Couple: పట్టువస్త్రాల వ్యాపారం, దంపతుల దారుణ హత్య, రోడ్డు పక్కన అర్దనగ్నంగా శవాలు !
చెన్నై/కాంచీపురం/రాణిపేట్: చేనేత వస్త్రాలు, పట్టు వస్త్రాల వ్యాపారం చేస్తున్న దంపతులు కొంతకాలం డబ్బులు బాగానే సంపాదించారు. వ్యాపారం చెయ్యడానికి ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల దగ్గర దంపతులు అప్పులు చేశారని తెలిసింది. సరైన సమయంలో అప్పులు తీర్చలేక సతమతం అవుతున్న దంపతులు అర్దనగ్నంగా పొదల్లో దారుణ హత్యకు గురై శవాలై కనిపించడం కలకలం రేపింది.
తమిళనాడులోని కాంచీపురంలో మచ్చికం (52) అనే ఆయన అతని భార్య రాణి (45)తో కలిసి జీవిస్తున్నాడు. మచ్చికం, రాణి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. చేనేత వస్త్రాలు, పట్టు వస్త్రాల వ్యాపారం చేస్తున్న మచ్చికం, రాణి దంపతులు కొంతకాలం డబ్బులు బాగానే సంపాదించారు.

Aunty
:
ప్రియురాలి
మోజులో
అంకుల్,
కొడుకుతో
కలిసి
ఆంటీని
చంపేసి
?,
కూతురి
దెబ్బతో
సీన్
రివర్స్
!
అప్పులు ఇచ్చిన వాళ్లు తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలని మచ్చికం, రాణి దంపతుల మీద ఒత్డిడి చేశారు. ఇదే సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన మచ్చికం, రాణి దంపతులు మాయం అయ్యారు. తమిళనాడులోని అరక్కోణం సమీపంలోని మిల్లన్ సరస్సు సమీపంలోని ముళ్లపోదల్లో మచ్చికం, అతని భార్య రాణి అర్దనగ్నంగా హత్యకు గురై శవాలై కనిపించడం కలకలం రేపింది.
హత్యకు గురైన రాణి వన్నియార్ సంఘం నాయకుడి సోదరి కావడం కలకలం రేపింది. అప్పులు ఇచ్చిన వాళ్లే మచ్చికం, రాణి దంపతులను హత్య చేసి శవాలు ముళ్ల పొదల్లో విసిరేశారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దంపతులు ఒకేసారి దారుణ హత్యకు గురికావడం తమిళనాడులో కలకలం రేపింది.