణలపైనా ఈసీ క్లారిటీ ఇచ్చింది..

Recommended Video

#Biharelectionresults2020: EVMs Are Robust, Tamper-Proof, SC Upheld Its Integrity More Than Once: EC

అమెరికా తరహాలో బీహార్ కౌంటింగ్ -రాత్రి దాకా తుది ఫలితాలు రావు -మధ్యాహ్నానికి 20శాతమే -కారణాలివేఅమెరికా తరహాలో బీహార్ కౌంటింగ్ -రాత్రి దాకా తుది ఫలితాలు రావు -మధ్యాహ్నానికి 20శాతమే -కారణాలివే

రాత్రి తర్వాతే ఫలితాలు..

రాత్రి తర్వాతే ఫలితాలు..

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు మంగళవారం రాత్రి తర్వాతే వెలువడుతాయని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం కరాకండిగా చెప్పేసింది. కౌంటింగ్ ఆలస్యంపై సర్వత్రా గందరగోళం నెలకొనడంతో బీహార్ సీఈవో హెచ్ ఆర్ శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్లు చంద్రభూషణ్ కుమార్, సందీప్ జైన్ లు మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మేరకు వారు పలు కీలక అంశాలను వెల్లడించారు..

ఈవీఎంలు, రౌండ్లు పెరిగినందుకే..

ఈవీఎంలు, రౌండ్లు పెరిగినందుకే..

బీహార్ లో ఈసారి దాదాపు 4 కోట్ల ఓట్లు రాగా, కౌంటింగ్ డే మంగళవారం మధ్యాహ్నం 2గంటల సమయానికి కేవలం 1.2 కోట్ల ఓట్లను మాత్రమే లెక్కించినట్లు ఈసీ తెలిపింది. 2015తో పోల్చుకుంటే ఈసారి కరోనా పరిస్థితుల వల్ల పోలింగ్ బూత్ లను పెంచామని, దాంతో గతంలో కంటే 63 శాతం ఎక్కువ ఈవీఎంలను వినియోగించామన్నారు. కౌంటింగ్ ప్రక్రియలోనూ కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఒక్కో నియోజకవర్గానికి గరిష్టంగా 35 రౌండ్ల కౌంటింగ్ ఏర్పాట్లు చేశామని తెలిపింది. టేబుళ్ల సంఖ్య 14 నుంచి గరిష్టంగా 55కు పెంచామన్నారు. సిబ్బంది పనిలో తేడా లేకున్నా, వారు లెక్కించే ఓట్ల కౌంట్ తక్కువగా ఉండటమే ఫలితాల ఆలస్యానికి ప్రధాన కారణమని, మంగళవారం రాత్రి వరకు కౌంటింగ్ కొనసాగే అవకాశముందని ఈసీ తెలిపింది.

 ఈవీఎంల ట్యాంపరింగ్..

ఈవీఎంల ట్యాంపరింగ్..

ఈవీఎంల ట్యాంపరింగ్..
బీహార్‌లో కౌంటింగ్ మొదలైన కాసేపటికే.. మందకోడిగా సాగుతున్నా.. అప్పటికి 10 శాతం ఓట్లు కూడా లెక్కపెట్టకున్నా ఎన్డీయే ఆధిక్యాల పరంగా మెజారిటీ మార్క్‌ను దాటడం అనుమానాలకు తావిస్తున్నదని, ఈవీఎల ట్యాపరింగ్ జరిగి ఉండొచ్చని కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. భూమిపై నుంచే పరికరాలతో అంగారకుడు, చంద్రుడి దశాదిశలను నిర్దేశిస్తుంటే ఈవీఎంలను ఎందుకు హ్యాక్ చేయలేరని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ట్వీట్ చేశారు. కౌంటింగ్ వేళ ఆయన లేవనెత్తిన అనుమానాలు చర్చనీయాంశం కావడంతో ఈసీ వివరణ ఇచ్చుకుంది..

ఈవీఎంల సమగ్రతపై సందేహాలొద్దు..

ఈవీఎంల సమగ్రతపై సందేహాలొద్దు..

మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మ్యాజిక్ ఫిగర్ 122కాగా, తాజా అప్ డేట్ ప్రకారం.. ఎన్డీఏ కూటమి 120 స్థానాల్లో, మహాకూటమి 110 స్థానాల్లో, ఎల్జేపీ 3, ఇతరులు 10 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మహాకూటమిలోని కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే ఈసారి లీడింగ్ సీట్లు తగ్గడంతో ఆ పార్టీ నేతలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఎంలను ట్యాంపర్ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురయ్యే అవకాశమే లేదని, వాటి సమగ్రతపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. కాంగ్రెస్ నేతల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని కరాకండిగా చెప్పింది.

బైడెన్‌కు భారీ షాక్: ట్రంప్ అనూహ్య ఎత్తుగడ -ఎన్నికల అక్రమాలపై ప్రజల్లోకి -కీలక రాష్ట్రాల్లో ర్యాలీలుబైడెన్‌కు భారీ షాక్: ట్రంప్ అనూహ్య ఎత్తుగడ -ఎన్నికల అక్రమాలపై ప్రజల్లోకి -కీలక రాష్ట్రాల్లో ర్యాలీలు

English summary
Chief Electoral Officer (CEO) of Bihar, HR Srinivas said counting to go on late tonight. speaking to media on tuesday noon, EC says the pace of counting is the same as always. However, the results might be slightly delayed due to increase in EVMs. Counting delay explained in numbers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X