వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మత విశ్వాసాల ప్రకారం విడిపోవడం దేశానికి మంచిదికాదు: కార్డినల్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశం మతాల వారీగా విభజించబడడడం ప్రజాస్వామ్యానికి మంచింది కాదని క్యాథలిక్ క్రిస్ట్రియన్ల అత్యున్నత సంఘం (సిబిసిఐ)అధ్యక్షుడు కార్డినల్ అభిప్రాయపడ్డారు.. సెక్యులర్ దేశంగా ఇండియా ఉండాలనేది తన అభిమతమన్నారు.కానీ, దేశం మతాల వారీగా విడిపోవడం వల్ల ఇబ్బందులు ఎదురౌతాయన్నారు. దీనికి వ్యతిరేకంగా తాను పోరాటం చేయనున్నట్టు చెప్పారు.

కార్డినల్ ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.మత గురువులు, పూజారులపై దాడులను ఆయన ప్రస్తావించారు. సాత్నాలో చోటు చేసుకొన్న దాడులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Country being divided, losing faith in govt: Catholic body

అయితే నిందితులను అరెస్ట్ చేయకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.ఈ దాడులకు పాల్పడిన కుట్రదారులను వదిలేసి అమాయకులను పేదలపై కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనలతో ప్రభుత్వంపై తమకు విశ్వాసం సన్నగిల్లిందని కార్డినల్ అభిప్రాయపడ్డారు.అయితే అతి పెద్ద దేశంలో ఈ తరహ ఘటనలు జరుగుతాయనే దాన్ని తాము అర్ధం చేసుకొంటామని చెప్పారు. కానీ, ఈ ఘటనల తర్వాత ప్రభుత్వం బాధితులకు ఏ రకమైన రక్షణ కల్పిస్తోందనే విషయం కూడ ఆధారపడుతోందని ఆయన గుర్తు చేశారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్నా సమీపంలో సుమారు 30 మంది మత గురువులు, మత ప్రచార సభలను అడ్డుకొన్నారు. నిర్భందించారని ఆయన చెప్పారు.త పోలీసులతో పాటు భజరంగ్‌దళ్ కార్యకర్తలు బలవంతంగా మతమార్పిడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మత మార్పిడుల కింద బలవంతంగా ఓ మత గురువును అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు.

ఈ ఘటనలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి బాధితులకు న్యాయం చేయాలని తమ ప్రతినిధి బృందంతో కలిసి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు.బాధితులకు రక్షణ కల్పించాలని కార్డినల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దాడుల వెనుక ఉన్న కుట్రదారులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
“The country is being divided on the basis of religious belief. It is bad in a democratic country. I want my country to be united in a secular fabric. the Cardinal said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X