దారుణం: చెట్టుకు వేలాడుతూ దంపతుల శవాలు
సీతాపూర్: ఆ దంపతులు సాయంత్రం మార్కెట్‌కు వెళ్లారు. తెల్లారి చెట్టుకు వేలాడుతూ శవాలైన కనిపించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖైరాబాద్ ప్రాంతంలోని ముసేరిపూర్ గ్రామంలో దంపతుల శవాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయని పోలీసులు మంగళవారంనాడు తెలిపారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం - శంభు (40), అతని భార్య కమల (35) సోమవారం సాయంత్రం కాస్రేలా మార్కెట్‌కు వెళ్లారు. ఆ తర్వాత గ్రామం వెలుపల గల చెట్టుకు వారిద్దరి శవాలు వేలాడుతూ కనిపించాయి.

ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు గత రాత్రి అందింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వారిని హత్య చేసి ఉంటారని దంపతుల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇరువురి మధ్య తలెత్తిన వివాదం దానికి కారణం కావచ్చునని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications