వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో 2.58 లక్షల కేసుల నమోదు - పాజిటివిటీ రేటు పెరుగుదల : మరిన్ని ఆంక్షలు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న మరణాల సంఖ్య పెరగకపోవటంతో ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. థర్డ్ వేవ్ విస్తరిస్తున్న వేళ..దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కేసుల తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2.58 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతం రోజుతో పోల్చితే 5 శాతం స్వల్ప తగ్గుదల నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో దేశంలో మొత్తంగా 3.73 కోట్ల కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి.

పెరుగుతున్న పాజిటివిటీ రేటు

పెరుగుతున్న పాజిటివిటీ రేటు

అందులో 8,209 ఓమిక్రాన్ కేసులు ఉన్నాయి. 4.43 శాతం యాక్టివ్ కేసులు ప్రస్తుతం ఉన్నట్లుగా గుర్తించారు. అదే సమయంలో రోజు వారీ పాజిటివిటీ రేటు శాతం 16.28 శాతం నుంచి 19.65 శాతానికి పెరిగింది. ఈ వారంలో 14.41 శాతం పాజిటివిటీ రేటు రికార్డు అయింది.

దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ఇప్పటి వరకు 157.20 కోట్ల మందికి పంపిణీ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. మహారాష్ట్రలో కేసుల తీవ్రత భారీగా ఉంది. తాజాగా 41,327 కేసులు నమోదయ్యాయి. గతం రోజు కంటే 1,135 కేసులు తగ్గినట్లుగా వెల్లడించారు. మహారాష్ట్రలో తాజాగా 8 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

అయిదు రాష్ట్రాల్లో భారీగా కేసులు

అయిదు రాష్ట్రాల్లో భారీగా కేసులు

మొత్తంగా ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలో 1,738గా నిర్దారించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం 18,286 కేసులు నమోదు కాగా, 28 మంది మరణించారు. 3.64 శాతం నుంచి 27.87 శాతానికి పాజిటివిటీ రేటు తగ్గింది. మూడు రెట్లు అధికంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

60 ఏళ్ల వయసు లోపల ఉన్నవారు కోవిడ్ లక్షణాలు లేకుండా పరీక్షలు అవసరం లేదని తాజాగా కేంద్రం స్పష్టం చేసింది. తాజాగా కేరళలో 158, బెంగాల్ లో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఇప్పటి వరకు మహారాష్ట్రాలో 1,41,808 మంది, కేరళలో 50,832 మంది, కర్ణాటకలో 38,431, తమిళనాడులో 36,989, ఢిల్లీలో 25,363, ఉత్తర ప్రదేశ్ లో 22,963 మంది, పశ్చిమ బెంగాల్ లో 20,088 సంఖ్యగా నిర్ధారించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆంక్షల అమలు

తెలుగు రాష్ట్రాల్లో ఆంక్షల అమలు

కరోనా గుర్తించిన తరువాత 2019 నుంచి ఇప్పటి వరకు చైనాలో 5,480,481 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. పాజిటివిటీ రేటు ఏపీలో 11 శాతానికి పెరిగింది. దాదాపుగా 5 వేల కేసులు నమోదు కావటంతో ముఖ్యమంత్రి జగన్ కీలక సమీక్ష ఏర్పాటు చేసారు. తెలంగాణలో ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో కరోనా ఆంక్షల పైన నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.

English summary
country reported 2.58 lakh cases, which is around 5 per cent lower than yesterday. As many as 385 people have died of Covid during the past 24-hour period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X