వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వలింగసంపర్కం నేరం కాదన్న సుప్రీం తీర్పును స్వాగతించిన కరణ్ జోహార్

|
Google Oneindia TeluguNews

స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై దేశవ్యాప్తంగా ఉన్న స్వలింగసంపర్కులు సంబరాలు చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పలువురు సెలబ్రిటీలు కూడా స్వాగతించారు. ఇందులో ముందువరసలో నిలిచారు బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్. ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పు చెప్పిన మరుక్షణమే బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ ట్విటర్ వేదికగా స్పందించారు.

Recommended Video

గే సెక్స్ నేరం కాదు : సుప్రీం కోర్టు సంచలన తీర్పు

గే సెక్స్ నేరం కాదు: స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పుగే సెక్స్ నేరం కాదు: స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

"స్వలింగ సంపర్కం నేరం కాదని చారిత్రాత్మక తీర్పును సుప్రీం కోర్టు ఇవ్వడం చాలా ఆనందం కలిగించింది. ఈ రోజు చాలా గర్వంగా ఉంది. ఐపీసీ 377ను రద్దు చేయడం మానవాళికి, సమానహక్కులకు గొప్ప విజయం. దేశానికి తిరిగి ఆక్సిజన్ లభించింది" అంటూ కరణ్ జోహార్ ట్వీట్ చేశారు. కరణ్ ట్వీట్‌ను మరికొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు ఫాలో అయ్యారు. అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్, అర్జున్ కపూర్, వరుణ్ ధవన్, స్వరభాస్కర్, రిచా చడ్డా, దియా మీర్జా, విక్కీ కౌషల్, ఆయుష్మాన్ ఖురాన్‌లాంటి సెలబ్రిటీలు ఫాలో అయ్యారు.

Country gets its Oxygen back says Karan johar on abolition of IPC 377

ప్రజలు స్వలింగసంపర్కం గురించి మాట్లాడుకుంటున్నారని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. మనదేశంలో కూడా కొంతమంది పనికొచ్చే నిర్ణయాలు చేస్తుండంటం సంతోషించదగ్గ విషయం అని ఈ తరం అలాంటి వారిని చూస్తోందని అర్జున్ కపూర్ ట్వీట్ చేశారు. ఎప్పుడో 1860లో ఉన్న చట్టం రద్దు అయ్యింది. దేశం మొత్తం గర్వపడే విషయమని చెబుతూ .... సెక్షన్ 377కు గుడ్‌బై చెప్పారు వరుణ్ ధవన్. ఐపీసీ సెక్షన్ 377 రద్దు చేయాలని పోరాడి విజయం సాధించిన వారికి నటి స్వరభాస్కర్ అభినందనలు తెలిపారు. వారి పోరాట ఫలితమే నేడు 377 సెక్షన్ రద్దయిందని ట్వీట్ చేసింది. ఈ రోజు కొత్త సూర్యుడు ఉదయించాడని భారత్ ప్రగతిలో ముందుకు దూసుకెళుతుందని అయుష్మాన్ ఖురానా ట్వీట్ చేశారు.

English summary
Karan Johar was the first celebrity to welcome the Supreme Court's landmark judgement abolishing Section 377, under which homosexuality was a criminal offence, in a tweet posted minutes after the verdict was read out by Chief Justice Dipak Misra. "Historical judgement. So proud today. Decriminalising homosexuality and abolishing #Section377 is a huge thumbs up for humanity and equal rights. The country gets its oxygen back," tweeted the 46-year-old filmmaker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X